దేశ యువత, ప్రజలకు దేశ యువత, ప్రజలకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి | BJP leader N Ramachandra Rao demands Rahul Gandhi should apologize to people of country | Sakshi
Sakshi News home page

దేశ యువత, ప్రజలకు దేశ యువత, ప్రజలకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి

Feb 26 2026 1:35 AM | Updated on Feb 26 2026 1:35 AM

BJP leader N Ramachandra Rao demands Rahul Gandhi should apologize to people of country

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో ఏఐ సమ్మిట్‌ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన యాదృచ్ఛి కంగా చేసింది కాదని,అది పూర్తిగా రాహుల్‌గాంధీ చేయించిన సిగ్గుమా లిన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు. ‘రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ దేశ గౌర వాన్ని దెబ్బతీసేలా, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను అవమానించేలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

ఇప్పటికైనా రాహుల్‌ దేశ యువత, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్‌ చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన లంకల రమేశ్‌రెడ్డి, విజేశ్వర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు శివశంకర్, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, నరేశ్‌కుమార్, న్యాయవాది శివకుమార్‌ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కూడా మావోయిస్టు ముక్త్‌గా చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. చేరికల కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి,  మాధవరం కాంతారావు,  గణేశ్‌కుందే, నిరంజన్‌ యాదవ్, శ్రీధర్, కిశోర్,  తాడూరి శ్రీనివాస్, రవినాయక్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోంది 
రాష్ట్రంలో వరుస హింసాత్మక ఘటనలతో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డిటౌన్, నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లలో జరిగిన ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. బుధవారం డీజీపీకి ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్య  తదితరులతో కలిసి రాంచందర్‌రావు వినతిపత్రం సమర్పించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement