టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్ ఫేవరెట్ జంట ఎవరంటే.. విజయ్ దేవరకొండ- రష్మిక గురించే మొదట చెప్తారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని వారి సన్నిహితులు వెల్లడించారు. కానీ, ఈ జోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే, వీరిద్దరూ ఒకేరకమైన ఉంగరాలు పెట్టుకొని ఈ మధ్య కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక నటించిన కొత్త సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి టాపిక్ రాగానే అవుననే సిగ్నల్ ఆమె ఇచ్చేసింది.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఈవెంట్‌లో యాంకర్ వేసిన ప్రశ్నతో రష్మిక పెళ్లి గురించి మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఒక వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంపిక చేసుకోవాలంటే ఎలా జడ్జ్ చేయాలని రష్మికను యాంకర్ అడుగుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి విజయ్ దేవరకొండను అడిగితే చెప్తారని సమాధానం వస్తుంది. అప్పుడు రష్మిక కూడా నవ్వుతూ కనిపిస్తుంది. రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అంటూ యాంకర్ మరో ప్రశ్న వేయగానే మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తినే అంటూ ఆన్సర్ వస్తుంది. ఆ సమయంలో రష్మిక కూడా చిరునవ్వుతో అందరికీ తెలుసే.. అంటూ చేతులతో అవుననే సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇలాగైనా ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే, వచ్చే ఏడాదిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.


