
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ అయిపోయింది. ఈ సినిమాకు ప్రారంభ వారంలో జనాలు వెళ్లారు గానీ తర్వాత చాలావరకు తగ్గిపోయారు. అయితే రెండో వారం నేహాశెట్టి చేసిన ఓ ఐటమ్ సాంగ్‌ని సినిమాలో జీడించారు. అయితే మూవీలోని మిగతా పాటలతో పోలిస్తే ఇది అంతంత మాత్రంగానే ఉండటం, దానికి తోడు సినిమాలో రాంగ్ ప్లేస్‌మెంట్‌లో వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)
థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాటని ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ గీతంలో నేహాశెట్టి మాత్రమే ఉంది. అటు హీరో పవన్ కల్యాణ్ గానీ విలన్ ఇమ్రాన్ హష్మీ గానీ లేకపోవడంతో ఈ పాట జనాలకు కూడా పెద్దగా రీచ్ కాలేదు.
(ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్‌ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్)