
కొన్నాళ్ల ముందు రిలీజైన 'రాజాసాబ్' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 5న మూవీ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమా మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లెక్క ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 10న 'రాజాసాబ్'ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం మిగిలిన సీన్స్ అన్ని పూర్తిచేసే పనిలో టీమ్ అంతా ఉంది. త్వరలో సాంగ్స్ చిత్రీకరణ కోసం ఫారిన్ కూడా వెళ్లనున్నారు. అలాంటిది ఇప్పుడు 'రాజాసాబ్' సంక్రాంతికి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)
'రాజాసాబ్' ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ వాయిదా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థల డిసెంబర్ డీల్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జనవరికి అయితే ఒకటి రెండింటివి ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే 'రాజాసాబ్' దెబ్బ పడే ప్రమాదముంది. ఎందుకంటే డిసెంబరులో సోలో తేదీని వదులుకుని.. సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ తగ్గిపోతాయి. అలా కాదని డిసెంబరులోనే వస్తారా అనేది చూడాలి.
మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2'.. సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ తేదీ కూడా మారి డిసెంబరుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ vs బాలయ్య అవుతుందేమో? మరోవైపు డిసెంబర్ 5నే బాలీవుడ్ నుంచి 'ధురంధర్' అనే మూవీ రిలీజ్ కానుంది. దీని వల్ల ప్రభాస్ మూవీకి ఇబ్బంది ఏం ఉండదు. సరే ఇవన‍్నీ పక్కనబెడితే ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుందేమో?
(ఇదీ చదవండి: ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ)