నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి | Actress Srinidhi Shetty Being Called Lady Prabhas | Sakshi
Sakshi News home page

Srinidhi Shetty: ప్రభాస్‌లా నేను కూడా.. అందుకే అలా పిలుస్తారు

Oct 4 2025 4:48 PM | Updated on Oct 4 2025 5:18 PM

Actress Srinidhi Shetty Being Called Lady Prabhas

'కేజీఎఫ్' సినిమాతో హీరోయిన్‌గా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. తర్వాత అడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తోంది. ఈ ఏడాది నాని 'హిట్ 3'తో వచ్చింది. సక్సెస్ అందుకుంది. ఇప్పుడు 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలో రానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది.

'నేను ప్రభాస్‌లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను. అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు' అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ప్రభాస్ అభిమానులు భిన్నంగా స్పందిస్తుంటారు.  తమ ఫేవరెట్ హీరోకి లేడీ వెర్షన్ అంటే అనుష్కనే అవుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీనిధి శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్‌ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్)

శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది.

త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా కోసం ఈమెను హీరోయిన్‌గా తీసుకున్నారనే రూమర్ వినిపించింది. దీని గురించే 'తెలుసు కదా' ప్రమోషన్లలో అడగ్గా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement