గత కొన్నాళ్ల నుంచి దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ ట్రెండ్ బాగా కనిపించింది. ఇందులో భాగంగా వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ పాపనే తీసుకుంటే అలా ఓ మూవీలో చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి సీక్వెల్ వచ్చేలోపు హీరోయిన్ అయిపోతుందేమోనని సందేహం వస్తోంది. మరి ఈ బాలనటి ఎవరో గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మోనిక. తమిళనాడుకు చెందిన ఈమె.. విజయ్, అజిత్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో బాలనటిగా చేసింది. అయితే 'ఖైదీ'లో హీరో కార్తీ కూతురిగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తీసిన ఈ మూవీ 2019లో రిలీజైంది. అప్పటికి ఈమె వయసు 11 ఏళ్లు. తర్వాత లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన 'విక్రమ్' క్లైమాక్స్‌లోనూ కాసేపు అలా కనిపించింది.
'ఖైదీ 2'లోనూ ఈ పాప పాత్ర కచ్చితంగా ఉండే అవకాశముంది. చూస్తుంటే పాప పెరిగి పెద్దయిపోయింది. మరి ఖైదీ సీక్వెల్ ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందో రాదో ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి. ఒకవేళ తీస్తే మాత్రం ఈ పాపని కాకుండా వెరే వాళ్లని పెట్టి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. చూస్తుంటే లోకేశ్ కనగరాజ్ ఈ సీక్వెల్ తీసేలోపు ఈ బాలనటి.. హీరోయిన్‌గానూ సినిమాలు చేసేస్తుందేమోనని అనే కౌంటర్స్ పడుతున్నాయి.
(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ)


