
ఒకప్పుడు అంటే తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అంటే వామ్మో అన్నట్లు చూసేవారు. కానీ గత కొన్నేళ్లలో మాత్రం ఈ విషయం చాలా సాధారణమైపోయింది. ప్రేక్షకులు కూడా ముద్దు సన్నివేశాల్ని సాధారణంగానే తీసుకుంటున్నారు. ఒకవేళ హీరోయిన్లని ఈ సీన్స్ గురించి అడిగితే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనే మాట అంటారు. అయితే అది ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది అని హీరోయిన్ కోమలి ప్రసాద్ అంటోంది.
(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్)
రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోమలి.. స్వతహాగా తెలుగమ్మాయి. సహాయ పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్‌గా 'శశివదనే' అనే మూవీ చేసింది. అక్టోబరు 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా ట్రైలర్ చూపించిన లిప్ కిస్ గురించి కోమలి మాట్లాడింది.
'ఈ రోజుల్లో ముద్దు సన్నివేశంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నటించానని అనడం పెద్ద జోక్ అయిపోయింది. కానీ మా సినిమాలో ఈ సన్నివేశానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నేను చేసిన శశి అనే అమ్మాయి పాత్ర.. అసలు ఏడుస్తూ రాఘవని ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా అని ఇదేదో కావాలని ఇరికిందింది అయితే కాదు' అని కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్‌మెంట్ లేదు, డిప్రెషన్: నటి హేమ)