
‘విక్రమ్... అందరికీ ఒక టైపు ఉంటుంది కదా... నేను నీ టైపేనా’, ‘అంటే... ఒకరికొకరు కరెక్టా? అని ఎలా తెలుస్తుంది... అంతకన్నా ఎప్పుడు తెలుస్తుంది’, ‘కొంపతీసి నేను నీకు కరెక్టేనా అని ఆలోచిస్తున్నావా ఏంటి?’, ‘నేను నీకు కరెక్టేనా? అని కూడా ఆలోచిస్తున్నా?’... ఈ సంభాషణలు‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రోమోలోనివి.
రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 7న రిలీజ్ చేయనున్నట్లుగా పేర్కొని, రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.