
అనసూయ తొలుత 'జబర్దస్త్' షోతో యాంకర్‌గా పరిచయమైంది. మధ్యలో ఓసారి కొన్నాళ్ల పాటు షోలో కనిపించలేదు. తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అలా 2022 వరకు షోలో కొనసాగింది. ఏమైందో ఏమో గానీ సడన్‌గా షో నుంచి తప్పుకొంది. అప్పటినుంచి ఒకటి రెండు షోలు, ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'జబర్దస్త్' 12 ఏళ్ల సెలబ్రేషన్స్ కోసం వచ్చింది. హైపర్ ఆదిపై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.
(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)
'బాబుగారు, ఇంద్రజగారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది, నాకు కొన్ని.. మైక్‌లోనే చెప్పేస్తా నేను అన్నీ.. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్‌క్లూజివిటీ యాడ్ అవలేదు. అది నా ఏడుపు' అని అనసూయ చెప్పింది.
మరోవైపు ఆది మాట్లాడుతూ.. 'ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లినా సరే నీకు లింకులు పంపించా. అది రా మన లింక్. ఏమనుకుంటున్నావ్ రా నువ్వు' అని అన్నాడు. బదులిచ్చిన అనసూయ.. 'ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్లిపోయింది' అని ఆవేశంగా చెప్పుకొచ్చింది.
'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో బట్టి చూస్తే హైపర్ ఆదితో అనసూయ కాస్త గట్టిగానే మాట్లాడింది. చూస్తుంటే చాలావరకు నిజాలే చెప్పినట్లు ఉంది గానీ చివరలో ఇదంతా స్కిట్ అని కామెడీ చేసేస్తారేమో! ఎందుకంటే షోలో ఉన్నప్పుడు ఆది.. అనసూయని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలానే వేసేవాడు. కానీ అనసూయ పెద్దగా రెస్పాండ్ అయ్యేది కాదు. ఇప్పుడు కూడా స్కిట్‌లో భాగంగా తన మనసులో ఉన్నదంతా బయటపెట్టేసిందేమో అనిపిస్తోంది. ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే అసలు విషయం ఏంటో తేలుతుంది.
(ఇదీ చదవండి: ఇది గమనించారా? స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు)