‘మా కుటుంబంతా శివ భక్తులమే’

Rahul Gandhi Says His Family is Devotee of Lord Shiva - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ దేవాలయాన్ని సందర్శించే చేసిన సంతకంపై చెలరేగుతున్న వివాదంపై రాహుల్‌ స్పందించారు. హిందువులు రిజిస్టర్‌లోనే సంతకం చేసినట్లు ఆయన చెప్పారు. అయితే పొరపాటున పార్టీ కార్యకర్తలు.. ఇతరులు రిజిస్టర్‌లో సంతకం చేసినట్లు ప్రకటించాని ఆయన చెప్పారు.  నానమ్మ ఇందిరాగాంధీ నుంచి మా కుటుంబమంతా శివభక్తులమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. నానమ్మ శివుడిని ఆరాధించేదని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. నానమ్మ ప్రేరణతో తామంతా పరమేశ్వరుడికి భక్తులుగా మారిపోయాని.. మొత్తం కుటుంబమంతా శివారధాన చేస్తుందని ఆయన చెప్పారు.

మతాన్ని, భగవంతుడిని రాజకీయ లబ్దికోసం ఉపయోగించునే సంస్కృతి తనకు లేదని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మతం అనేది వ్యక్తుల ఆంతరగింక, వ్యక్తిగత విషయని ఆయన స్పష్టం చేశారు. మతం పేరనుతో వ్యాపారాలు, రాజకీయాలు చేయడం తగదని ఆయన చెప్పారు. ’నేను సోమనాథ్‌ ఆలయంలో హిందూ సందర్శకులు రిజిస్టర్‌లోనే సంతకం చేశానని.. కొన్ని మీడియా వర్గాలు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేశాయని’ రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top