
రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ తన నృత్యంతో మరోసారి ఆడియెన్స్‌ను అలరించారు. అమ్మవారి పూజలు, ప్రార్థనలు మొదలు గర్బా స్టెప్పుల దాకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రులు తన చిన్న నాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఫల్గుణి పాఠక్‌తో కలిసి స్టెప్పులు వేసిన వీడియో వైరల్‌గా మారింది.
నీతా అంబానీ నేతృత్వంలో ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో దాండియా నైట్ అత్యంత ఉత్సాహంగా నడిచింది. ఈ వేడుకల్లో ఫల్గుణి పాఠక్ భక్తి, పాటలు పాడి భక్తులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా నీతా అంబానీతో కలిసి వేసిన దాండియా విశేషంగా నిలిచింది.
ముఖ్యంగా నీతా అంబానీ తన బాల్య జ్ఞాపకాలతో పాటు, పాఠక్‌తో గత పాతికేళ్లుగా తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడారు. తాను చిన్నప్పుడు, నవరాత్రి తొమ్మిది రాత్రులు నృత్యం చేసేదాన్నని గుర్తు చేసుకున్నారు. దసరా, నవరాత్రి పండుగలు ఎపుడూ తనకు భక్తి ,ఐక్యత, రాత్రి భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు.
కాగా గుజరాత్‌లోని సంగీత కుటుంబంలో పుట్టిన ఫల్గుణి పాఠక్ గర్బా , దాండియా డ్యాన్స్‌లకు పెట్టింది. అందుకే "దాండియా రాణి" అని పేరొందింది. ఎన్నో పాప్‌గీతాలను ఆలిపించిన ఫల్గుణి తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది.
ఇదీ చదవండి: ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!