breaking news
Somnath Temple
-
మన చుట్టూతా..సోమనాథ్ పునర్నిర్మాణ వ్యతిరేక శక్తులు
సోమనాథ్: వెయ్యేళ్ల సోమనాథ్ చరిత్ర విధ్వంసం, పరాజయానికి సంబంధించినది కాదని.. అది మహోన్నత పునర్నిర్మాణ, విజయం చరిత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చరిత్రాత్మక సోమనాథ్ ఆలయం విధ్వంసానికి గురైన ప్రతిసారీ మరోసారి నిర్మితం అవుతూనే ఉందని తెలిపారు. ఖడ్గం మొనతో ప్రజల హృదయాలు గెలుచుకోలేమని స్పష్టంచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్యనే చురుగ్గా ఉన్నాయని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా, ఐక్యంగా ఉంటూ ఆయా శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆదివారం గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం సమీపంలోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ విగ్రహం వద్ద నివాళులరి్పంచారు. అనంతరం ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో పాల్గొన్నారు. తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన భారీ బహిరంగ కార్యక్రమంలో వేలాది మంది భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘సోమనాథ్ మందిరంపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఈ దాడులకు విద్వేషమే ప్రేరణగా నిలిచింది. మనకు నిజాలు తెలియకుండా కుట్రలు చేశారు’’ అని గత ప్రభుత్వాలపై మోదీ మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకున్నవారే.. ‘‘సోమనాథ్ ఆలయంపై దాడుల వెనుక మతపరమైన విద్వేషం ఉంది. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం అతిపెద్ద దాడి జరిగింది. ఇది కేవలం సంపద కోసం జరిగిన దాడి కాదు. గర్భాలయంలో సోమనాథుడి విగ్రహాన్ని ముక్కలు చేశారు. ఇంత జరిగినా కొందరు మన కళ్లుగప్పాలని చూశారు. సంపద లూటీ కోసమే దాడులు అంటూ కట్టుకథలు అల్లారు. విద్వేషం, వేధింపులు, ఉగ్రవాద చరిత్రను దాచేయాలని కుట్రలు సాగించారు. నిజంగా సొంత మతం పట్ల నిబద్ధత కలిగినవారు ఉగ్రవాద భావజాలాన్ని సహించరు. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకున్నవారే మతపరమైన ఉగ్రవాదం ఎదుట మోకరిల్లుతారు’’ అని అన్నారు. మనం మరింత శక్తివంతంగా మారాలి ‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక∙సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ గొప్ప ప్రతిజ్ఞ చేశారు. సోమనాథ్ ఆలయాన్ని పునరి్నరి్మస్తామని చెప్పారు. కానీ, అప్పటి పాలకులు ఆయనకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. 1951లో ఆలయ ప్రారంభోత్సవానికి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హాజరుకాకుండా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. వెళ్లొద్దని చెప్పారు. హెచ్చరికలను లెక్కచేయకుండా ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన అవే శక్తులు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. కత్తులు, కుట్రలతో కాకుండా ఇతర మార్గాల్లో మన దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. స్వలాభం కోసం మన మధ్య చిచ్చుపెట్టి, ముక్కలుగా విభజించాలని చూస్తున్న దుష్ట శక్తులను కచి్చతంగా ఓడించాలి’’ అని అన్నారు. ‘‘గజినీ మహమ్మద్ 1026లో సోమనాథ్పై దాడి చేశాడు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలన దాకా ఎన్నోసార్లు విధ్వంసాలు జరిగాయి. ఈ మందిరాన్ని మసీదుగా మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, విధ్వంసం జరిగిన ప్రతిసారీ శివ శక్తులు ఆలయాన్ని మళ్లీ నిర్మించుకున్నారు. వీరిలో మాల్వా రాణి అహిల్యాభాయి హోల్కర్ సైతం ఉన్నారు. విదేశీ దురాక్రమణదారులు మన దేశాన్ని కూడా ధ్వంసం చేయడానికి శతాబ్దాలపాటు ప్రయతి్నంచారు. దేశం ఏనాడూ వారి ఎదుట తలవంచలేదు. ముష్కరుల నుంచి సోమనాథ్ మందిరాన్ని కాపాడుకోవడానికి వీర్ హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.శౌర్య యాత్రలో మోగిన ఢమరుకం విదేశీయుల దాడుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించుకునే క్రమంలో వీరమరణం పొందిన అసంఖ్యాక యోధులను స్మరించుకుంటూ ఆదివారం సోమనాథ్ పట్టణంలో 108 అశ్వాలతో భారీ శౌర్యయాత్ర నిర్వహించారు. ర్యాలీని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ సైతం ఢమరుకం మోగించి, ఢంకా బజాయించారు. వందలాది మంది భక్తులు ఢమరుకాలను మోగిస్తూ ముందునడవగా 108 మేలుజాతి అశ్వాలు ఠీవీగా నడుస్తూ వాళ్లను అనుసరించాయి. వెనకాలే ఓపెన్‌టాప్ వాహనంలో ప్రధాని మోదీ వెంటరాగా రిషి కుమారులు ఆయన వెంట వచ్చారు. శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ సర్కిల్ దాకా దాదాపు కిలోమీటర్‌పైగా ఈ శౌర్యయాత్ర కన్నులపండువగా కొనసాగింది. ఇరువైపులా బారులు తీరిన భక్తులపై జనం పూలవర్షం కురిపించారు. యాత్ర పొడవునా శివభక్తులు, కళాకారులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. సోమనాథ్ ఆలయం దాకా యాత్ర జరిగింది. ఆలయ చరిత్రను వివరిస్తూ సాగిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. సోమనాథ్‌ను దర్శించుకోవడం దేవుని గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నానంటూ ప్రధాని మోదీ తర్వాత ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. -
సోమ్‌నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శౌర్య యాత్ర
-
నాగరికతకు నిలువెత్తు నిదర్శనం
వెరావల్(గుజరాత్): గతంలో విదేశీ రాజుల దండయాత్రల్లో పలుమార్లు ధ్వంసమైనాసరే తెగించి నిలబడిన భారతదేశ నాగరికతకు సోమనాథ్ ఆలయం నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్ హోదాలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీ తన సామాజిక మాధ్య ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ నాగరికత, తెగువకు నిదర్శనంగా భాసిల్లుతున్న సోమనా థ్ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా నాకు దక్కిన భాగ్యం. 1026లో తొలిదాడి మొ దలు శతాబ్దాల కాలంలో ఎన్నో సార్లు విదేశీ రాజుల దాడులకు గురైనా సరే చెక్కుచెదరక భారతీయ నాగరికతా తెగువ నిదర్శనంగా నిలబడింది. ఇంతటి గొప్ప ఆలయంలోకి నాకు సాదర స్వాగతం పలికిన స్థానికులకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. సోమనాథ్ ఆలయం తొలిసారిగా మొహమ్మద్ గజనీ సారథ్యంలో 1026 ఏడాదిలో దాడికి గురై 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమ నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ హోదాలో సర్క్యూ ట్ హౌస్‌లో బోర్డ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, డెప్యూ సీఎం హర్‡్ష సంఘ్వీ, ఇతర ట్రస్టీలు, అధికారులు పాల్గొన్నా రు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కల్గకు ండా ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచి ంచారు. ఆలయ ప్రాంగణంలో మరమ్మతుల, ఆధునీకరణ, మౌలకవసతుల మెరుగు తదితర పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. #WATCH | Gujarat | Fireworks illuminate the night sky above Somnath Temple as the 72-hour 'Aum' chanting continues in the background during the ongoing Somnath Swabhiman Parv.Source: DD pic.twitter.com/bOkFqu5hbG— ANI (@ANI) January 10, 2026ఆకట్టుకున్న డ్రోన్ షో...తర్వాత సాయంత్రం ఆలయం ప్రాంగణంలో ఓంకార మంత్రాన్ని పఠించే కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత రాత్రి చిమ్మచీకట్లో అరేబియా సముద్రంపై వినువీధిలో 3,000 చిన్నపాటి డ్రోన్లతో ఏర్పాటుచేసిన షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌర మండలం, సోమనాథ్ ఆలయం, భారీ శివలింగం, త్రిశూలం, ఢమరుకం ఆకృతుల్లో డ్రోన్లు ఎగిరి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. స్వాభిమాన్ పర్వ్ ఆదివారందాకా కొనసాగనుంది. ఆదివారం ఉదయాన్నే ఇక్కడ జరిగే శౌర్యయాత్రలో మోదీ పాల్గొంటారు. సోమనాథ్ ఆలయాన్ని కాపాడే క్రమంలో వీరమరణం పొందిన వాళ్లకు మోదీ నివాళులర్పిస్తారు. వీరుల త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ర్యాలీ చేపట్టనున్నారు. పలు కార్యక్రమాలతో మోదీ బిజీ..తర్వాత మోదీ ఒక ప్రజాకార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మోదీ రాజ్‌కోట్‌కు వెళ్తారు. అక్కడ కఛ్, సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫెరెన్స్ సదస్సులో ప్రసంగిస్తారు. తర్వాత అక్కడి పారిశ్రామిక ఉత్పత్తుల వస్తు ప్రదర్శనశాలను ఆవిష్కరి స్తారు. తర్వాత గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ప్రాంగణంలో 14 గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ ఎస్టేట్లు, వైద్య ఉపకరణాల పార్క్ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ సెక్టార్ 10ఏ నుంచి మహాత్మా మందిర్ వరకు నిర్మించిన అహ్మదాబాద్ మెట్రో ఫేస్2ను ప్రారంభిస్తారు.#WATCH | Gujarat | PM Narendra Modi, Gujarat CM Bhupendra Patel, and Dy CM Harsh Sanghavi attend the drone show being organised as part of the Somnath Swabhiman Parv at the Somnath Temple.Source: DD pic.twitter.com/aCmBiqEcBB— ANI (@ANI) January 10, 2026 -
11న సోమనాథ్ ఆలయానికి వెళ్తున్నా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. సోమనాథ్ ఆలయంపై విదేశీయులు మొదటిసారిగా దాడి జరిపి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఏడాదంతా వివిధ కార్యక్రమాలను తలపెట్టారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. సోమనాథ్‌ను 11వ తేదీన సందర్శించుకోనున్నట్లు ప్రధాని సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా, ప్రతిసారీ ఈ పుణ్యక్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది’అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్‌లో అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్ ఆలయంలో శివుడు కొలువుతీరాడు. ఈ ఆలయంపై మొదటిసారిగా తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్ దాడి చేసి, విధ్వంసం సృష్టించాడు. అప్పట్నుంచి పలువురు విదేశీ పాలకులు దాడి చేసి దోచుకున్నారు. ‘సోమనాథ్ కథ కేవలం ఒక ఆలయానికి సంబంధించింది కాదు, అది మన సంస్కృతిని, నాగరికతను కాపాడిన భారతమాత కోట్లాది సంతానానికి చెందిన అజేయమైన సాహసగాథ. శతాబ్దాల తరబడి దాడులు, వలసవాద దోపిడీలను తట్టుకుని నిలబడిన ఈ స్ఫూర్తే నేడు మన దేశాన్ని ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న దేశంగా నిలబెట్టింది’అని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆలయాన్ని పునర్నిర్మించే విషయంలో సర్దార్ పటేల్ ఎంతో చొరవ కనబరిచారన్న ప్రధాని మోదీ...1951లో జరిగిన ఆలయ ఉత్సవాలకు అప్పటి ప్రధాని నెహ్రూ వెళ్లలేదంటూ నిందించారు. ‘1947లో దీపావళి వేడుకల వేళ సర్దార్ పటేల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అప్పుడే ఆయన ఆలయానికి పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకున్నారు’’ అని మోదీ చెప్పారు. -
ఒక అజేయ స్ఫూర్తి సంకేతం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘‘సౌరాష్ట్రే సోమనాథం చ...’’ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది: ‘‘సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే‘ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్’’ అంటే– ‘‘సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు’’ అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్‌కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అఖండ ధైర్యానికి నిర్వచనంసోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్‌కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విసృతంగా మోసుకెళ్లారు. తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. ఎందరో మహానుభావులుకానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్‌నాథ్‌లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్‌ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నయ్ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా– ‘‘దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్‌లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావనం జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!’’ స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్... అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్‌లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్‌పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్‌కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. ‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ద ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు... సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు... ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాణి’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్‌ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? ఒక ఆశాగీతంవందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి... నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే... మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్‌ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్‌కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం... ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ... రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్‌కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా... సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్ని ఎదురైనా... ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే... మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా... మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్! నరేంద్ర మోదీభారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్టు చైర్మన్ -
సోమనాథ్ ఆలయంలో అంబానీ కుటుంబం: విరాళంగా రూ. 5కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ.. కుమారుడు అనంత్ అంబానీతో కలిసి శుక్రవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. ఆ కుటుంబం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2025లో తిరుమల, గురువాయూర్నవంబర్ 2025లో ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో.. భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను (కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సమయంలోనే కేరళలోని త్రిస్సూర్ జిల్లా, గురువాయూర్ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. ఆయన ఆ దేవాలయానికి రూ. 15 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.Anant Ambani beginning the year at Somnath Temple with Mukesh and Nita and donating ₹5 crore says a lot about how he’s been raised 🙏 pic.twitter.com/QzzzR5KZQU— Manan Natani (@MananNatani1) January 2, 2026 -
బాబ్రీ మసీదు.. నాడు నెహ్రూ ప్రయత్నాన్ని ఆపిన పటేల్!
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు నిర్మించేందుకు చూశారని.. కానీ, గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని అన్నారు. మంగళవారం గుజరాత్లో జరిగిన యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ‘‘నాడు దేశ తొలి ప్రధానిగా ఉన్న నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు కట్టాలనుకున్నారు. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారు అంటే అది గుజరాత్ అమ్మ కడుపున పుట్టిన సర్దార్ వల్లభాయ్‌పటేలే. నెహ్రూ నిర్ణయానికి ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయ(గుజరాత్) ప్రస్తావనను నెహ్రూ తీసుకొచ్చారు. అయితే.. సోమనాథ్ ఆలయ అంశం పూర్తిగా వేరు అని.. అది పూర్తిగా ప్రజల విరాళంతో(ట్రస్ట్ ఏర్పాటు చేసి) నిర్మించిందని.. ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు చేయలేదని పటేల్ నెహ్రూకు గుర్తు చేశారు. సరిగ్గా ఇదే ఇప్పుడు అయోధ్య రామమందిర విషయంలో జరిగింది. రాముడి ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఇది నిజమైన సెక్యులరిజం అంటే’’ అని రాజ్‌నాథ్ అన్నారు. అదే సమయంలో.. 1946లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం సర్దార్ పటేల్‌కు వచ్చిందని.. మహత్మా గాంధీ సూచన మేరకే పటేల్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారని.. అలా నెహ్రూ ఆ టైంలో అధ్యక్షుడు అయ్యారని రాజ్‌నాథ్ అన్నారు. కొన్ని రాజకీయ దుష్టశక్తులు చరిత్ర నుంచి పటేల్ లెగసీని చెరిపేసే ప్రయత్నం చేశాయని.. కానీ, ప్రధాని మోదీ మాత్రం పటేల్ గొప్పదనం ఏంటో ప్రపంచానికి చాటి చెబుతున్నారని రాజ్‌నాథ్ అన్నారు. -
సోమనాథ్ ఆలయంలో ఓలా సీఈఓ పూజలు (ఫోటోలు)
-
సోమనాథ్ ఆలయంలో పూజలు చేసిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వరుస మూడు ఓటముల చవిచూసిన ముంబై ఇండియన్స్.. తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ముందు ముంబై జట్టుకు ఆరు రోజుల విరామం లభించింది. దీంతో ముంబై జట్టు మొత్తం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు టూర్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ముంబై జట్టు ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో హార్దిక్ పాండ్యా పూజలు చేశాడు. శివలింగానికి పాండ్యా పాలాభిషేకం నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఏ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్ నూతన సారధిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. #WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple. Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA — ANI (@ANI) April 5, 2024 -
తాలిబన్ల దుశ్చర్య .. సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసి ట్వీట్ చేశారు
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు ప్రజల నుంచి దేవుళ్ల వరకు వెళ్లాయి. తాజాగా అక్కడి చారిత్రాత్మక సోమనాథ్ దేవాలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అందుకు బదులుగా ఆ స్థానంలో మహ్మమద్ గజ్నవి దర్గాను పునర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాలిబన్‌కు చెందిన అనాస్ హక్కానీ ట్విటర్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లో.. ఇవాళ మేము పదో శతాబ్దపు ముస్లిం వారియర్ మహ్మమద్ గజ్నవి దర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో ఆయన పటిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ వైభవాన్ని మేము తిరిగి తీసుకొస్తామని తెలిపారు. కాగా, అందుకోసం తాలిబన్లు సోమ్‌నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. 998 నుంచి 1030 వరకు పాలించిన గజనావిడ్స్ తుర్కిక్ రాజవంశం మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు మహమూద్ గజ్నవి. అతను భారతదేశంలోని సంపన్న నగరాలు, కాంగ్రా, మధుర, జ్వాలాముఖ్ వంటి దేవాలయాలతో పాటుగా 17 సార్లు గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్న సంగతి తెలిసింది. సోమనాథ్పై దాడి చేసినప్పుడు, గజ్నవీ దేవాలయాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది భక్తులను చంపినట్లు చెబుతారు. కాగా సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతదేశపు మొదటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ప్రారంభించగా ఆయన మరణం తర్వాత మే 1951 లో పూర్తయింది. ప్రస్తుతం ఆ దేవాలయం అన్ని వైభవాలతో కళకళలాడుతోంది. ఇక ఈ ట్వీట్‌పై . బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాతో పాటు అనేక మంది భారతీయ నెటిజన్లు ధీటుగా స్పందించారు. అనస్ హక్కానీ ట్వీట్‌కు.. సోమనాథ్ ఆలయం ఇంకా ఉన్నతస్థానంలో ఉందని, గజ్నవీ నగరాలు నశించిపోతున్నాయని నెటిజన్లు గుర్తు చేశారు. Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021 చదవండి: పైసల కోసమే ఫేస్బుక్ కక్కుర్తి! ఛస్.. లాజిక్ లేదన్న మార్క్ -
గుజరాత్లో కీలక ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వడోదర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ సోమ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో భవిష్యత్తరాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుసంధానమవుతారని పేర్కొన్నారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమేనని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాద శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్ట లేవని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు, హింస నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధ్యానతను సంతరించుకున్నాయి. ప్రారంభించిన ప్రాజెక్టులలో సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ గ్యాలరీ, పాత (జూనా)సోమనాథ్ పునర్నిర్మించిన ఆలయ ప్రాంగణం ఉన్నాయి. ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 3.5 కోట్లతో అహిల్యాబాయి దేవాలయాన్ని నిర్మించారు. పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద సోమనాథ్ ప్రొమెనేడ్‌ను రూ.47 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
సోమ్నథ్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
-
సోమనాథ్ ఆలయంలో రాహుల్
-
‘మా కుటుంబంతా శివ భక్తులమే’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించే చేసిన సంతకంపై చెలరేగుతున్న వివాదంపై రాహుల్ స్పందించారు. హిందువులు రిజిస్టర్లోనే సంతకం చేసినట్లు ఆయన చెప్పారు. అయితే పొరపాటున పార్టీ కార్యకర్తలు.. ఇతరులు రిజిస్టర్లో సంతకం చేసినట్లు ప్రకటించాని ఆయన చెప్పారు. నానమ్మ ఇందిరాగాంధీ నుంచి మా కుటుంబమంతా శివభక్తులమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నానమ్మ శివుడిని ఆరాధించేదని రాహుల్ గుర్తు చేసుకున్నారు. నానమ్మ ప్రేరణతో తామంతా పరమేశ్వరుడికి భక్తులుగా మారిపోయాని.. మొత్తం కుటుంబమంతా శివారధాన చేస్తుందని ఆయన చెప్పారు. మతాన్ని, భగవంతుడిని రాజకీయ లబ్దికోసం ఉపయోగించునే సంస్కృతి తనకు లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మతం అనేది వ్యక్తుల ఆంతరగింక, వ్యక్తిగత విషయని ఆయన స్పష్టం చేశారు. మతం పేరనుతో వ్యాపారాలు, రాజకీయాలు చేయడం తగదని ఆయన చెప్పారు. ’నేను సోమనాథ్ ఆలయంలో హిందూ సందర్శకులు రిజిస్టర్లోనే సంతకం చేశానని.. కొన్ని మీడియా వర్గాలు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేశాయని’ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH Congress VP Rahul Gandhi says, my grand mother was a Shiv-bhakt & so is my family. We don't talk about these things as they are personal. (Source: Amateur video) pic.twitter.com/fV8H8udRf8 — ANI (@ANI) 30 November 2017 -
రాహుల్ గాంధీ హిందువు కాదా?!!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసలు హిందువా, కాదా ? అన్న అంశంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. రాహుల్ గాంధీ బుధవారం నాడు సోమ్‌నాథ్ ఆలయన్ని సందర్శించినప్పుడు హిందువేతరులు సంతకం చేయాల్సిన పుస్తకంలో సంతకం చేశారని, ఈ విధంగా రాహుల్ గాంధీ హిందువు కాదని తానే స్వయంగా ఒప్పుకున్నారంటూ బీజేపీ వర్గాలు, మద్దతుదారులు బుధవారం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మొట్టమొదట ఈ కథనాన్ని ‘జీ గుజరాతీ’ ప్రసారం చేసింది. జీ గుజరాతీకి చెందిన జర్నలిస్ట్ తేజాష్ మోదీ సోమ్‌నాథ్ ఆలయం వద్ద నుంచి పంపిన ట్వీట్‌ను యధాతథంగా ‘జీ గుజరాతీ’ ప్రచారం చేయడంతో వివాదం రాజుకుంది. ‘కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ ట్రస్ట్ హిందువులుకానీ వారి కోసం ఏర్పాటు చేసిన పుస్తకంలో రాహుల్ గాంధీ తన పేరు రాసి సంతకం చేశారు. ఆయన కిందనే అహ్మద్ పటేల్ కూడా తన పేరు రాసుకొని సంతకం చేశారు’ అని తేజాష్ మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం అధిపతి అమిత్ మాలవియా ఆగమేఘాల మీద పార్టీ ట్విట్టర్ నిర్వాహకులందరికి ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఆయన తొందరపడి చేసిన ట్వీట్ విస్తతంగా సోషల్ మీడియాతోపాటు ముద్రణా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తతంగా ప్రచారమైంది. అది రాహుల్ గాంధీ హిందువు కాదా? అంటూ కొత్త చర్చను లేవదీసింది. ఇలా తొందరపడి తప్పుడు వార్తలను ట్వీట్ చేయడం అమిత్ మాలవియాకు మొదటి నుంచి అలవాటే. ఇప్పటికీ ఐదుసార్లు ఆయన తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్ మత కల్లోలు జరుగుతున్నప్పుడు ‘పట్టపగలు ఓ హిందువు స్త్రీని వివస్త్రను చేస్తున్న ముస్లిం గుండాలు’ అనే శీర్శికన ఓ మరాఠీని సినిమా షూటింగ్ స్టిల్‌ను ఎవరో పోస్ట్ చేస్తే దానికి మాలవియా విస్తత ప్రచారం కల్పించారు. సరే, ఆయనంటే బీజేపీ పక్కా మనిషి కనుక అలాంటి ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని పక్కన పెట్టొచ్చేమోగానీ కొన్ని ఆంగ్ల పత్రికలు, ఛానళ్లు వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే హిందువు కానంటూ రాహుల్ గాంధీ దండోరా వేసుకున్నాడంటూ వార్తలను ప్రసారం చేయడం శోచనీయం. ముఖ్యంగా ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఈ వార్తకు మొదటి పేజీలో బ్యానర్ ప్రాముఖ్యతను ఇవ్వడం విడ్డూరం. గూగుల్‌లో నిక్షిప్తమైవున్న రాహుల్ రాతతో ఆలయ పుస్తకంలో రాహుల్ గాంధీ పేరుతో ఉన్న రాతను పోల్చి చూసినట్లయితే అది రాహుల్ గాంధీయే రాశారా, మరెవరైనా రాశారా? అన్న విషయం ఇట్టే తేలిపోయేది. ఎవరు కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు ఆ మాత్రం కసరత్తు చేయకపోవడం శోచనీయం. ముఖ్యంగా మీడియాకైతే ఇది సిగ్గుచేటే! అందులోబాటులో ఉన్న రెండు రాహుల్ గాంధీ చేతి రాతలకు, సోమ్‌నాథ్ ఆలయ పుస్తకంలోని రాహుల్ చేతి రాతకు, సంతకానికి ఎక్కడా పోలిక లేదు. మరెవరో దీన్ని రాసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైగా రాహుల్ గాంధీ తన పేరును ఎప్పుడు కూడా రాహుల్ గాంధీజీ అని రాసుకోరు. పుస్తకంలో రాహుల్ గాంధీజీ అని రాసి ఉంది. అహ్మద్ పటేల్ పేరు ఇంగ్లీషు అక్షరాల్లో ‘ఏహెచ్ఎంఈడీ పీఏటీఈఎల్’ను ఏహెచ్ఏఎంఈడీగా తప్పుగా రాశారు. అహ్మద్ పటేల్ తన పేరును తప్పుగా రాసుకోరుగదా! అంతేకాకుండా రాహుల్ గాంధీజీ, అహ్మద్ పటేల్ పేర్లను ఎవరో ఒకరే రాసినట్టుగా రాతను చూస్తే స్పష్టం అవుతోంది. రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయంలో సందర్శకుల పుస్తకంలో చేసిన సంతకాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. తాను హిందువును కానంటూ మరే పుస్తకంలోనూ ఆయన సంతకం చేయలేదంటూ వివరణ ఇచ్చింది. గాంధీ సంతకం చేసిన పేజీనీ కూడా ట్వీట్ చే సింది. రాహుల్ గాంధీ ఒక్క సందర్శకుల పుస్తకంలో మినహా మరే పుస్తకంలో సంతకం చేయలేదంటూ సోమ్‌నాథ్ ఆలయం ట్రస్ట్ కార్యదర్శి పీకే లహరి మీడియాకు స్పష్టం చేశారు. మరి రాహుల్, పటేల్ పేరిట హిందువేతరుల పుస్తకంలో ఎవరు సంతకం చేశారు? రాహుల్ వెంట ఆలయంలోకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించాలంటే ఈ పుస్తకంలో సంతకం చేయాలంటూ ఎవరో ఆలయం పుస్తకం ఇస్తే అందులో కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ మనోజ్ త్యాగీ... రాహుల్, పటేల్ పేర్లు రాసి సంతకం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకోడానికి మనోజ్ త్యాగీ అందుబాటులో లేరు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత కల్పించాల్సిందిపోయి పనికిమాలిన అంశాలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం ఎవరిని తప్పుదోవ పట్టించడానికి? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో నాడు ఇందిరాగాంధీ గుజరాత్‌ను పర్యటించినప్పుడు మోర్బీలో ముక్కుమూసుకున్నారని విమర్శించడంలో ఉద్దేశం ఏమిటీ? -
మరో వివాదంలో రాహుల్
-
మత్స్యకారులకు రూ.కోటి
►కొత్త రుణ పథకాన్ని ప్రకటించిన ప్రధాని ►సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు ►మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు డామన్ డయ్యూ: చిన్న, మధ్యతరహా మత్స్యకారులు పెద్దవైన, ఆధునిక పడవలను కొనుక్కునేందుకు కోటి రూపాయల రుణం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బుధవారం డామన్ డయ్యూలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ఈ నిర్ణయం పేద మత్స్యకారులకు ఓ వరమన్నారు. ‘చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లి వేటాడలేకపోతున్న పేద మత్స్యకారుల కోసం మేం కొత్త పథకాన్ని తెస్తున్నాం. ఈ పథకం ముసాయిదా దాదాపు పూర్తయింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేస్తాం. పేద మత్స్యకారులు ఓ బృందంగా ఏర్పడాలి. ఈ బృందానికి ముద్ర పథకంలో భాగంగా రూ. కోటి రుణం ఇస్తాం. ఇందులో 50 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది’ అని చెప్పారు. పెద్ద బోట్ల ద్వారా ఈ గ్రూపు సభ్యులు కలిసి సముద్రంలోకి వెళ్లి 12 నాటికల్ మైళ్లు (22.2 కి.మీ. ప్రాదేశిక జలాలు) దాటి వెళ్లి మరింత మత్స్య సంపద లాభాలను పంచుకోవచ్చన్నారు. దీనిపై డామన్ డయ్యూ ప్రజలు మరిన్ని సలహాలు సూచనలు ఇక్కడి అధికారులకు అందజేయవచ్చన్నారు. 9 మెగావాట్ల విద్యుత్ వాడుతున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతం 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయటం గొప్పవిషయన్నారు. సోమ్‌నాథ్ ఆలయంలో మోదీ అంతకుముందు రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. గిర్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ ట్రస్టు చైర్మన్ కేశుభాయ్ పటేల్, బోర్డు సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ట్రస్టీలు స్వాగతం పలికారు. మహిళా సాధికారతతోనే సంపూర్ణత మహిళా సాధికారత జరగనంతవరకు మానవత్వానికి సంపూర్ణత రాదని మోదీ చెప్పా రు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తన అధికారిక వెబ్సైట్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలి పారు. మహిళల అభివృద్ధి గురించి కాకుం డా.. మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురిం చి ఆలోచించాలన్నారు. బాలికలపై వివక్ష వద్దు బాలికల పట్ల వివక్షచూపే ధోరణి మారాలని ప్రధాని తెలిపారు. బాలికలను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి సామాజిక, జాతీయ, మానవతావాద బాధ్యతన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లో ఏర్పాటుచేసిన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో మోదీ పాల్గొన్నారు. అనంతరం సర్పంచులకు ‘స్వచ్ఛ శక్తి’ అవార్డులను అందజేశారు. -
ఆ పదిమందిలో ముగ్గురిని మట్టుబెట్టారు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి కొన్నిరోజుల కిందట భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదుల జాడను భద్రతా దళాలు పశ్చిమ భారతంలో గుర్తించినట్టు సమాచారం. ఆ పదిమంది ఉగ్రవాదుల్లో ముగ్గురిని గుర్తించి భద్రతా దళాలు మట్టుబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శివరాత్రి సందర్భంగా 26/11 ముంబై దాడుల తరహాలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై ఉగ్రవాద దాడికి వారు వ్యూహరచన చేశారని ఆ వర్గాలు చెప్పాయి. పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని, వారు దేశ రాజధాని న్యూఢిల్లీపై దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఢిల్లీలో తలదాచుకొని ఉంటారని ఐబీ అప్పట్లో పేర్కొంది. భారత్‌లోకి పది మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు నాసిర్ ఖాన్ జాంజువా మొదట భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారమిచ్చారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గుజరాత్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని జాంజువా తెలిపారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఢిల్లీ, గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పశ్చిమ భారతంలో ఆ పదిమంది ఉగ్రవాదుల జాడను కనిపెట్టి.. అందులో ముగ్గురిని హతమార్చినట్టు సమాచారమందుతున్నది. -
సోమనాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు
గుజరాత్: గుజరాత్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీంతో ఆలయానికి భద్రతను పెంచటంతో పాటు హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ఆలయ ట్రస్టు కమిటీకి ఓ లేఖ వచ్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో గుజరాతీ భాషలో రాసిన ఓ లేఖ వడోదరా నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఇక బాంబు స్క్వాడ్ బృందం ఆలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకూ ఆలయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సెక్యూరిటీ ఏజెన్సీ విచారణ చేపట్టింది. కాగా సోమనాథ్ ఆలయం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది. -
సుందర సోమనాథుడు
పాఠక పర్యటన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ దేవాలయం సందర్శించే భాగ్యం కలగడం మా అదృష్టం. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో ఆ దేవాలయాన్ని, ఆ దైవ సన్నిధిని స్మరించుకోవడం మరింత భాగ్యం. నేటికీ రెండు నెలల క్రితం అహ్మదాబాద్‌లో బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి మా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాజ్‌కోటి ఎక్స్‌ప్రెస్‌లో అహ్మదాబాద్ చేరుకున్నాం. బంధువుల ఇంట సందడి పూర్తవగానే చుట్టుపక్కల ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు చూడాలని బయల్దేరాం. అందులో ముందుగా గాంధీనగర్‌ను, ఆ తర్వాత గుజరాతీల ఇష్టదేవత భద్రకాళీ, జగన్నాథ మందిరాల దర్శించుకున్నాం. ఆ తర్వాత .. అహ్మదాబాద్ నుండి సోమనాథ్ దేవాలయం ఎంత దూరంలో ఉందో వాకబు చేశాం. అహ్మదాబాద్ నుండి 400 కి.మీ దూరం ఉన్న సోమనాథ్‌కు బస్‌ల ద్వారా చేరుకోవచ్చు. మేం లగ్జరీ బస్‌లో ముందుగా టికెట్ బుక్ చేసుకొని బయల్దేరాం. రాత్రంతా ప్రయాణించి, ఉదయం 8 గం.లకు సోమనాథ్ చేరుకున్నాం. అక్కడ గైడ్‌ను మాట్లాడుకొని, దేవాలయ సందర్శనకు బయల్దేరాం. ప్రాచీన వైభవం... సోమనాథ్ దేవాలయం అతి ప్రాచీన కట్టడం. ఈ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆలయం నిర్మాణం, నాటి ప్రాచీన శిల్ప కళా వైభవం అడుగడుగునా అబ్బురపరిచింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో యాదవుల రాజు వల్లభ ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఆ తర్వాత కాలంలో ఎన్నో దాడులకు ఈ కట్టడం లోనైందని తెలిసింది. చాళుక్యుల నిర్మాణ కౌశలం అడుగడుగునా కనిపిస్తుంది. 1947లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని గైడ్ ద్వారా తెలుసుకున్నాం. ఎర్రటి రాయితో చేసిన ఈ ఆలయ నిర్మాణం గుజరాత్ ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆలయ సమీపంలోని కోనేరు విశాలమైనది. ఆ నీటిలో స్నానాలు ముగించుకొని శివలింగ దర్శనం చేసుకున్నాం. సోమనాథ్ దేవాలయంతో పాటు అక్షరథామ్, సబర్మతీ ఆశ్రమం, మౌంట్ అబూ ప్రదేశాలనూ చూసి వచ్చాం. ఈ పర్యటన ఎప్పటికీ మరచిపోలేనిదిగా మా మదిలో నిలిచిపోయింది. -కె.సునీత కృష్ణమూర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్


