రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ.. కుమారుడు అనంత్ అంబానీతో కలిసి శుక్రవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. ఆ కుటుంబం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2025లో తిరుమల, గురువాయూర్
నవంబర్ 2025లో ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో.. భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను (కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సమయంలోనే కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి రూ. 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
Anant Ambani beginning the year at Somnath Temple with Mukesh and Nita and donating ₹5 crore says a lot about how he’s been raised 🙏 pic.twitter.com/QzzzR5KZQU
— Manan Natani (@MananNatani1) January 2, 2026


