breaking news
Apology
-
కాంతార కాంట్రవర్సీకి చెక్.. సారీ చెప్పిన రణవీర్ సింగ్
-
తిరుమల ప్రసాదంపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శివజ్యోతి
-
ట్రెండీ అపాలజీ..! సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్..
సామాజిక మాధ్యమాల ప్రవేశంతో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో ఓ సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ‘అపాలజీ’ పేరుతో పోస్టర్లు రూపొందించి జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ సేవలను ప్రచారం చేస్తున్నాయి. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ప్రజల దృష్టిని తక్షణమే ఆకర్షించేందుకు ఈ వినూత్న ప్రయోగాన్ని కార్పొరేట్ సంస్థలు అనుసరిస్తున్నాయి. అయితే దీనికి విపరీతమైన ప్రచారం లభించడంతో సంస్థలు మొదలు సెలబ్రిటీల వరకూ పోస్టర్లు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ప్రతియేటా ఏదో ఒక కొత్త విషయం ట్రెండ్ అవ్వడం సర్వసాధారణమే.. కాగా ఈ యేడాది చివరిలో ఈ కొత్త తరహా ‘క్షమాపణల’ పోస్టర్స్ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అన్నట్లు.. మార్కెటింగ్ స్ట్రేటజీలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు కార్పొరేట్స్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అన్వేషిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన ట్రెండే ‘అఫీషియల్ అపాలజీ’. ఎవరైనా తప్పు చేసి సారీ చెప్పడం మామూలే.. అయితే ఏ తప్పూ చేయకున్నా.. సారీ చెప్పడం.. బ్రాండ్ స్టేట్మెంట్గా మారుతోంది.. అది కూడా ఆ బ్రాండ్ తరపున ఒక ఫార్మల్ లేఖ రూపంలో క్షమాపణలు కోరుతూ.. ఈ కొత్త ట్రెండ్‌లోనూ హైదరాబాద్ తన ప్రాముఖ్యతను చాటుకుంటోంది. భాగ్యనగరానికి చెందిన అనేక సంస్థలు, బ్రాండ్స్ సామాజిక మాధ్యమాల్లో తమ పోస్టులతో ఆకిర్షస్తున్నాయి. అయితే ఇది తప్పు చేసినందుకు కాదు.. ఆయా సంస్థలు, బ్రాండ్స్ అందించే మెరుగైన సేవలు, గొప్పతనాన్ని వివరిస్తూ.. ఈ సారీ ట్రెండ్‌ని అనుసరిస్తున్నాయి. సారీ అంటే సరిపోదు.. నమ్మకం ఉండాలి..ఈ ట్రెండ్‌ను ఫాలోకావడం సరదాగానే ఉంటుంది.. కానీ, మార్కెటింగ్ విశ్లేషణలో భిన్న ఫలితాలుంటాయనేది నిపుణుల మాట. వాస్తవ సమస్యలు, తప్పిదం జరిగినప్పుడు మాత్రమే సీరియస్ అపాలజీ చెప్పాలి. లేకపోతే ‘సారీ’ అనే పదం విలువను కోల్పోతుందని, వసూళ్ల కోసం వినియోగించడం సరికాదని అంటున్నారు. హైదరాబాద్ వంటి నగరంలో లైఫ్–స్టైల్ వినియోగదారులు దీనిని ఎంజాయ్ చేయాలంటే.. క్రియేటివిటీని ఆస్వాదించినంత వరకే పరిమితం చేసి.. బ్రాండ్ నమ్మకాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు. ఫిలిప్పీన్స్ టు హైదరాబాద్..2024లో మధ్య ఫిలిప్పీన్స్‌లో ఒక చిన్న వినోదాత్మక జోక్‌గా మొదలైన ఈ ట్రెండ్ 2025లో ప్రపంచమంతా విస్తరించింది. హైదరాబాద్ సహా మార్కెట్లో ఫేమస్ బ్రాండ్స్ ఈ ఐడియాను విస్తృత స్థాయిలో అనుసరిస్తున్నాయి. స్కోడా, వోక్స్ వేగన్, మింత్రా, హల్దీరామ్స్, అదానీ, రిలయన్స్ వంటి కార్పొరేట్స్ ఈ నెలలో (నవంబర్ 2025) ఇలాంటి క్రియేటివ్ పోస్ట్స్ పెట్టి వ్యూహాత్మకంగా సందడి చేస్తున్నాయి. ఈ బ్రాండ్లు వినియోగదారులపై సరదాగా తమ ఎంగేజ్మెంట్ టాపప్ చేసుకోవడానికి.. ‘తమ సేవలు బాగా ఉన్నాయనే’ విషయాన్ని రింగ్–బెల్ చేయడానికి ఈ ఫార్మాట్ అనుసరిస్తున్నాయని మార్కెటింగ్ విశ్లేషకులు చెబుతున్నారు. సీరియస్ వర్సెస్ ఫన్నీ.. అయితే ప్రధాన మీడియా సంస్థల్లో వాస్తవ సందర్భాల్లోని పొరపాట్లకు, నిర్లక్ష్యానికి సంబంధించి నిజమైన అపాలజీ కోరిన సందర్భాలను ప్రజలకు చేరువ చేస్తుంది. ఇలా బ్రాండ్స్‌కు సంబంధించి పలు కేసుల్లో పోలీసులు, కోర్టు చర్యల వరకూ వెళ్లి ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వచి్చంది. ఇలాంటి సందర్భాల్లో నిజమైన స్పష్టత, బాధ్యతతో కూడిన అపాలజీ చెప్పడం జరిగింది. దీనికి భిన్నంగా నగరంలోని క్రియేటివ్ ఏజెన్సీలు, రెస్టారెంట్స్, ఫ్యాషన్ డిజైనర్లు ఈ ఫార్మాట్‌ను సరదాగా అడాప్ట్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ మొదలు ఫ్యాషన్ వరకు.. ఈ ట్రెండ్‌లో హైదరాబాద్ సైతం టాప్‌లో ఉంది. ముఖ్యంగా నగర జీవనశైలిలో యువత వినియోగం, డైన్–అవుట్, ఫుడ్ బ్లాగింగ్ వంటి భిన్న రంగాలను ఈ ట్రెండ్ ప్రభావితం చేస్తోంది. ఫుడ్ షాప్స్ వాళ్ళ ‘బెస్ట్–సెల్లర్’ గురించి ఫన్నీ అపాలజీ పెడితే.. దీనిని యువత తమ క్లోజ్–ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తున్నారు. ఫ్యాషన్ బ్రాండ్ వినూత్నంగా ‘సారీ.., మన ఫ్యాషన్ వేర్ కొంటున్నందుకు’ అంటూ సరదాగా పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఒకవైపు హాస్యంతో బ్రాండ్–కనెక్షన్ పెరుగుతోంది. కాగా మరోవైపు దీని అసలు అర్థం మారుతోందని, భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, ఫలితంగా వినియోగదారులు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మా క్రియేటివిటీకి క్షమాపణలు.. ఈ బ్రాండ్ ట్రెండ్‌లో భిన్న రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం భాగమయ్యారు. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల నిర్మిస్తున్న తదుపరి చిత్రం రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సంబంధించిన పాట గురించి ఇలాంటి ఆసక్తికర పోస్ట్‌తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.ప్రముఖ సినిమా రంగ సంస్థ టీ–సిరీస్ సైతం ఇలాంటి పోస్ట్‌తో తమ ఫాలోవర్లను ఫన్నీగా ఆకర్షించింది. పలువురు సెబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్లు, ప్రముఖ చెఫ్‌లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ట్రెంటీ పోస్టులతో తమ బ్రాండ్‌ను వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. ( చదవండి: పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్‌క్యూ') -
క్షమాపణ చెప్పినా బీబీసీని వదలని ట్రంప్
లండన్: గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబొరా టర్నెస్ రాజీనామా చేశారు. బీబీసీ చైర్మన్ సమీర్ షా కూడా చెప్పారు. అయినప్పటికీ చట్ట పరమైన చర్యల కోసం కోర్టు కెళతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి 5 కోట్ల డాలర్ల వరకు తాము పరిహారం కోరే అవకాశముందని శనివారం ఆయన తెలిపారు. ‘మోసానికి పాల్పడినట్లు బీబీసీయే ఒప్పుకుంది. కానీ, క్షమాపణలను చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. వాళ్లు మోసం చేశారు. నేను చెప్పని మాటలను చెప్పినట్లుగా డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు’అని ట్రంప్ ఆరోపించారు. 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేయడంలో పొరపాటు జరిగిందని, తామలా ఉద్దేశపూర్వకంగా చేయలేదని గురువారం బీబీసీ వివరణ ఇచ్చుకుంది. అయితే, పరిహారం చెల్లించేది లేదని తెలపడంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. తాము మరోసారి ఇలాంటి తప్పిదం చేయమంటూ బీబీసీ ఇచ్చిన వివరణను సైతం ఆయన తప్పుబట్టారు. ‘మీరు చేయకపోవచ్చు, ఇతరులు చేస్తే మాత్రం ఆపరు..ఇదే కదా మీ ఉద్దేశం’అంటూ బీబీసీపై కారాలు మిరియాలు నూరారు. దావా వేయాలని తాము అనుకోవడం లేదన్న ఆయన, అలా చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. -
తప్పు ఒప్పుకొన్న కొండా సురేఖ.. నాగార్జునకు క్షమాపణ
-
కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీ
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల కోట్ల సంపద ఉన్నా హుందాగా, అణకువగా ఉంటారు. తమ పిల్లలకూ అవే విలువలు నేర్పించారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు అవసరమైతే కఠినంగానూ వ్యవహరించారు. ఇలాగే ఓ సందర్భంలో తమ కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్‌మెన్‌కి క్షమాపణ చెప్పించారని మీకు తెలుసా?ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు లక్షల కోట్ల సంపద ఉన్నా డౌన్ టు ఎర్త్ స్వభావం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. వారు తమ పిల్లలు ఆకాశ్ అంబానీ (Akash Ambani), అనంత్ అంబానీ, ఇషా అంబానీలో సైతం ఈ విలువలను నింపారు. పిల్లల పెంపకం విషయంలో సాధారణ తల్లిదండ్రుల మాదిరిగానే కఠినంగా వ్యవహరించారు.వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పిన ఆకాశ్ అంబానీముఖేష్ అంబానీ ఒకసారి తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్‌మెన్‌కి క్షమాపణ చెప్పించారు. సిమి గరేవాల్ షోలో పేరెంటింగ్ విధానాల గురించి చర్చ సందర్భంగా నీతా అంబానీ ఆ సంఘటన గురించి పంచుకున్నారు. ఓసారి ఆకాశ్ బిల్డింగ్ వాచ్‌మెన్‌తో ఫోన్లో చాలా దురుసుగా మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన ముకేశ్ అంబానీ వెంటనే ఆశాశ్ను మందలించినట్లుగా నీతా అంబానీ వెల్లడించారు.అంతటితో ఆగకుండా కొడుకు ఆకాశ్‌ను కిందకు తీసుకువెళ్లి ఆ వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించారు. ఈ విషయంలో ముకేశ్ పేరెంటింగ్ స్టైల్ చాలా కఠినంగా ఉందని నీతా వివరించారు. వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలని ముకేశ్ తన పిల్లలకు స్పష్టంగా బోధించారని తెలిపారు. అంబానీ కుటుంబంలో భాగమైనంత మాత్రాన తన పిల్లలను ఎప్పుడు హద్దు దాటనీయలేదని నీతా చెప్పుకొచ్చారు. -
క్షమించండి తప్పు చేశా..
-
గాంధీపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన నటుడు శ్రీకాంత్
గత వారం రోజులుగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వార్తల్లో ఉంటూ వచ్చాడు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన ఇతడు.. తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. గాంధీ మహాత్ముడేమీ కాదని, భారత దేశానికి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీని తర్వాత మరో వీడియోలో వర్ణించడానికి వీల్లేని విధంగా కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) అయితే శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇతడు నటించిన 'అరి' సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు. థియేటర్ బయట శ్రీకాంత్ దిష్టిబొమ్మని కూడా పలువురు వ్యక్తులు దహనం చేశారు. ఆదివారం.. మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. శ్రీకాంత్ తీరు గురించి ఫిర్యాదు చేశారు.దీంతో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలుగులో నోటికొచ్చినట్లు మాట్లాడిన ఇతడు.. ఇప్పుడేమో ఇంగ్లీష్‌లో క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలానే మూవీ రివ్యూయర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. నటుడిగా ఇతడు బాగా చేస్తుండొచ్చు గానీ అప్పుడప్పుడు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) View this post on Instagram A post shared by Shrikanth Krishnaswamy (@shrikanth_bharat) -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
తప్పు ద్రోవ పట్టించా.. క్షమించండి సభలో లోకేష్ క్షమాపణలు
-
క్షమాపణలు చెప్పడానికి సిద్ధం, కానీ.. : డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలకు సిద్ధపడ్డారు. కానీ, ఆ క్షమాపణలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాదని.. నిజంగా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే చెబుతానని అంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ చర్యలు తీసుకునే ఉండేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా డీకే స్పందించారు.‘‘బీజేపీని విమర్శించేందుకే నేను ఆ పాట పాడాను. కానీ కొందరు దీనిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడిఉంటే.. అందుకు చింతిస్తున్నాను. నేను క్షమాపణలు చెప్తాను. అయితే అవి రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు అని అన్నారాయన. అలాగే గాంధీ కుటుంబం (Sonia Gandhi family), కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని అని స్పష్టం చేశారు.ఇటీవల అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై చర్చ నడిచింది. ఆ సమయంలో డీకే శివకుమార్ విపక్షాల విమర్శలకు బదులిస్తూ.. ఆర్ఎస్ఎస్ గేయాన్ని ఆలపించారు. ‘నమస్తే సదా వస్తలే మాతృభూమే’ అంటూ ఆయన నోట రావడంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ వారు నినదించారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆ పరిణామాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. -
తెలియక నోరు జారాను.. రామ్ చరణ్ నన్ను క్షమించండి
-
‘సిక్కిం పొరుగు దేశమా?’.. బీజేపీ చురకతో కాంగ్రెస్ నేత క్షమాణలు
న్యూఢిల్లీ: కొందరు రాజకీయ నేతల ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. దీంతో వారు అభాసుపాలవుతుంటారు. తాజాగా సిక్కింనకు చెందిన కాంగ్రెస్ నేత ఇదేవిధమైన వివాదంలో చిక్కుకున్నారు. తరువాత క్షమాపణలు చెప్పడంతో పాటు పొరపాటున నోరు జారానని వివరణ కూడా ఇచ్చారు.సిక్కిం కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ సిక్కింను పొరుగు దేశం అని పేర్కొన్న ఒక వీడియో వెలుగులో రావడంతో అతని మాటలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీంతో అజోయ్ కుమార్ ఒక ప్రకటనలో తన నోరు జారడం వల్ల అలా జరిగిందంటూ క్షమాపణలు చెప్పారు. తాను విలేకరుల సమావేశంలో భారత్- పొరుగు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల గురించి మాట్లాడుతూ, పొరపాటున సిక్కింను పొరుగు దేశంగా ప్రస్తావించాను. ఇది అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమంటూ అజోయ్ కుమార్ తన తప్పుకు వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. The BJP Sikkim unit vehemently denounces the outrageous and ignorant statement made by INC leader Ajoy Kumar, who shockingly referred to Sikkim as a "neighboring country" during his press conference at AICC headquarters today. It is utterly deplorable that a former IPS officer… pic.twitter.com/Uwoi6gTyV4— BJP Sikkim (@BJP4Sikkim) July 1, 2025కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ తప్పుడు వ్యాఖ్యలను సిక్కిం బీజేపీ సిక్కిం యూనిట్ తీవ్రంగా ఖండించింది.. ఒక మాజీ ఐపీఎస్ అధికారి, పార్లమెంటు సభ్యుడైన అజయ్ కుమార్ భారతదేశ చరిత్ర భౌగోళిక స్వరూపంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమని బీజేపీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవమానకరమైన తప్పులను నివారించేందుకు, వెంటనే పార్టీ నేతలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. ఈ అంశంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనవాలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిన్నా అడుగుజాడలను అనుసరిస్తోందని, దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఇది కూడా చదవండి: ‘నితీష్‌కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు -
సారీ... కోకో!
బెర్లిన్: తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కోకో గాఫ్‌కు ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ సబలెంకా (బెలారస్) క్షమాపణలు చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం ఇద్దరు తలపడగా... అమెరికన్ స్టార్ కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం రన్నరప్ సబలెంకా మాట్లాడుతూ... తన స్వీయ తప్పిదాల వల్లే ప్రత్యర్థి గెలిచిందని, విజయంలో గాఫ్ పాత్రలేదన్నట్లుగా వ్యాఖ్యానించింది. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అయిన సబలెంకా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో క్షమాపణలు కోరుతూ సబలెంకా లేఖ రాసింది. ‘నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఓ విజేతను ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదు. నా భావోద్వేగాలను నియంత్రించుకుని ఉంటే బాగుండేది. గాఫ్‌ను క్షమాపణలు కోరుతున్నాను. మనుషులందరూ పొరపాట్లు చేస్తుంటారు. జీవితంలో నేర్చుకునే దశలో ఉన్న నేను కూడా అంతే. తదనంతరం నేను మాట్లాడిన మాటలు నన్నే కలత పెట్టాయి. ముమ్మాటికి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచే అర్హత గాఫ్‌కే ఉంది. ఆమె విజయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా’ అని లేఖలో పేర్కొంది. నిజానికి గాఫ్‌పై మాటలతో దాడి చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మీడియా సమావేశం జరగడం... ఫలితంతో నిరాశలో ఉన్న తాను అలా మాట్లాడాల్సి వ చ్చిందని వివరణ ఇ చ్చింది. ‘ఎప్పుడైనా సరై ప్రత్యరి్థని గౌరవించే నాకు ఇలా చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేయడం పట్ల మనస్తాపం చెందాను. అందుకే మన్నించమని విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో నేను ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది’ అని సబలెంకా తెలిపింది. బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా రెండు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) టైటిల్స్‌తో పాటు ఒక యూఎస్ ఓపెన్ (2024) ట్రోఫీ గెలుచుకుంది. అయితే ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్‌తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తడబడింది. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది. గాఫ్ మాత్రం 30 తప్పిదాలే చేసి టైటిల్ విజేతగా నిలిచింది. కోకో గాఫ్ 2023లో సబలెంకాపైనే గెలిచి యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా సాధించింది. -
మస్క్ క్షమాపణలపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌లు మళ్లీ దగ్గరకానున్నరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ ఇద్దరు స్నేహితులు సోషల్ మీడియాలో పరిస్పరం విమర్శలు చేసుకున్నారు. వీరి వివాదం ఎటువైపునకు దారితీస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే ఇంతలో ఎలాన్ మస్క్ ట్రంప్‌ను క్షమాపణలు కోరుతూ, ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘న్యూయార్క్ పోస్ట్’తో జరిగిన ఫోన్ ఇంటర్వ్యూలో మస్క్ క్షమాపణలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. తన భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, తనకు కఠినమైన భావాలు లేవని ట్రంప్ అన్నారు. మస్క్ తనను క్షమాపణలు కోరడం చాలా బాగుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బడ్జెట్ బిల్లుపై మస్క్ పలు విమర్శలు చేశారని, అందుకు అతనిని నిందించనని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని కూడా అన్నారు.ట్రంప్‌కు మాజీ సహాయకుడు ఎలోన్ మస్క్ గత వారంలో ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తూ, సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో వీరి మధ్య వైరం పెరిగింది. ఆ తరువాత ట్రంప్ తన రాజకీయ విజయంలో మస్క్ పాత్రను తక్కువ చేస్తూ స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా 2024 ఎన్నికల్లో ట్రంప్ తన మద్దతు కారణంగానే విజయం సాధించారని మస్క్ పేర్కొన్నారు. తాజాగా మస్క్ తాను గతంలో ట్రంప్‌పై ఆరోపణలు చేస్తూ, చేసిన పోస్టులలో కొన్నింటిని తొలగించి క్షమాపణలు కోరారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్‌తో ప్రైవేట్‌గా మాట్లాడిన తర్వాత మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను క్షమాపణలు కోరారు. సోమవారం మస్క్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను కలిసినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ట్రంప్.. ఎలాన్ మస్క్ క్షమాపణలను అంగీకరించారని సమాచారం. అయితే వారి మునుపటి సంబంధాలను పునరుద్ధరించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయలేదని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం -
‘ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పండి’
బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరన్నుమ్ (Fouzia Taranum)పై చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు మండిపడింది. ముందెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన్ని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఓ కార్యక్రమంలో.. సీనియర్ ఐఏఎస్ ఫౌజియాను ఉద్దేశించి ‘పాకిస్తానీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకుగానూ ఆయనపై కేసు కూడా నమోదయ్యింది.అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ రవికుమార్ హైకోర్టును (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సుప్రీం కోర్టు ఎలా స్పందించిందో మీరూ చూశారు. కాబట్టి మీరేం అందుకు అతీతులు కారు. మీరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. కాబట్టి మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పండి’’ అని ధర్మాసనం రవికి స్పష్టం చేసింది.మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందంటే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియాకు కర్నల్ సోఫియా ఖురేషీ (Sofiya Qureshi) ఆ వివరాలను వెల్లడించారు. అయితే.. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కున్వర్ విజయ్ షా (Kunwar Vijay Shah) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని (సోఫియా ఖురేషీని ఉద్దేశించి) సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే..చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టింది. పదవిలో ఉంటూ అవేం మాటలంటూ మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు క్షమాపణలు తెలియజేయగా.. ఆపై ద్విసభ్య ధర్మాసనం వాటిని అంగీకరించ లేదు. ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పారని.. మొసలి కన్నీరు కార్చరని మళ్లీ ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు సమగ్ర నివేదికను కోర్టు కోరింది. అయితే అరెస్ట్ నుంచి మాత్రం కున్వర్‌కు ఊరట ఇచ్చిన న్యాయస్థానం.. తాజాగా ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.కర్ణాటకలో ఏం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి (Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే (ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే..అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరన్నుమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ (MLC N Ravikumar) పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్‌లో ఫిర్యాదు నమోదు కాగా.. రవికుమార్‌పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలో తాను ఏదో భావోద్వేగంలో అలా అనేశానంటూ వివరణచ్చారు. మరోవైపు.. రవికుమార్‌పై చర్యలు కోరుతూ గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా నిరాకరించారు. ఇదీ చదవండి: మస్క్ ఎగ్జిట్‌పై స్పందించిన ట్రంప్, ఏమన్నారంటే.. -
క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్‌ను ప్రజలే చూసుకుంటారు.#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3— ANI (@ANI) May 28, 2025భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు. ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
ఇబ్బందుల్లో ఉన్నా.. అందుకే చోరీ చేస్తున్నా
ఖర్గావ్: ‘జుజర్ భాయ్.. నిండా అప్పుల్లో మునిగి ఉన్నా..అప్పులోళ్లు రోజూ వేధించుకు తింటున్నారు..వాళ్లతో వేగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దొంగతనం చేస్తున్నా..అదీ శ్రీరామ నవమి నాడు..! ఏమీ అనుకోకు, నీ డబ్బు మళ్లీ ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా.. ఇది నా వాగ్దానం’అంటూ ఓ మంచి దొంగ ఓ దుకాణం నుంచి రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గావ్ జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘరానా చోరీ ఘటన చోటుచేసుకుంది. మరునాడు దుకాణం తెరిచిన జుజర్ అలీ బొహ్రాకు నగదు ఉంచిన బ్యాగులో ఈ లేఖ కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆయన విషయం పోలీసులకు తెలిపారు. చోరుడు ప్రింటెడ్ లేఖలో దుకాణం యజమానిని జుజర్ భాయ్ అంటూ మర్యాదగా సంబోధించాడని పోలీస్ ఎస్సై అర్షద్ ఖాన్ చెప్పారు. బ్యాగులో ఉంచిన రూ.2.84 లక్షలకు గాను అతడు రూ.2.45 లక్షలు మాత్రమే తీసుకెళ్లి, రూ.38వేలను లేఖతోపాటు బ్యాగులోనే వదిలివెళ్లాడని యజమాని తెలిపాడన్నారు. రామ నవమి పండగ నాడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నందుకు క్షమించాలని కూడా దుకాణం యజమానిని అతడు కోరినట్లు ఎస్సై వివరించారు. ‘నేనుండేది మీ చుట్టుపక్కల ప్రాంతంలోనే. నాకు చాలా అప్పులున్నాయి. అప్పిచ్చిన వాళ్లు రోజూ నా ఇంటికి వస్తున్నారు. దొంగతనం చేయాలని నాకు ఏ మాత్రంలేదు. కానీ, గత్యంతరం లేదు. ఈ డబ్బుతో నాకు చాలా అవసరముంది. అయితే, అవసరమైనంత మాత్రమే తీసుకెళ్తున్నా. మిగతాది బ్యాగులోనే వదిలిపెడ్తున్నా. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. అప్పుడిక మీరు నన్ను పోలీసులకు అప్పగించొచ్చు’అని అందులో వివరించాడు. అంతేకాదు, ఈ లేఖలో పేర్కొన్న ప్రతి విషయమూ సత్యమేనని స్పష్టం చేశాడన్నారు. -
Chittoor: దళితులకు అవమానం.. కాళ్ల మీద పడి క్షమాపణలు కోరిన కలెక్టర్
చిత్తూరు, సాక్షి: సీఎం సొంత జిల్లాలో దళితులకు ఘోర అవమానం జరిగింది. జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా.. ప్రభుత్వ కార్యక్రమానికి దళితులకు ఆహ్వానం వెళ్లలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా సంఘాల నాయకులు నిరసనకు దిగగా.. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు. బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకల్లో అధికారుల అలసత్వం బయటపడింది. అధికారిక కార్యక్రమాలకు దళితులకు ఆహ్వానం పంపించలేదు. కూటమి పాలనతో తాము నిర్లక్ష్యానికి గురౌతున్నామంటూ దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ విషయమై సదరు కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఆవేదన విన్న కలెక్టర్ సుమిత్.. అది కింది స్థాయి ఉద్యోగులు చేసిన తప్పిదమని, తప్పకుండా చర్యలు తీసుకుంటానంటూ దళిత సంఘాల నేతల కాళ్ల మీద పడి క్షమాపణలు కోరడంతో చివరకు శాంతించారు. -
ట్రోలింగ్ దెబ్బకు ‘ఐఐటీ బాబా’ క్షమాపణలు
లక్నో:మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్సింగ్పై సోషల్‌మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం(ఫిబ్రవరి 23) జరిగిన ఇండియా,పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతుందని మ్యాచ్‌కు ముందు బాబా జోస్యం చెప్పారు. అయితే బాబా చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా పాక్‌పై ఇండియా విజయం సాధించింది.Agar aaj iss IIT baba ki baat sach hui to main jaa raha firr to inse milne🙌🏻 All eyes on King Kohli👑#INDvsPAK pic.twitter.com/CjEFPybBhR— Ritesh Sharma (@delphic_RS) February 23, 2025దీంతో ఐఐటీబాబాను నెటిజన్లు సోషల్‌మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. బాబాపై మీమ్స్ వరద పారిస్తున్నారు. ఇక నుంచి బాబాను ఎవరూ ఇంటర్వ్యూలకు పిలవొద్దని పోస్టులు పెడుతున్నారు. జోస్యాలు చెప్పడం మానేసి మూలకు పడుండాలని హెచ్చరిస్తున్నారు. Baba...🙏😂#INDvsPAK #ViratKohli𓃵 #IITianBaba pic.twitter.com/t0dTKADhGM— Himanshu Sankhla (@himanshu_zerO9) February 23, 2025I have resigned recently from my job. It’s All yours now !! Ram ram, Jay Shri Ram #IITianBaba #INDvsPAK #ViratKohli𓃵 #ChampionsTrophy pic.twitter.com/jAgky6BzOS— Prafull Billore (@pbillore141) February 23, 2025అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో బాబా స్పందించారు. తన తప్పుడు జోస్యానికి క్షమాపణలు కోరుతూ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. మ్యాచ్‌లో భారత్ విజయం తర్వాత కోహ్లీ తదితరులు సంబరాలు చేసుకుంటున్న ఫొటోలు షేర్ చేశారు. కాగా, ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభయ్‌సింగ్ సాధువుగా మారాడు.I want to publicly apologize and ask each one of you all to celebrate,it's party time... Mujhe man hi man pata tha ki india jetega.😉#IITianBaba #INDvsPAK #ChampionsTrophy #ViratKohli #ViratKohli𓃵 #ChampionsTrophy2025 pic.twitter.com/QHozGNzfmF— Abhay Singh (IIT BOMBAY) (@Abhay245456) February 23, 2025 -
బోర్డు మెంబర్ నరేష్ తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించిన EO
-
కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు
మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ చేసిన పొరపాటుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సంస్థ క్షమాపణలు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్‌బర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని దూబే అన్నారు. ఈ వ్యవహారంపై మెటా స్పందించింది.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా.. సర్దుకోవాల్సిందే..మెటా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివంత్ తుక్రాల్ కంపెనీ సీఈఓ చేసిన తప్పుకు క్షమాపణలు కోరారు. కంపెనీకి భారత్ ఎంత ప్రాముఖ్యమైందో పునరుద్ఘాటించారు. ‘అధికారంలో ఉన్న అనేక పార్టీలు 2024 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించవనే మార్క్ వ్యాఖ్యలు అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ, భారత్ అందుకు మినహాయింపు. ఈ అనుకోని పొరపాటుకు మేం క్షమాపణలు కోరుతున్నాం. కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైంది’ అని తుక్రాల్ అన్నారు. -
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
విమాన ప్రమాదంపై పుతిన్ ‘సారీ’
మాస్కో: కజకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారు. అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం బుధవారం అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించడం తెలిసిందే. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాపణ చెప్పడం గమనార్హం. అయితే, విమాన ప్రమాదానికి బాధ్యత తమదేనంటూ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంగీకరించలేదు. ‘అజెర్బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి’ అని అంతకుముందు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ కాల్పుల వల్లే విమానం కూలిందంటూ వేరుగా అందులో పేర్కొనలేదు. రష్యా గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్న కారణంగా అధ్యక్షుడు పుతిన్ అజెర్బైజాన్ ప్రెసిడెంట్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారని క్రెమ్లిన్ వివరించింది. దీనిని అజెర్బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. -
నన్ను క్షమించండి: సౌత్‌కొరియా అధ్యక్షుడు
సియోల్:దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. ‘తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి..మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను’అని యూన్ సుక్ యోల్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్ తన తప్పు ఒప్పుకున్నారు.ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి దేశ భవిష్యత్తు, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నారు. దేశాన్ని పాలన విషయాన్ని తనపార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని తెలిపారు. ఇలాంటి తప్పు మరోసారి చేయనని యోల్ స్పష్టం చేశారు. యోల్‌పై మోపిన అభిశంసన తీర్మానంపై శనివారం దక్షిణ కొరియా పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్‌కు ముందు శనివారం(డిసెంబర్ 7) ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం. ఇదీ చదవండి: నియంతకు పరాభవం -
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన ఎంపీ
శివసేన (ఏక్నాథ్ షిండే) నేత షాయినా ఎన్సీ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ సావంత్.. తాజాగా క్షమాపణలు తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరుస్తూ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఇలా చేశానని, తనకు ఎలాంటి తప్పుడు ఉద్ధేశాలు లేవని అన్నారు. తను ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదని తెలిపారు.కాగా త్వరలో మహారాష్ల్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన షాయినా ఎన్సీ.. సీటు రాకపోవడంతో షిండే వర్గం శివసేనలో చేరారు. దీనిపై శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. . ఆమె ఇంతకాలం బీజేపీలో ఉన్నారని, అక్కడ టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరారని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను అంగీకరించరని, మా వస్తువులు ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షాయినా ముంబాదేవి నుంచి బరిలోకి దిగుతున్నారు.ఈ వ్యాఖ్యలపై షాయినా తీవ్రంగా స్పందించారు. గతంలో ఆయన తనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని, ఇప్పుడేమో తనను దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని అన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతుదారులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో సావంత్ వ్యాఖ్యలపై నాగ్‌పడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఇలా చేయటం సబబేనా!
లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది. కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది. అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు. జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు. కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి. -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నా..
పాల్ఘార్: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన పట్ల శివాజీని, శివాజీ అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.. శివాజీ అంటే కేవలం ఒక పేరు, ఒక పాలకుడు కాదని అన్నారు. ఆయన మనకు ఒక దైవం అని స్పష్టంచేశారు. ఈ రోజు ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. విగ్రహం కూలిపోవడం పట్ల శివాజీ అభిమానుల మనసులు గాయపడ్డాయని, వారందరినీ క్షమాపణ ఆర్థిస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో రూ.76,000 కోట్లతో నిర్మించే వాద్వాన్ ఓడరేవు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. మనం పాటించే విలువలను చాలా భిన్నమైనవని పేర్కొన్నారు. దైవంలాంటి ఛత్రపతి శివాజీ కంటే మనకు ఇంకేదీ గొప్ప కాదని స్పష్టంచేశారు. పదేళ్ల క్రితం బీజేపీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తన పేరు ఖరారు కాగానే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ను సందర్శించానని, శివాజీ సమాధి వద్ద ధ్యానం చేశానని మోదీ గుర్తుచేసుకున్నారు. మరాఠా వీరుడు వీర సావర్కార్‌ను కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆరోపించారు. వారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన లక్ష్య సాధనలో ‘అభివృద్ధి చెందిన మహారాష్ట్ర’ ఒక కీలక భాగమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి కోసం గత పదేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహారాష్ట్ర శక్తిసామర్థ్యాలు, సంపదతో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా ప్రయోజనం పొందాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పూర్తి అంకితభావం, నిజాయితీతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చేపల పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా వేలాది మంది మహిళల సాధికారతకు చేయూత అందించామని వివరించారు. చేపల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా రికార్డుకెక్కిందని హర్షం వ్యక్తం చేశారు. 2014లో మన దేశంలో చేపల ఉత్పత్తి కేవలం 8 మిలియన్ టన్నులుగా ఉందని, ఇప్పుడు 17 మిలియన్ టన్నులకు చేరిందని వెల్లడించారు. పదేళ్లలో ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్నారు. రూ.76,000 కోట్లతో వాద్వాన్ పోర్టు నిర్మిస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టు అవుతుందని చెప్పారు. అభివృద్ధి దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని మోదీ వ్యాఖ్యానించారు. రూ.1,560 కోట్లతో నిర్మించే 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు సైతం ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.360 కోట్లతో రూపొందించిన వెస్సెల్ కమ్యూనికేషన్, సపోర్టు సిస్టమ్ ప్రారంభించారు. బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న ‘నూతన భారత్’కు దేశ శక్తిసామర్థ్యాలు ఏమిటో పూర్తిగా తెలుసని స్పష్టంచేశారు. -
‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీ
ముంబై : చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.మహరాష్ట్రలో రూ.76వేల కోట్లతో నిర్మించనున్న వాడ్‌వాన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ‘మనమంతా ఛత్రపతి శివాజీని దేవుడిలా కొలుస్తాం. కొందరు వ్యక్తులు దేశ భక్తులను అవమానిస్తున్నారు. వీర సావర్కర్‌ను కూడా ఇష్టారీతిగా తిట్టిపోశారు. దేశభక్తులను అవమానించినవారు క్షమాపణలు చెప్పాల్సిందే. సమరయోధులను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. కానీ క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని’ ధ్వజమెత్తారు.నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది అప్పుడే 2013లో బీజేపీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రకటన అనంతరం నేను చేసిన మొదటి పని రాయ్‌గఢ్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని భక్తుడిలా సందర్శించా. అప్పటి నుంచే నా కొత్త ప్రయాణం ప్రారంభమైందని’ మోదీ అన్నారు. ముందు ఒక భక్తుడిగా కూర్చుని కొత్త ప్రయాణం ప్రారంభించడం” అని మోదీ పాల్ఘర్లో అన్నారు.#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj's statue collapse incident in MalvanHe says, "...Chhatrapati Shivaji Maharaj is not just a name for us... today I bow my head and apologise to my god Chhatrapati Shivaji Maharaj. Our… pic.twitter.com/JhyamXj91h— ANI (@ANI) August 30, 2024 -
మాజీ భర్తపై గే కామెంట్స్.. క్షమాపణలు కోరిన ప్రముఖ సింగర్!
ప్రముఖ తమిళ సింగర్ సుచిత్ర ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంంది. గతంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలపై సుచీలీక్స్ పేరుతో సంచలన ఆరోపణలు చేసింది. సినీతారలతో పాటు తన మాజీ భర్త నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్‌పై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై మాజీ భర్త కార్తీక్ కుమార్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. అయితే తాజాగా సింగర్ సుచిత్ర తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పింది. దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అతన్ని గే అని పిలిచినందుకు బాధపడుతున్నా.. ఆయన కెరీర్‌ను నాశనం చేసే ఉద్దేశం నాకు లేదు.. అందుకే క్షమాపణలు కోరుతున్నా అని తెలిపింది. అయితే కార్తీక్ ఫిర్యాదు వల్లే పోలీసుల తనకు తరచుగా కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అందుకే తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. కార్తీక్ మంచి వ్యక్తి అని.. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అయితే మళ్లీ ఆ వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అంతేకాకుండా తన క్షమాపణలను ఈ మెయిల్ ద్వారా కార్తీక్‌కు పంపుతానని చెప్పింది. ఇకపై అతని కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని తెలిపింది. ఇకపై అన్ని వదిలేసి మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సింగర్ సుచిత్రం వెల్లడించింది. కాగా.. గతంలో పలువురు కోలీవుడ్ అగ్రతారలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. కానీ!: బెంగాల్ మంత్రి
కోల్‌కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.కాగా రామ్‌నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారుఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్‌పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు. -
పాక్ సైన్యం క్షమాపణ చెప్పాలి: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యంపై విమర్శల యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి పలు కేసుల్లో ఉపశమనం లభించడంతో ఇమ్రాన్‌లో నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మే 9న అరెస్టయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ నాడు చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అయితే హింసాకాండ జరిగిన రోజున పాక్ రేంజర్లు తనను కిడ్నాప్ చేసినందున ఆర్మీ తనకు క్షమాపణ చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు.ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా పౌర, సైనిక సంస్థలకు నష్టం కలిగించింది. నాడు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) అరాచక రాజకీయాలకు పాల్పడినందుకు క్షమాపణలు కోరితే చర్చలు జరపవచ్చని అన్నారు. ఈ ప్రకటన తరువాత బ్లాక్ డే హింసకు ఖాన్ పార్టీ క్షమాపణ చెప్పాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి.డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మే 9న చెలరేగిన హింస విషయంలో క్షమాపణ చెప్పడానికి తన దగ్గర ఎటువంటి కారణం లేదని అన్నారు. నాడు ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్ నుండి మేజర్ జనరల్ నేతృత్వంలోని రేంజర్లు తనను అరెస్టు చేశారని ఖాన్ ఆరోపించారు. హింస జరిగిన రోజున తనను పాక్ రేంజర్లు కిడ్నాప్ చేశారని, అందుకు ప్రతిగా ఆర్మీ తనకు క్షమాపణలు చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు. -
రాహుల్ గాంధీ క్షమాపణలు చెబుతారా?: రవిశంకర్‌ప్రసాద్
న్యూఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం అధికారపక్షానికి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశంలో మొత్తం పరీక్షా విధానంపై రాహుల్ ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తున్నారని బీజేపీ సీనియర్‌నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.పరీక్షా విధానంపై తాను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ రాహుల్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. దేశంలోని పరీక్షా విధానాల్లో మోసం జరుగుంతోందంటూ రాహుల్ ఆరోపించారని ప్రసాద్ గుర్తుచేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ రాహుల్ దేశంలోని విద్యావ్యవస్థ పరువు తీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకులు జరిగాయన్నారని విమర్శించారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇకనైనా రాహుల్ ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. -
Sri Lanka: ముస్లింలకు క్షమాపణ చెప్పిన శ్రీలంక
కోవిడ్ సమయంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసినందుకు శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా వారికి క్షమాపణలు చెప్పింది. కరోనా బారినపడి మృతి చెందిన ముస్లింలను బలవంతంగా దహనం చేసినందుకు తమను క్షమించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగబోవని ప్రభుత్వం ముస్లింలకు భరోసా ఇచ్చింది.భవిష్యత్తులో ముస్లింలు లేదా మరే ఇతర కమ్యూనిటీ ప్రజలు అనుసరించే అంత్యక్రియల ఆచారాల విషయంలో ఉల్లంఘన జరగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఖననం లేదా దహన సంస్కారాలకు సంబంధించిన విషయంలో కొత్త చట్టం హామీ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక సభలోని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. దేశ జనాభాలో ముస్లిం జనాభా 10 శాతం అని, కోవిడ్ కాలంలో జరిగిన ఘటనలపై ముస్లింలు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు.కోవిడ్ కాలంలో శ్రీలంక ప్రభుత్వం కరోనా మృతులను ఖననం చేసేందుకు అనుమతించలేదు. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కూడా విమర్శించింది. ముస్లింలు, కాథలిక్కులు, బౌద్ధుల మనోభావాలను గౌరవించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు గతంలో వెల్లువెత్తాయి. -
పోప్‌ను అవమానించడం మా ఉద్దేశం కాదు
తిరువనంతపురం: పోప్–మోదీ భేటీపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. పోప్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచి్చంది. జీ7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మోదీ–పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్.. దానికి ‘‘చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కింది’’ అని క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుపై బీజేపీతోపాటు ఇతర పారీ్టలు విమర్శలు గుప్పించాయి. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించిన కేరళ కాంగ్రెస్, క్రైస్తవులకు క్షమాపణలు చెప్పింది. -
పోప్‌తో మోదీ.. వ్యంగ్యంగా పోస్ట్! కేరళ కాంగ్రెస్ క్షమాపణ
తిరువనంతపురం: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై సెటైరిక్‌గా ఓ పోస్ట్ చేసి.. అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో కేరళ కాంగ్రెస్ యూనిట్ క్షమాపణలు చెప్పింది. అయితే.. మోదీని విమర్శించడంలో, అవహేళన చేయడంలోనూ తాము ఏమాత్రం సంకోచించబోమని అంటోంది.ఇటలీలో జీ-7 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పోప్‌ను కలిశారు. అయితే ఆ ఫొటోను పోస్ట్ చేసిన కేరళ కాంగ్రెస్ యూనిట్.. ‘‘ఎట్టకేలకు.. దేవుడ్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కిందంటూ’’ కామెంట్ చేసింది. తాను దైవ దూతనంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేరళ కాంగ్రెస్ యూనిట్ ఈ వ్యంగ్య పోస్ట్ చేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ పోస్ట్‌పై బీజేపీ విమర్శలకు దిగింది. ఇది ప్రధాని మోదీని మాత్రమే కాదని.. పోప్‌ను కూడా అవమానించడమే అవుతుందని మండిపడింది. కేరళ ఎక్స్ హ్యాండిల్ బహుశా రాడికల్ ఇస్లామిస్ట్స్, లేదంటే అర్బన్ నక్సల్స్ చేతుల్లో ఉందేమో. అందుకే జాతీయస్థాయి అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. ఇప్పుడు ఏకంగా పోప్‌ను.. క్రైస్తవ కమ్యూనిటీని అగౌరవపరుస్తోంది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ట్వీట్ చేశారు.మరోవైపు.. బీజేపీ కార్యదర్శి జార్జి కురియన్ కూడా మతపరమైన మనోభావాల్ని దెబ్బ తీస్తున్నారంటూ కాంగ్రెస్ పోస్ట్‌పై మండిపడ్డారు. ఇంకోవైపు బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయా సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ పరిణామంపై సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే ఈ వ్యవహారం ఇక్కడితోనే ఆగలేదు. పోప్ మాటల్నే ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ.. కేరళ కాంగ్రెస్ యూనిట్ మరో పోస్ట్ చేసింది. దీంతో వ్యవహారం మరింత ముదిరింది. ఈ తరుణంలో.. కేరళ కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. సదరు పోస్టును తొలగించి.. ‘‘తమ పోస్ట్ వల్ల ఏమైనా మానసిక క్షోభ అనుభవించి ఉంటే క్రైస్తవులు క్షమించాలి’’ అని కోరింది. అయితే..ഒരു മതത്തെയും മതപുരോഹിതന്മാരെയും ആരാധനാമൂർത്തികളെയും അപമാനിക്കുകയും അവഹേളിക്കുകയും ചെയ്യുന്നത് ഇന്ത്യൻ നാഷണൽ കോൺഗ്രസിന്റെ പാരമ്പര്യമല്ലെന്ന് ഈ നാട്ടിലെ ജനങ്ങൾക്ക് മുഴുവനും അറിയാം. എല്ലാ മതങ്ങളെയും വിശ്വാസങ്ങളെയും ചേർത്ത് പിടിച്ച് സൗഹാർദ്ദപരമായ അന്തരീക്ഷത്തിൽ ജനങ്ങളെ മുന്നോട്ടു… pic.twitter.com/Jg7HBh9BMw— Congress Kerala (@INCKerala) June 16, 2024నరేంద్ర మోదీని విమర్శించడంలో మాత్రం తాము తగ్గబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో మణిపూర్‌లో జరిగిన హింస.. చర్చిల దహనం పరిణామాలపై బీజేపీ కూడా క్రైస్తవులకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది. -
మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?
నటుడు విధార్ధ్, వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం అంజామై. ఈ చిత్రం ద్వారా ఎస్వీ.సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ప్రముఖ వైద్యుడు, ర చయిత తిరునావుక్కరసు నిర్మాతగా తిరుచిత్రం పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం విడుదల హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ పొందడం విశేషం. ఈ సంస్థ ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.చిత్ర దర్శకుడు సుబ్బురామన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం పరిస్థితుల ప్రభావంతోనే రూపొందిందని చెప్పాలన్నారు. ఈ చిత్ర నిర్మాత తిరునావుక్కరసు ఒక వైద్యుడు మాత్రమే కాకుండా, రచయిత, సామాజిక సృహ కలిగిన వ్యక్తి అని చెప్పారు. నిజానికి ఇందులో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాల్సిఉందని.. అందుకు ఆయన ఒప్పుకున్నా, అనివార్య కారణాల వల్ల ఆ పాత్రలో నటుడు రఘమాన్ను నటించాల్సి వచ్చిందని చెప్పారు. అందుకు ఈ సందర్భంగా మమ్ముటికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. అయితే ఆ పాత్రలో రఘుమాన్ చాలా బాగా నటించారని చెప్పారు. చట్టం చేసే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కారణంగా ఒక సామాన్యుడు ఎలాంటి బాధలకు గురయ్యారనేదే ఈ చిత్ర కథాంశం అని చెప్పారు. విధార్ద్ మంచి నటుడన్నది తెలిందేననీ, అయితే ఆయన నుంచి మరింత నటనను వెలికి తీసినట్లు చెప్పారు. ఇక నటి వాణీభోజన్ ఈ చిత్రంలో మరో కోణంలో నటించారని చెప్పారు. నటి వాణిభోజన్ మాట్లాడుతూ అంజామై తనకు చాలా స్సెషల్ చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటుడు రఘుమాన్, కృతిక్ మోహన్, బాలచంద్రన్ ఐఏఎస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఛాయాగ్రహణం, కళాచరణ్ నేపథ్య సంగీతాన్ని అందించారు. -
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్‌రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
వివాదాస్పద జెండా.. భారత్‌కు మాల్దీవుల మంత్రి క్షమాపణలు
మాలె: భారత్‌తో దౌత్యసంబంధమైన వివాదం కొనసాగుతన్న వేళ మాల్దీవుల మంత్రి మరియం షియునా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టు మరోసారి వివాదాస్పదమైంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆమె సెస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావటంతో క్షమాపణలు తెలిపారు. మరియం ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టులోని ఫొటో భారత జాతీయ జెండాలోని అశోకచక్రాన్ని పోలి ఉండటం వివాదం అయింది. ‘నేను ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్టుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. నా పోస్ట్‌లోని కంటెంట్ వల్ల ఎవరినైనా కించపరిచినట్లు అయితే ఇవే నా క్షమాపణలు. నేను ఆ పోస్ట్ మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ ఎండీపీని విమర్శిస్తూ ఓ ఫొటో పెట్టాను. అయితే అది భారతీయ జెండాను పోలినట్లు ఉండటం నా దృష్టికి వచ్చింది. .. అందుకే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశా. అది నేను ఉద్దేశపూర్వంగా పెట్టిన ఫొటో కాదు. ఆ ఫొటోలో ఏదైనా అపార్థం కలిగించినందుకు నేను చింతిస్తున్నా. మాల్దీవుల భారత్‌తో సంబంధాలను గౌరవిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా సున్నితమైన అంశాను పోస్ట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటాను’ అని మరియం షియునా క్షమాపణ చెబుతా వివరణ ఇచ్చారు. డిలీట్ చేసిన పోస్ట్‌లో ఏం ఉంది? మాల్దీవుల అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎంసీ) నేత, మంత్రి మరియం ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ ( ఎండీపీ)ని టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీ లోగోను మార్పు చేస్తూ ఒక ఫొటోతో పోస్ట్ పెట్టారు. అయితే ఆ ఫొటో భారత్ జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని పోలి ఉండటం గమనార్హం. దీంతో పోస్ట్ వైరల్ అయి ఆమె విమర్శల పాలు అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అయితే తాజాగా ఆ పోస్ట్‌పై మరియం భారత్‌కు క్షమాపణలు తెలిపారు. ఇక.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యదీప్ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రుల్లో మరియం ఒకరు. అప్పుడు ఈ విషయంపై మాల్దీవుల ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. I would like to address a recent social media post of mine that has garnered attention and criticism .I extend my sincerest apologies for any confusion or offense caused by the content of my recent post. It was brought to my attention that the image used in my response to the… — Mariyam Shiuna (@shiuna_m) April 8, 2024 -
సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే... మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసనమండలి తొలిరోజు రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసింది. శాసనమండలి సభ్యులపైన ఓ టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హౌజ్‌లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చేప్పేవరకు సభను ముందుకు సాగనివ్వమని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్ ఐదుసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో ధన్యవాద తీర్మానంపై చర్చ కు అవకాశం లేకుండా పోయింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందా? లేదా? చూడాలి. సభ ప్రారంభంలోనే గందరగోళం ఉదయం సభ ప్రారంభం కాగా... చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముందుగా సభలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు స్వాగతం పలికారు. అనంతరం బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు భానుప్రసాద్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాసనమండలి సభ్యులపైన సీఎం రేవంత్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హౌజ్‌లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సైతం గొంతు కలపడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగజేసుకుంటూ సీఎం వాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపామనీ, సభ్యులు ఈ అంశంపై నోటీసు ఇస్తే చర్చకు అవకాశం కల్పిస్తానన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకుండా సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పదినిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదన్న జూపల్లి ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యు లు అదే తీరును ప్రదర్శించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిద్దరు సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రభుత్వం తరపున మాట్లాడాలని చైర్మన్ కోర గా జూపల్లి స్పందిస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో మంత్రి వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగు ్గలు కలిపే వ్యక్తికి రాజ్యసభను పంపించిన బీఆర్ఎస్కి మండలిలో మాట్లాడే అర్హత లేదన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సాంప్రదాయమని, సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పెద్దల సభకు గౌరవం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తులు మండలికి వస్తారని, పెద్ద మనుషులు ఉండే పెద్దల సభను అగౌరవం పర్చేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. -
ఎంపీ జయా బచ్చన్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయబచ్చన్ రాజ్యసభలో శుక్రవారం వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పారు. అమె ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఒక సందర్భంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయితే ఆ విషయాన్ని జయా బచ్చన్ రాజ్యసభ వీడ్కోలు సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ రోజు తాను ప్రవర్తించిన తీరుకు రాజ్య సభ చైర్మన్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాని తెలిపారు. ‘మీరు ఎందుకు ఆవేశపడతారని నన్ను చాలా మంది అడుగుతారు. అది నా తత్వం. నేను సహజమైన ప్రవర్తనను మార్చుకోను. నాకు కొన్ని విషయాలు నచ్చకపోతే లేదా అంగీకరించలేకపోతే వెంటనే కొంత శాంతాన్ని కోల్పోతాను. నా ప్రవర్తన, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నా మాటలను వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారికి నా క్షమాపణలు. నాది క్షణికమైన ఆవేశం తప్పితే.. నాకు ఎవరిని నొప్పించాలని ఉండదు’ అని అన్నారామె. Samajwadi Party MP Jaya Bachchan apologised to the fellow members of the Rajya Sabha during her farewell speech. Watch for more🎥#JayaBachchan #SamajwadiParty #RajyaSabha pic.twitter.com/7AeNPQjDwg — Moneycontrol (@moneycontrolcom) February 9, 2024 వీడియో క్రెడిట్స్: moneycontrol ఇక.. పెద్దల సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల సహకారం, ప్రేమను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేసుకున్నారు. పెద్దల సభలో సదరు సభ్యుల ద్వారా పంచుకున్న జ్ఞానాన్ని తాను ఇక నుంచి మిస్ అవుతానని అన్నారు. రిటైర్ అవుతున్న సభ్యుల వల్ల సభలో కొంత శూన్యత కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. మంగళవారంనాడు సభలో కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నను దాటేవేసే క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్.. జయా బచ్చన్ నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. దీంతో ధన్‌ఖడ్.. సభ్యులకు సమస్యను చెబితే వారు అర్థం చేసుకోగలరని వారేం చిన్న పిల్లలు కాదని అన్నారు. దీంతో జయా.. ఎంపీలను సభలో గౌరవంగా చూడాలని అన్నారు. సభలోని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడాని దాటివేసిన ప్రశ్నను మళ్లీ అడగాలని ధన్‌ఖడ్ అనుమతి ఇచ్చారు. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
Maldives: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే!
మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారతదేశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. భారత్-మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుకునే క్రమంలో అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు. అధ్యక్షుడు మొయిజ్జు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మొయిజ్జు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు సంబంధిత తీర్మాణంపై సంతకాల సేకరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం భారత్‌కు క్షమాపణ చెప్పాలని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడి ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పాలని ప్రచారం జరుగుతోంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అయితే నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకుగాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ భగవద్గీత శ్లోకం భావం వివాదంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘తాను రోజు భగవద్గీత శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు సుమారు 668 శ్లోకాలు పోస్ట్ చేశాను. అయితే ఇటీవల నా సోషల్ మీడియా టీం.. భగవద్గీతలోని చాప్టర్ 18లో ఉన్న 44వ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆ శ్లోకం అనువాద అర్థాన్ని తప్పుగా పోస్ట్ చేసింది. ఆ తప్పు నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌ను నేను వెంటనే డిలీట్ చేశాను. అస్సాం ఎప్పుడూ కులాలకు అతీతమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటంది. దానికి మహాపురుష్ శ్రీమంత శంకరదేవకు నా కృతజ్ఞతలు. నేను డిలీట్ చేసిన పోస్ట్ వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. వారికి ఇవే నా క్షమాపణలు’ అని సీఎం హిమంత బిశ్వశర్మ (ఎక్స్)ట్వీటర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. As a routine I upload one sloka of Bhagavad Gita every morning on my social media handles. Till date, I have posted 668 slokas. Recently one of my team members posted a sloka from Chapter 18 verse 44 with an incorrect translation. As soon as I noticed the mistake, I promptly… — Himanta Biswa Sarma (@himantabiswa) December 28, 2023 అయితే సీఎం హిమంత ట్వీటర్ టీం మొదటగా పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల విధి’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించాయి. -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
‘గో మూత్ర’ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. ‘నిన్న నేను చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఎవరి మనోభావాలనైనా నేను గాయపరిచి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతున్నా’అని సెంథిల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. అంతకముందు ఉదయం సామాజిక మధ్యమం ఎక్స్‌లోనూ పార్లమెంట్లో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ‘నేను నిన్న కొన్ని మాటలను అసంబంద్ధంగా వాడాను. ఇందుకు నేనువిచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమించాల్సిందిగా కోరుతున్నా’అని తెలిపారు. కాగా, సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై బుధవారం ఉదయం పార్లమెంట్లో కేంద్ర మంత్రులు సహా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.ఇలాంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కార్తిచిదంబరం, రాజీవ్‌శుక్లా కూడా సెంథిల్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంటులో మంగళవారం మాట్లాడుతూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందన్న వ్యాఖ్యలు చేసి వివాదం రాజేసిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..భార్య, పిల్లలను చంపి డాక్టర్ సూసైడ్..కారణమిదే! -
సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు
ఢిల్లీ: జనాభా నియంత్రణ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌లు విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "నితీష్ కుమార్ వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయి. ఇంతటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి" అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్లో పేర్కొంది. 'నితీష్ మాట్లాడిన చెత్త వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయి. అసెంబ్లీలో వాడిన ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి ఓ మరక. ప్రజాస్వామ్యంలో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.' అని రేఖా శర్మ అన్నారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్త్రీద్వేషి, పితృస్వామ్య స్వభావం అంటూ మండిపడింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ప్రజాస్వామ్యం గౌరవాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే దుయ్యబట్టారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఇదీ చదవండి: నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు -
రాజ్యసభ ఛైర్మన్‌కు క్షమాపణలు చెప్పండి: చద్దాకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దాకు స్పష్టం చేసింది. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ తీసుకన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఛద్దా సుప్రీంకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఛద్దా క్షమాపణలను రాజ్యసభ ఛైర్మన్ కూడా సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. సస్పెన్షన్ కేసులో ఛద్దా నేరుగా ఛైర్మన్‌ను కలిసి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ శుక్రవారం తీర్పునిస్తూ.... రాజ్యసభ చైర్మన్ అయిన జగ్దీప్ ధన్కర్.. చద్దా క్షమాపణలను సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ కేసులో ముందుకు వెళ్లే మార్గాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలని సూచించారు. అయితే ఆప్ ఎంపీ అయిన రాఘవ్ చద్దా తొలిసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆయన అత్యంత పిన్న వయస్కుడన్న విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలపై చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసాత్ స్పందిస్తూ.. రాజ్యసభ చైర్మన్‌ను క్షమాపణలు కోరడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చైర్మన్‌కు కలిసి క్షమాపణలు కోరేందుకు చద్దా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆప్ ఎంపీ క్షమాపణలు చెప్పడం సరైనదేనని కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించారు. అనంతరం ఈ కేసులో పురోగతిని నవంబర్ 20న తెలియజేయలన్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా కాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ పరిశీలించేందుకు ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే అయిదుగురు సభ్యుల పేర్లను చేర్చారన్న ఆరోపణలపై గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ తెలిపింది. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. దీనిపై రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
వర్రీ ఎందుకు సార్! ప్రస్తుతం మనం చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి!
వర్రీ ఎందుకు సార్! ప్రస్తుతం మనం చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి! -
కెనడా ప్రధాని క్షమాపణలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది. ఎందుకు వివాదం..? యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం -
ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్ తేల్చిచెప్పారు. -
మంత్రి తలసాని క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్‌బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. పక్కనున్న ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో కాలికి గాయం అయ్యిందని ఆ సందర్భంగానే వ్యక్తిని నెట్టివేశానని అన్నారు మంత్రి తలసాని. సోషల్ మీడియాలో కావాలనే ఈ ఘటనను పెద్దది చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. తను తోసేసిన వ్యక్తి రాజేష్ బాబు అని, గిరిజన బిడ్డ తర్వాతే తెలిసిందని, వెంటనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై గిరిజనుల మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని చెప్పారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని, తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’ -
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా క్షమాపణలు తెలియజేశారు. ప్రజల నుంచి క్షమాపణలు కోరుతూ వైష్ణవ్ ప్రార్థనకు చెందిన ఓ గీతాన్ని కూడా పాడారు. కాగా, గోలాఘాట్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు ‘లవ్ జిహాద్’ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడంపై బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడికి రుక్మిణితో ఉన్న బంధాన్ని ప్రస్తావించాడు. రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని భావించినప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. దీనిపై ఒకవేళ పోలీస్ కేసు నమోదైతే అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం ఖండించదగినదని చెప్పారు. సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. హజ్రత్ మహమ్మద్‌ను, జీసస్ క్రైస్ట్‌ను ఏ విధంగా అయితే వివాదాల్లోకి లాగబోమో, అదేవిధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని హితవు పలికారు. నేరపూరిత చర్యలను భగవంతుడితో పోల్చడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. చదవండి: ఉడిపి వాష్‌రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్ దీనిపై అసోం కాంగ్రెస్ చీఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. తమ తాత నిన్న రాత్రి తన కలలోకి వచ్చారని తెలిపారు. తను చేసిన స్టేట్మెంట్ తప్పని, ఇది రాష్ట్ర ప్రజలను బాధపెట్టిందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యల కారణంగా పార్టీకి నష్టం జరగకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైష్ణవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఇష్టం లేదన్నారు. వైష్ణవ్ భక్తులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధగా అనిపించిందని భూపేన్ చెప్పారు. అందుకే వైష్ణవ ఆలయంలో మట్టి దీపం, తమలపాకులు సమర్పించాలని నిర్ణయించుకున్నాన్నారు. స్వామిని క్షమించమని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేగానీ బీజేపీ, సీఎంకు భయపడి క్షమించమని కోరడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పలు కేసులు నమోదయ్యాయి. -
సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం.. అసలు విషయం తెలిసి అవాక్కయిన పోలీసులు!
వాషింగ్టన్: సాధారణంగా దొంగతనం చేసేటప్పుడు దొంగలు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల నుంచి సొమ్ము, బంగారం వంటివి దోచుకోగానే అక్కడి నుంచి జాడలేకుండా పారిపోతారు. ముఖంపై మాస్క్ ధరించి వాళ్లెవరో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంత వరకు మనకు తెలిసిన కథే.. అయితే ఓ దొంగ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రవర్తించాడు. సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. ఈ వింత ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు. దాంతో ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. చోరీ అనంతరం దొంగ ఏం చేయకుండా యువకుడిని సురక్షితంగా ముందు ఉన్న ప్రదేశంలోనే దింపాడు. అంతేకాకుండా ఆ దొంగ కొన్ని విషయాలు బయటపెట్టాడు. యువకుడి వద్ద డబ్బులు దోచుకున్నందుకు ‘సారీ బ్రదర్.. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే దొంగలిస్తున్నట్లు’ వివరించాడు. మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే తిరిగి ఇస్తానని ఆ యువకుడికి చెప్పాడు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను దొంగకు ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.ఈ విషయం తెలియగానే పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చదవండి: Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు -
టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు
వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది. ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,… — Press Trust of India (@PTI_News) July 9, 2023 దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. -
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు. సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్‌లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్‌ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్‌లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD — Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023 జరిగింది ఇదీ.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్‌స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్‌స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్‌స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్‌స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణ
క్రికెట్ ప్రపంచాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్షమాపణ కోరడం ఆసక్తి కలిగించింది. ఇంగ్లండ్ క్రికెట్లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతీ బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతూ సోమవారం రాత్రి ఈసీబీ లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్ కమీషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్(ICEC) నివేదికను ఈసీబీకి సమర్పించింది. ఈ రిపోర్టులో వివక్ష వల్ల ఎదుర్కొన్న దుష్ప్రవర్తనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మార్పులకు సంబంధించి 44 ప్రతిపాదనలను ఐసీఈసీ రిపోర్టులో పొందుపరిచింది. నివేదిక ప్రకారం.. '' ఇంగ్లండ్ క్రికెట్లో వివక్ష జరిగిన మాట నిజమే. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్, మీటూ తరహాలో ఇక్కడా నల్లవారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 85 శాతం భారత సంతతికి చెందిన బాధితులే ఉండడం గమనార్హం. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. నిర్మాణాత్మక, సంస్థాగత జాత్యహంకారం, లింగవివక్ష-వర్గ-ఆధారిత వివక్ష నుంచి విముక్తి పొందలేకపోయారు.'' అంటూ ఐసీఈసీ తన రిపోర్టులో పేర్కొంది. కాగా రిపోర్టును పరిశీలించిన ఈసీబీ తప్పుకు క్షమాపణ కోరుతూ తక్షణమే మార్పులు చేపడతామని తెలిపింది. ''క్రికెట్ అనేది అందరి గేమ్. ఇక్కడ వివక్షకు తావులేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా త్వరలోనే కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఐసీఈసీ పేర్కొన్న విధంగా జాతి వివక్ష పేరుతో మహిళలకు, నల్ల జాతీయులకు జరిగిన అవమానాలను పట్టించుకోలేదు. అందుకు క్షమాపణ కోరుతున్నాం. ఇలాంటివి ఉపేక్షించం. ఐసీఈసీ పేర్కొన్న 44 రికమెండేషన్స్‌ను పరిశీలించాం. వచ్చే మూడు నెలల్లో ICEC ప్రతిపాదించిన 44 సిఫార్సులకు ఒక బలమైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నిస్తాం.'' అంటూ ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు. Read our response to the Independent Commission for Equity in Cricket which finds evidence of discrimination across the game. We apologise unreservedly for the experiences of those who have faced discrimination in cricket. https://t.co/vOpqMLmuoK — England and Wales Cricket Board (@ECB_cricket) June 26, 2023 చదవండి: #RohitSharma: 'పోటీ తీవ్రంగా ఉంది.. అంత సులభం కాదు; కష్టపడతాం' -
'దేశానికి క్షమాపణలు చెప్పండి' ఆదిపురుష్ టీంపై మహిళా ఎంపీ ఫైర్..
ఢిల్లీ: శివ్ సేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ సినిమా టీంపై విరుచుకుపడ్డారు. హిందూ పురాణమైన రామాయణానికి తగ్గట్టుగా సినిమాలో డైలాగ్స్ లేవని ఆరోపించారు. చిత్ర బృందం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'డైలాగ్ రచయిత మనోజ్ముంతాషిర్, డైరెక్టర హోం రౌత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డైలాగ్‌లు గౌరవప్రదంగా లేవు. ముఖ్యంగా హనుమంతుని డైలాగ్‌లు సరిగా లేవు. వినోదం పేరుతో హిందు దేవుళ్లపై తీసిన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే భాషను వాడారు. మర్యాద పురుషోత్తమ రామునిపై సినిమా తీసి.. త్వరగా రిలీజ్ చేయాలని మర్యాదను మరిచారు' అని ప్రియాంక చతుర్వేది అన్నారు. మైథాలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ఆదిపురుష్ శుక్రవారం రిలీజ్ అయింది. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ షోలో ఓ సీటు హనుమంతుని కోసం ఉంటుందని దర్శకుడు హోం రౌత్ చెప్పారు. సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో దృశ్యాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ -
క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
ఢిల్లీ: సాంకేతిక సమస్యతో రష్యాకు విమానం దారి మళ్లింపు, అక్కడ మారుమూల ప్రాంతంలో అరకోర సౌకర్యాల నడుమ పడిగాపులు పడిన వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్‌గా ట్రావెల్ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యా మగడాన్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మారుమూల పట్టణం కావడంతో అరకోర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ & గ్రౌండ్ హ్యాండిలింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నామని, టికెట్ ఎమౌంట్‌ను రిఫండ్ చేయడంతో పాటు ట్రావెల్ వౌచర్లను స్వీకరించాలంటూ మనస్ఫూర్తిగా క్షమాపలంటూ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఇక ఈ పరిణామంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కవాడిగూడ (హైదరాబాద్): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గొల్లకురుమల వృత్తిని కించపరిచేలా, యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యాదవ, కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలయ్య, కో కన్వినర్ జి. శ్రీనివాస్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కురుమ, యాదవ సంఘాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాదవులు, కురుమలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గొల్ల వృత్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాలు డెడ్‌లైన్ ప్రకటించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. చలో గాందీభవన్‌తో ఉద్రిక్తత ధర్నా అనంతరం కురుమ, యాదవ సంఘాలు గాందీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ధర్నా చౌక్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. -
దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్ అధినేత
ఇటీవల ఎయిర్‌లైన్స్ సంస్థల పేర్లు ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో వినపడుతున్నాయి. సిబ్బంది లేదా ప్యాసింజర్ల ప్రవర్తన సరిగా లేకపోవడం కారణంగా పలు ఘటనలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తమ సిబ్బంది చేసిన పనికి ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ అధినేత దేశం దాటి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. జపాన్ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టార్లక్స్ JX803 విమానంలో ప్రయాణీకులు మొదట మే 6న మధ్యాహ్నం 3.45 గంటలకు ఎక్కవలసి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు, బోర్డింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోగా, JX801 విమాన ప్రయాణీకులు కూడా వేచి ఉన్న JX803 ప్రయాణికులతో చేర్చారు. కొన్ని కారణాల వల్ల రెండు విమానాలను విలీనం చేస్తున్నట్లు స్టార్లక్స్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. చివరికి రెండు విమానంలోని ప్రయాణికులను ఒకదానిలో చేర్చారు. అయితే అందులోని సిబ్బంది పనివేళలు ముగియడంతో రెండో విమానం కూడా ఆలస్యమైంది. చివరికి అర్ధరాత్రి అయ్యాక విమానం రద్దయిందని విమాన సిబ్బంది ప్రయాణికులకు తాపీగా చెప్పారు. దీంతో ప్రయాణీకులు ఆ రాత్రంతా విమానాశ్రయంలోనే గడపవలసి వచ్చింది. మరుసటిరోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్టార్లక్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ చాంగ్ కు వీ హుటాహుటిన తైవాన్ నుంచి జపాన్‌కు బయలుదేరారు. మే 7వ తేదీ ఉదయం నరిటా విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేయడంతో పాటు వారి టికెట్ నగదును పూర్తిగా రీఫండ్ ఇస్తామన్నారు. చదవండి: ‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్..! ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పొరపాటుగా పేరు చేర్చినందుకు ఆప్ నేత సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. టైపోగ్రాఫికల్/క్లరికల్ తప్పిదం వల్ల రాహుల్ సింగ్ పేరుకు బదులు సంజయ్ సింగ్ అని అచ్చయ్యిందని తెలిపింది. ఈ మేరకు ఆయనకు అధికారిక లేఖ పంపింది. లిక్కర్ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో ఆప్ నేత సంజయ్ సింగ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అసలు ఏ సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్లో చేర్చడంపై సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠ దెబ్బతీశారని ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. దీంతో తప్పు తమవైపు నుంచే జరిగిందని ఈడీ అంగీకరించింది. సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది. అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చరిత్రలో తొలిసారి ఈడీ క్షమాపణలు కోరతూ తనకు లేఖ రాసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ED के झूठ का पर्दाफ़ाश करेंगे। अग्रिम कार्यवाही के लिये भारत सरकार के वित्त सचिव को मेरा पत्र। pic.twitter.com/84f9NLk9Id — Sanjay Singh AAP (@SanjayAzadSln) May 3, 2023 ఢిల్లీ లిక్కర్ స్కాం ఫేక్ కేసు: కేజ్రీవాల్.. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఏ సంబంధం లేని సంజయ్ సింగ్‌ను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగాలని ఈడీ చూసిందని , కానీ లీగల్ నోటీసులు పంపడంతో క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్ అని తెలిపేందుకు ఇదే పెద్ద నిదర్శనమన్నారు. నిజాయితీ గల తమ పార్టీని, నాయకుల ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే ప్రధాని మోదీ ఈడీతో ఈ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఆదరణ పెరగడం చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. क्या किसी का नाम चार्जशीट में गलती से भी डाला जाता है? इस से साफ़ है कि पूरा केस फ़र्ज़ी है। केवल गंदी राजनीति के तहत देश की सबसे ईमानदार पार्टी को बदनाम करने और सबसे तेज़ी से बढ़ने वाली पार्टी को रोकने के लिए प्रधान मंत्री जी ऐसा कर रहे हैं। उन्हें ये शोभा नहीं देता। https://t.co/xu5kywg5Fz — Arvind Kejriwal (@ArvindKejriwal) May 3, 2023 కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు ప్రముఖులను సీబీఐ ఈ కేసులో విచారించిన విషయం తెలిసిందే. చదవండి: శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..! -
కాళికాదేవి ట్వీట్‌పై ఉక్రెయిన్ క్షమాపణలు
కీవ్: కాళికా దేవతను కించపరిచేలా చేసిన ట్వీట్‌పై ఉక్రెయిన్ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆ దేశపు విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎమిన్ జాపరోవా ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం. భారత దేశపు ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. అలాగే భారత్ నుంచి మద్దతును ఎప్పడూ ఆశిస్తాం అని పేర్కొందామె. హిందూ దేవత కాళిని అవమానించేలా ఉన్న చిత్రాన్ని ఇప్పటికే తొలగించామని, ఇరు దేశాల స్నేహం మునుపటిలా.. మరింత బలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. పేలుడు పొగలో కాళి దేవత చిత్రాన్ని అభ్యంతరంగా చిత్రీకరిస్తూ ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ట్వీట్ చేసింది. హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో ‘ఫ్లైయింగ్ స్కర్ట్ ఫోజు’లో కాళికా దేవి తలను మార్ఫింగ్ చేసి.. స్కర్ట్ ప్లేసులో బాంబు నుంచి వెలువడే పొగతో ఎడిట్ చేసి మరీ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో హిందూ సమాజం భగ్గుమంది. యుద్ధంలో సాయం చేస్తుంటే.. ఇలాగేనా వ్యవహరించేందంటూ తిట్టిపోశారు నెటిజన్లు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన గుప్తా సైతం ఈ ట్వీట్‌పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలపై జరుగుతున్న దాడి ఇదని పేర్కొన్నారామె. ఉక్రెయిన్ నుంచి క్షమాపణలు సైతం డిమాండ్ చేశారు. ఈ తరుణంలో తాజాగా ఉక్రెయిన్ క్షమాపణలు చెప్తూ.. ఆ ట్వీట్‌ను తొలగించింది. We regret @DefenceU depicting #Hindu goddess #Kali in distorted manner. #Ukraine &its people respect unique #Indian culture&highly appreciate🇮🇳support.The depiction has already been removed.🇺🇦is determined to further increase cooperation in spirit of mutual respect&💪friendship. — Emine Dzheppar (@EmineDzheppar) May 1, 2023 ఇదీ చదవండి: రండి బాబూ రండి.. తుపాకీ ఇవ్వండి, గిఫ్ట్ కార్డు తీసుకెళ్లండి -
బాలుడి పెదాలపై ముద్దు.. క్షమాపణలు చెప్పిన దలైలామా
ఉత్తర భారతదేశంలో జరిగిన ఒక కార్యక్రమంలో బౌద్ద మత గురువు దలైలామా ఒక బాలుడి పెదవులపై ముద్దుపెట్టుకుని, నాలుకను ముద్దు పెట్టమని కోరడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన అనుసరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై దలైలామా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ బాలుడు, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సోమవారం దలైలామా బృందం విడుదల చేసిన ప్రకటనలో.. దలైలామా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. బాలుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెప్పారు. దలైలామాను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో ఆయన సరదాగా ఉంటారు. కొన్ని సార్లు వారిని ఆటపట్టిస్తుంటారు. అయితే బాలుడి ఘటనకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కాగా ఓ కార్యక్రమంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై దలైలామా ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరారు. దీంతో ఈ ఘటన వివాదానికి తెరలేపింది. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారేంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. -
పార్లమెంటులో అదే సీను
న్యూఢిల్లీ: అదే గందరగోళం. అవే సీన్లు. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఎవరి పట్టు మీద వారు బెట్టుగా నిలిచారు. దాంతో పార్లమెంటులో వారం రోజులుగా కన్పిస్తున్న దృశ్యాలే రిపీటయ్యాయి. ఇరు పక్షాల డిమాండ్లు, హోరాహోరీ నినాదాలు, గందరగోళం మధ్య కార్యకలాపాలేవీ జరపకుండానే ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. అలా మార్చి 13న మొదలైన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఆరో రోజూ పూర్తిగా వృథా అయింది. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను అధికార బీజేపీ సభ్యులు మరోసారి లేవనెత్తారు. ఆయన క్షమాపణలకు డిమాండ్ చేశారు. ప్రతిగా అదానీ గ్రూప్ అవకతవకల అంశాన్ని కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు తెరపైకి తెచ్చారు. తాము డిమాండ్ చేస్తున్న మేరకు దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించి తీరాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. ఇరు పక్షాలూ పెద్దపెట్టున నినాదాలు మొదలుపెట్టాయి. ఉభయ పక్షాలూ తన చాంబర్‌కు వస్తే చర్చించుకుని పరిష్కారానికి వద్దామని స్పీకర్ ఓం బిర్లా పదేపదే సూచించినా లాభం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కొన్ని బిల్లులను ప్రవేశపెట్టగానే ఇరువైపుల నుంచి తిరిగి నినాదాలు, గందరగోళం మొదలయ్యాయి. దాంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ... అటు రాజ్యసభలోనూ దాదాపుగా ఇదే దృశ్యాలు కన్పించాయి. సభ ప్రారంభమవుతూనే ఇరు పక్షాలూ నినాదాలకు దిగాయి. వాటి మధ్యే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించాలంటూ 267(9) నిబంధన కింద కాంగ్రెస్ సభ్యులు నోటీసు అందజేసినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను పక్కన పెట్టి నోటీసు అంశాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణకు సీపీఐ, సీపీఎం సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాల హోరు, గందరగోళం అంతకంతకూ పెరిగిపోవడంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా, అనంతరమూ అదే పరిస్థితి కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. నా వ్యాఖ్యలపై లోక్‌సభలో మాట్లాడతా స్పీకర్‌కు రాహుల్ లేఖ ‘‘భారత ప్రజాస్వామ్యం గురించి బ్రిటన్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో స్పష్టత ఇస్తా. నేను మాట్లాడేందుకు అనుమతించండి’’ అంటూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. దీనిపై ఆయన ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించలేదు. మంగళవారం మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశమివ్వాలని కోరినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘‘మేమేం మాట్లాడబోయినా మైకులు కట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని లండన్‌లో చెప్పినందుకు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాచారు’’ అని మండిపడ్డారు. రాహుల్ నివాసానికి పోలీసులు వెళ్లడాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్లో తాము లేవనెత్తుతన్న అదానీ, చైనా చొరబాటు వంటి కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తోందన్నారు. కేసులకు బెదరను వయనాడ్ (కేరళ): పోలీసు కేసులు, రాజకీయ దాడులతో తనను భయపెట్టలేరని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘సత్యంపై నాకు విశ్వాసముంది. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉన్నా. నాపై ఎంతగా దాడి చేసినా పట్టించుకోను. దాంతో, నేనెందుకు భయపడటం లేదా అన్నదే వారికిప్పుడు పెద్ద సమస్యగా మారింది’’ అని బీజేపీపై చెణుకులు విసిరారు. -
ఇలానే కొనసాగిద్దాం సార్! లేకపోతే గ్యాస్ ధరలని, పెట్రోల్ ధరలనీ, అదానీ అని మళ్లీ
ఇలానే కొనసాగిద్దాం సార్! లేకపోతే గ్యాస్ ధరలని, పెట్రోల్ ధరలనీ, అదానీ అని మళ్లీ మొదలు పెడతారు!! -
దాడి ప్రజాస్వామ్యం మీదయితే ఇంతగా మనం ఎందుకు స్పందించాలో అర్థం కావడంలేదు!
దాడి ప్రజాస్వామ్యం మీదయితే ఇంతగా మనం ఎందుకు స్పందించాలో అర్థం కావడంలేదు! -
క్షమాపణ చెప్పేదే లే! కాంగ్రెస్ బీజేపీల మధ్య కొనసాగుతున్న పోరు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశం సైతం రసాభాసగ మారి ఉభయ సభల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే వాయిదాపడ్డాయి. అదే రగడ రెండో రోజు కూడా కొనసాగింది. లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ దాడిని పెంచుతూ..కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఒక సభ్యుడు విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే పార్లమెంట్ చూస్తూ కూర్చొదన్నారు. గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే, అన్ని పార్టీల ఎంపీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాల్సిందే అని డిమాండ్ చేసింది బీజేపీ. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. పైగా ప్రజాస్వామ్యన్ని అణిచివేసేవారే రక్షించడం కోసం మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఇరు పార్టీ మధ్య వాగ్వాదం సద్దుమణగకపోగా తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. రెండో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమైన వెంటనే వాయిదాపడ్డాయి. ఈమేరకు మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు గురించి ప్రస్తావించారు. వారంతా మైనారిటీల దాడులు గురించి చెబుతున్నారు గానీ నాడు వేలాదిమంది సిక్కులు హత్యకు గురైనప్పుడు ఆ ఘటనలకు బాధ్యులైన వారిని సోనియా, రాజీవ్‌గాందీలు రక్షించారంటూ ఆరోపణలు గుప్పించారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన శక్తిసిన్హ గోహిల్ పీయూష్ గోయల్‌పై ప్రివలేజ్ ఉల్లంఘన నోటీసులు దాఖలు చేశారు. ఆ నోటీసుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా గోయల్ లోక్‌సభ సభ్యుడిని ఉద్దేశపూర్వకంగానే విమర్శించారని పేర్కొన్నారు గోహిల్. అలాగే ఏ సభ్యుడు మరో సభలోని సభ్యునిపై ఆరోపణలు చేయరాదనే చైర్ నిబంధనను గుర్తు చేశారు. అంతేగాదు తాము ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ గడ్డపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఎప్పుడూ లేవనెత్తలేదని కూడా అన్నారు. అయినా రాహుల్ క్షమాపణ చేప్పే ప్రశ్నే లేదని లోక్‌సభలోని కాంగ్రెస్ ఉపనేత మాణికం ఠాగూర్ అన్నారు. అసలు ఆ ప్రశ్నకు తావేలేదు ఎందుకంటే రాహుల్ కరెక్ట్‌గానే చెప్పారు. అయినా ఆర్ఎస్ఎస్కు చెందినవారు క్షమాపణ చెప్పనప్పుడూ కాంగ్రెస్‌కు చెందినవారు మాత్రం ఎందుకు చెప్పాలి అని నిలదీశారు. ఈ మేరకు ఠాగూర్ విదేశాల్లో ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలను సైతం ట్విట్టర్లో ఉంచారు. మోదీ విదేశాల్లో భారత్‌ని అవమానించారు కాబట్టి ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లేదంటే సావర్కర్ లాగా చేయగలరు అని మాణిగం ఠాగూర్ అన్నారు. (చదవండి: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ) -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం... దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల యూకేలో చేసిన వ్యాఖ్యల పట్ల సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయగా, గౌతమ్ అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇరు పక్షాల నడుమ వాగ్వాదాలతో ఉభయ సభలు స్తంభించాయి. నినాదాలు, అరుపులు కేకలతో హోరెత్తిపోయాయి. ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌కు కొంతైనా సిగ్గుంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్‌సభలో సంతాపం ప్రకటించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని, లండన్‌లో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. విదేశీ శక్తులే భారత్‌ను కాపాడాలంటూ రాహుల్ మాట్లాడడం ఏమిటని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలను లోక్‌సభ మొత్తం ఖండించాలని, ఈ దిశగా చొరవ తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ను సభకు రప్పించి, క్షమాపణ చెప్పించాలని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి కొంతైనా సిగ్గుంటే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, రోజురోజుకూ బలోపేతం అవుతోందని వెల్లడించారు. సభ సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సూచించారు. నినాదాలు ఆపాలని కోరారు. మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు గొప్ప విశ్వాసం ఉందన్నారు. సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో అదే రగడ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య రగడ జరిగింది. ఎవరూ శాంతించకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్యసభ ఖండించాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఖర్గే కోరారు. రాహుల్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మా ట్లాడారు. తుక్డే–తుక్డే గ్యాంగ్ తరహాలో మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ కించపర్చారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆక్షేపించారు. పార్లమెంట్‌కు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. -
ఆ ఐదుగురినీ విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్ నసీర్ సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్ అందజేశారు. నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్‌రాయ్ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. హైదరాబాద్ భేష్: యూఏఈ రాయబారి ప్రశంసలు కేటీఆర్‌తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, వరంగల్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. మీడియా సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పారు. సర్పంచ్ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజయ్య.. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. వేధిస్తే భరితం పడతాం: సర్పంచ్ నవ్య సర్పంచ్ నవ్య మాట్లాడుతూ, మహిళలకు అన్యాయం జరుగుతోందని, తాను మాట్లాడిన ప్రతి మాట నిజం అంటూ మండిపడ్డారు. అన్యాయాలు, అరాచకాలు సహించవద్దని ఆమె అన్నారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని సర్పంచ్ హెచ్చరించారు. ‘‘ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తా. ఆయన వల్లే నేను సర్పంచ్ అయ్యా. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా. పార్టీని ఒక కుటుంబంలా భావిసా. జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తా’’ అని సర్పంచ్ నవ్య అన్నారు. క్షమించమని కోరుతున్నా.. ఎమ్మెల్యే రాజయ్య జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ‘‘నాకు నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ప్రవీణ్‌పై అభిమానంతో ఆయన భార్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చా.. నేను తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించమని కోరుతున్నా. జానకిపురం అభివృద్ధికి పాటుపడుతా. అధిష్టానం ఆదేశం మేరకు రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నా’’ అని రాజయ్య పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అసలేం జరిగింది.. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం! ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. -
క్షమాపణలతో ముగిసిన ఎలాన్ మస్క్ ట్విటర్ చాట్.. ఏమైందంటే?
ట్విట్టర్ బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీసుకునే నిర్ణయాలతో, ప్రకటనలతో ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత తనదైన నిర్ణయాలతో ఉద్యోగులతో పాటు యూజర్లకు కూడా గట్టి షాకులు ఇస్తున్నాడు. ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి అంశంపై మాట్లాడేందుకు ముందుకు వస్తుంటారు. ఇటీవల ఉద్యోగితో చేసిన చాట్ ప్రస్తుతం చర్చినీయాంశమైంది. గత కొన్ని రోజులకు ముందు ట్విటర్ నుంచి హరాల్దుర్ థోర్లిప్సన్ అనే వ్యక్తి జాబ్ కోల్పోయాడు. తాను జాబ్ కోల్పోవడానికి కారణం తెలియదని వాపోయాడు. తన వర్క్ కంప్యూటర్ యాక్సెస్ తొలగించారని, తొమ్మిది రోజులైనా ఉద్యోగం ఉందా? పోయిందా? అనే విషయంపై క్లారిటీ లేదని మస్క్‌ని ప్రశ్నించారు. ఈ విధంగా చాటింగ్ మొదలైంది. హరాల్దుర్ థోర్లిప్సన్ కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు, ఈ కారణంగా సొంత పనులు చేసుకోవడానికి కూడా మరొకరి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో ఉద్యోగం నుంచి తొలగించారని తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తూ కంపెనీకి థోర్లీప్సన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కటువుగా మాట్లాడారు. ఎలాన్ మస్క్ రిప్లైకి హరాల్దుర్ స్పందిస్తూ.. శారీరక లోపం వల్ల నేను కదల్లేకపోతున్నాను, కానీ మస్క్ దృఢంగా ఉన్నప్పటికీ సెక్యూరిటీ సాయం లేకుండా వాష్రూంకి సైతం వెళ్లడని వ్యాఖ్యానించాడు. థోర్లీప్సన్ పరిస్థితి తెలియకుండా మాట్లాడానని, తాను చేసిన వ్యాఖ్యలకు మస్క్ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. Based on your comment, I just did a videocall with Halli to figure out what’s real vs what I was told. It’s a long story. Better to talk to people than communicate via tweet. — Elon Musk (@elonmusk) March 7, 2023 -
జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
-
గవర్నర్ తమిళిసైకి కౌశిక్‌రెడ్డి క్షమాపణ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి క్షమాపణలు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలకుగానూ నోటీసులు అందుకున్న ఆయన ఇవాళ(మంగళవారం) జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి గవర్నర్ తమిళిసైకి ఎన్డబ్ల్యూసీ సమక్షంలోనే లిఖిత పూర్వక క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఫైల్స్‌ను తన దగ్గరే పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదంటూ తీవ్ర పదజాలంతో పలు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి. అయితే.. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్, ఆయనకు నోటీసులు జారీ చేసింది. -
'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుందంటారు. అలాంటి ఐసీసీ గురువారం క్రికెట్ అభిమానులను క్షమాపణ కోరింది. కారణం ఏంటనేది ఈ పాటికే మీకందరికి అర్థమయ్యే ఉంటుంది. పెద్దన్న(ఐసీసీ) బుధవారం ర్యాంకింగ్స్‌లో చిన్న తప్పిదం చేసింది. బుధవారం మధ్యాహ్నం టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిదంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. భారత్ ఖాతాలో 115 పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 111 పాయింట్లతో ఉందని పేర్కొంది. దీంతో టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా అవతరించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే దాదాపు ఏడు గంటల తర్వాత ఐసీసీ తప్పిదాన్ని గుర్తించింది. భారత్ ఇంకా టాప్ ర్యాంక్‌కు చేరుకోలేదని... రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో, భారత్ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. తాజాగా గురువారం తమ తప్పిదానికి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఐసీసీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి తొలి టెస్టుకు ముందు టీమిండియా 111 పాయింట్లతో రెండో స్థానంలో.. 126 పాయింట్లతో ఆసీస్ తొలిస్థానంలో ఉన్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్ టేబుల్‌ను అప్డేట్ చేసింది. మ్యాచ్ గెలిచిన భారత్‌కు నాలుగు పాయింట్లు రాగా.. ఆసీస్‌కు ఎలాంటి పాయింట్లు రాలేదు. అయితే ఐసీసీ పొరపాటున టీమిండియా 115 పాయింట్లను టాప్‌గా పరిగణించి.. ఆస్ట్రేలియాకు 111 పాయింట్లు అంటూ చూపించింది. దీంతో టీమిండియా నెంబర్‌వన్ అని ప్రకటించింది. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ విషయంలో పొరపాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు ఇదే ఏడాది జనవరి 17న టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ సాధించిందంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. సాంకేతిక లోపం కారణంగా 126 పాయింట్లతో నెంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు 15 పాయింట్లు కోత పడడంతో వారి రేటింగ్ 111కు పడిపోయింది. దీంతో 115 పాయింట్లతో టీమిండియా నెంబర్‌వన్ అయినట్లు తెలిపింది. అయితే రెండు గంటల వ్యవధిలోనే తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ లెక్క సరిచేసింది. అయితే ఈ ఏడాదిలో నెల వ్యవధిలో ఐసీసీ రెండుసార్లు పొరపాటు చేయడంపై క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తావు.. ఇలా అయితే ఎలా''.. ''తప్పు చేస్తే దండిచాల్సిన నువ్వే పొరపాటు చేస్తే ఎలా పెద్దన్న''.. అంటూ కామెంట్స్ చేశారు. ఇక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాలు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆడనున్నాయి. టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో రెండు గెలిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. India 🇮🇳 spot on the 🔝 in #icc new Test Ranking 1. India 🇮🇳 India 🇮🇳 now T20- no.1 , ODI no.4,Test no.1#bcci #TeamIndia #ranking #believeinblue pic.twitter.com/8XXLnvygqE — Sartaj 🇮🇳 (@i_amSartaj) January 17, 2023 చదవండి: భారత్ నంబర్‌వన్... కాదు కాదు నంబర్ 2 'ఆరడుగుల బౌలర్ కరువయ్యాడు'.. ద్రవిడ్ అదిరిపోయే కౌంటర్ -
ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే..
ఇండిగో ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. గురువారం (ఫిబ్రవరి 9) హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6ఈ 409 విమానం 37 మంది ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బ్యాగులను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. విశాఖపట్నం చేరుకున్న అనంతరం తమ బ్యాగుల కోసం వెతికిన ప్రయాణికులు.. వాటిని విమాన సిబ్బంది అక్కడే వదిలేసి వచ్చారని తెలుసుకుని ఎయిర్ లైన్స్ యాజమాన్యంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం స్పందిస్తూ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. జరిగిన పొరబాటు మానవ తప్పిదమని, 37 మంది ప్రయాణికుల బ్యాగులను వారి విశాఖపట్నంలోని వారి చిరునామాలకు వీలైనంత త్వరగా, సురక్షితంగా చేరుస్తామని హామీ ఇచ్చింది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలియజేసింది. కాగా లగేజీని విమాన సిబ్బంది హైదరాబాద్‌లోనే వదిలేసి వచ్చారని తెలుసుకున్న ప్రయాణికులు తమ బ్యాగుల కోసం గంటతరబడి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనే ఎదురుచూశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సేపటికి లగేజీని సురక్షితంగా ప్రయాణికుల ఇళ్లకు చేరుస్తామని విమాన సంస్థ హామీ ఇవ్వడంతో శాంతించారు. (ఇదీ చదవండి: మారిషస్‌కు విస్తారా సర్వీస్) -
బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలతో విరుచుకుపడింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. 'రిషి సునాక్‌కు సీటు బెల్టు పెట్టుకోవడం రాదు. డెబిట్ కార్డు ఉపయోగించడం రాదు. రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు' అని లేబర్ పార్టీ ఎద్దేవా చేసింది. చదవండి: బాప్రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్ మస్క్, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే -
నా భార్యకు రాజకుటుంబం క్షమాపణ చెప్పాలి
లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్‌ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు. రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. -
టీడీపీ కుట్ర బట్టబయలు.. మంత్రికి క్షమాపణ చెప్పిన మహిళ
సాక్షి, అనంతపురం: మంత్రి ఉషాశ్రీచరణ్‌పై టీడీపీ కుట్ర రాజకీయాలు బట్టబయలయ్యాయి. మంత్రి ఉషాశ్రీచరణ్‌పై మహిళతో టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయించారు. మహిళ వ్యాఖ్యలను విస్తృతంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేశాయి. ఆ మహిళ.. మంత్రి ఉషశ్రీచరణ్‌ను కలిసి క్షమాపణ కోరింది. టీడీపీ ఒత్తిడి వల్లే ఆరోపణలు చేశానని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, టీడీపీ నేతల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. అభివృద్ధి ఓర్వలేకే టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ.. -
25 ఏళ్ల క్రితం గొడవ.. ద్రవిడ్‌కు అలెన్ డొనాల్డ్ క్షమాపణ
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలెన్ డొనాల్డ్ .. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా బంగ్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్ ముగించుకొని టెస్టు సిరీస్ ఆడుతుంది. కాగా బంగ్లాదేశ్‌కు అలెన్ డొనాల్డ్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అలెన్ డొనాల్డ్ ద్రవిడ్‌ను క్షమాపణ కోరాడు. అదేంటి ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అనే సందేహం రావొచ్చు. అవును ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు కాదు.. 25 సంవత్సరాల క్రితం. మీరు విన్నది నిజమే. 25 సంవత్సరాల క్రితం జరిగిన గొడవకు అలెన్ డొనాల్డ్ ఇప్పుడు ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు కాబట్టే ఆసక్తి సంతరించుకుంది. ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పడమే కాదు డిన్నర్ కూడా ఆహ్వానించాడు అలెన్ డొనాల్డ్. "డర్బన్‌లో జరిగిన ఆ ఘటన గురించి నేను మాట్లాడను. ద్రవిడ్, సచిన్ మా బౌలర్లను బాదేస్తున్నారు. ఆ సమయంలో నేను కాస్త లైన్ దాటాను. ద్రవిడ్‌పై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆ రోజు జరిగిన దానికి నేను మరోసారి ద్రవిడ్‌కు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఏదో అన్నాను. నిజానికి దాని వల్లే అతని వికెట్ కూడా పడింది. కానీ ఆరోజు నేను అన్నదానికి క్షమాపణ కోరుతున్నాను. ద్రవిడ్ ఓ అద్భతమైన వ్యక్తి. రాహుల్ నేను చెప్పేది నువ్వు వింటూ ఉంటే.. నాతో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను" అని డొనాల్డ్ అన్నాడు. ఈ వీడియోను ఓ ఇంటర్వ్యూలో భాగంగా ద్రవిడ్ చూశాడు. డొనాల్డ్ సారీ చెప్పడంపై ముసిముసిగా నవ్వాడు. అంతేకాదు అతని ఆహ్వానాన్ని కూడా మన్నించాడు. "కచ్చితంగా వెళ్తాను. దాని కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా బిల్లు అతడు కడతానంటే ఎందుకు వద్దంటాను" అని ద్రవిడ్ నవ్వుతూ చెప్పాడు. మరి 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పడు తెలుసుకుందాం. 1997లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌పై డొనాల్డ్ నోరు పారేసుకున్నాడు. తాను ఆడే రోజుల్లో తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించడంతోపాటు నోటికి పని చెబుతూ కూడా డొనాల్డ్ భయపెట్టేవాడు.ఎంతో సౌమ్యుడిగా పేరున్న ద్రవిడ్‌ను కూడా డొనాల్డ్ వదల్లేదు. ఆ మ్యాచ్‌లో సచిన్, ద్రవిడ్ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తుండటంతో ఏం చేయాలో తెలియక తాను నోరు పారేసుకున్నానని డొనాల్డ్ ఇప్పుడు చెప్పాడు. అంతేకాదు ద్రవిడ్‌కు సారీ కూడా చెప్పడం విశేషం. అప్పట్లో ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 278 రన్స్ చేసింది. కిర్‌స్టన్, కలినన్ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే తర్వాత వర్షం కురవడంతో ఇండియా టార్గెట్‌ను 40 ఓవర్లలో 252 రన్స్‌గా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్ 94 బాల్స్‌లో 84 రన్స్ చేసినా.. ఇండియా లక్ష్యానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. చదవండి: పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాల్సింది కాదు!
కోల్‌కతా: సినిమా డైలాగులు పేల్చడం రాజకీయ నాయకులకు ఈమధ్య బాగా అలవాటైంది. అయితే పంచ్ కోసం పేలుస్తున్న ఆ డైలాగులు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. తృణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలోంచి కొట్టిన డైలాగ్.. బీజేపీకి బాగా కోపం తెప్పించింది. మొత్తం బెంగాల్ ప్రభుత్వం తీరే పుష్ప సినిమాలాగా ఉంది. ఎర్ర చందనపు స్మగర్ల సినిమాలో ఏవో డైలాగులు కొడితే.. ఇక్కడి టీఎంసీ నేత కూడా అలాగే డైలాగులు కొడుతున్నాడు. ఒకరేమో యువత హక్కులను దోచుకుంటున్నారు. మరొకరేమో స్కామ్‌లు చేసి వాళ్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టీఎంసీ నేతల తీరు.. ఆ సినిమాలోని ఎర్ర చందనపు స్మగ్లర్లలాగే ఉంది. వాళ్లతో పాటు ఆ పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతోంది అంటూ బీజేపీ నేత ఉమేశ్ రాయ్ మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఎదిగిన మనోజ్ తివారీ.. ఆదివారం ఓ ర్యాలీలో పార్టీ కార్యకర్తలంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ సాలా' (తెలుగులో నీయవ్వ.. తగ్గేదే లే) అంటూ బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ భగ్గుమంది. అయితే.. ర్యాలీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మీడియా ప్రతినిధులు ఆయన తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ఆ డైలాగ్ కొట్టాల్సింది కాదు అని తివారీ క్షమాపణలు చెప్పారు. -
Telangana: మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు తెలియజేశారు. మెడికల్ విద్యార్థులకు ఓరియెంటేషన్ డే సందర్భంగా తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయన ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు. తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ కోడలు కిట్టీ పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేదని, అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు తన మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యిందని, మీరు(విద్యార్థులను ఉద్దేశించి..) కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి కాలేజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో.. ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రసంగంలో ఏదో ఫ్లోలో అలా మాట్లాడానని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు ఆయన వీడియోలో వెల్లడించారు. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారంటూ విద్యార్థులకు హితబోధ చేసే సమయంలో చామకూర మల్లారెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. -
మెడికల్ విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
-
మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు.. రామ్‌దేవ్ బాబా క్షమాపణలు
మహిళలు దుస్తులు ధరించకపోయినా అందంగా ఉంటారని యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా పంపింది. దీంతో రామ్‌దేవ్ బాబా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో మాట్లాడుతూ నోరు జారారు రామ్‌దేవ్ బాబా. మహిళలు చీరకట్టులోనైనా, సల్వార్ సూట్లోనైనా అందంగా కన్పిస్తారని, తన దృష్టిలో వాళ్లు దుస్తులు లేకపోయినా బాగుంటారని అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. దీనిపై మహిళా నేతలు సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. వివాదం మరింత ముదురుతుందని భావించి రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. రామ్‌దేవ్ బాబా మహిళల దుస్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన పక్కనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత, సీఎం ఎక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగానూ వివాదాస్పదమైంది. రామ్‌దేవ్ అసలు మనస్తత్వం ఏంటో భయటపడిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ మండిపడింది. దుస్తుల ప్రస్తావన ఎందుకు? యోగా క్యాంప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు సల్వార్ సూట్లు ధరించారు. యోగా అనంతరం వెంటనే సమావేశం నిర్వహించడంతో వారు చీర కట్టుకునేందుకు సమయం కూడా లేకపోయింది. దీంతో వారంతా సల్వార్ సూట్‌లోనే మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై మాట్లాడుతూ రామ్‌దేవ్ నోరుజారారు. "Women look good even without clothes."#Ramdev's sexist comment sitting besides #AmruthaFadanavis. pic.twitter.com/FwPMH8yY1w — Sanghamitra Bandyopadhyay (@AITCSanghamitra) November 26, 2022 చదవండి: భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి.. -
రామ్‌దేవ్ అసభ్యకరమైన కామెంట్లు.. సారీ చెప్పాల్సిందే!
ఢిల్లీ: యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ బ్రాండ్ అంబాసిడర్ బాబా రామ్‌దేవ్ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో పలు చోట్ల రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు పలువురు. ఈ తరుణంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ రాందేవ్‌పై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య(అమృతా ఫడ్నవిస్ పక్కనే ఉన్నారు ఆ టైంలో) ఎదుట స్వామి రామ్‌దేవ్.. మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండించదగినవి కూడా. ఈ ప్రకటన పట్ల మహిళా సమాజం బాధించబడింది. కాబట్టి, దేశానికి రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి అని స్వాతి మలివాల్ ఓ ట్వీట్ చేశారు. మరోవైపు దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిరసనలు చేసింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర నేతలు. మరోవైపు సీపీఐ నారాయణ, రామ్‌దేవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన టైంలో అక్కడే ఉన్న మహిళలు అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. యోగా పేరుతో నటిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని రామ్‌దేవ్‌పై మండిపడ్డారు. అలా మొదలైంది.. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ ప్రసంగిస్తూ.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్, సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం మొదలైంది. శివసేన థాక్రే వర్గ నేత సంజయ్ రౌత్, బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏం సమాధానం చెప్తారంటూ అమృతా ఫడ్నవిస్‌ను సైతం ప్రశ్నించారాయన. महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7 — Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022 సంబంధిత వార్త: మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు.. -
రాష్ట్రపతి ముర్మును క్షమాపణలు కోరిన సీఎం మమతా.. ఎందుకంటే?
కోల్‌కతా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రపతిపై తమ పార్టీ మంత్రి అఖిల్‌గిరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని, అలాంటి వాటిని తాము సహించమని చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అతన్ని హెచ్చరించినట్లు తెలిపారు. రాష్ట్రపతిని మేము ఎంతగానో గౌరవిస్తాం. అమె మంచి మహిళ. అఖిల్ గిరి తప్పు వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. మా ఎమ్మెల్యే తరపున నేను క్షమాపణలు కోరుతున్నా. ఐయామ్ సారీ. అందం అనేది బయటకు ఎలా కనిపిస్తారనేది కాదు. లోపల నుంచి ఎలా ఉన్నాం. ఎలా ఆలోచిస్తారనేది ముఖ్యం’ అని సీఎం మమతా పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ కాగా రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, బెంగాల్ జైళ్ల శాఖ మంత్రి అఖిల్‌గిరి శుక్రవారం నందిగ్రామ్‌లో జరిగిన ఓ ర్యాలిలో మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి నోరుజారారు. ‘బీజేపీ నాయకులు నన్ను చూడటానికి అందంగా లేవని అంటున్నారు. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మేము ఎవరినీ అంచనా వేయం. మేము రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాము. కానీ మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు? ’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అఖిల్‌గిరి వ్యాఖ్యాలపై పశ్చిమబెంగాల్లో తీవ్ర దుమారం రేగింది. CM Mamata Banerjee has always been Anti Tribal. His minister Akhil Giri took it further and insulted the president on her look. Why she and her govt hate tribals so much ? pic.twitter.com/zhArXBcooa — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) November 11, 2022 The @AITCofficial Min. Sh. Akhil Giri, unconditionally APOLOGISES for his insensitive comment on the @rashtrapatibhvn Smt. Droupadi Murmu, & expresses his deepest RESPECT for the Chair of the President. pic.twitter.com/BFUsr0P2x2 — 𝐑𝐢𝐣𝐮 𝐃𝐮𝐭𝐭𝐚 (@DrRijuDutta_TMC) November 12, 2022 17 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చివరికి మంత్రి తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు. మంత్రి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. ‘గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల మాకు చాలా గౌరవం ఉంది. ఎమ్మెల్యే అఖిల్ గిరి చేసిన దురదృష్టకర వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాంటి ప్రకటనలను మేము సమర్థించబోము.. మహిళా సాధికారత యుగంలో స్త్రీల పట్ల ద్వేషం ఆమోదయోగ్యం కాదు' అని పేర్కొంది. చదవండి: 'కాంగ్రెస్‌కి వేసి ఓట్లను వృధా చేయకండి': అరవింద్ కేజ్రీవాల్ -
Twitter: ఎలన్ మస్క్ క్షమాపణలు
శాన్ ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా): ట్విటర్(ట్విట్టర్) కొత్త బాస్, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్.. క్షమాపణలు చెప్పాడు. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ పని తీరు నిదానించింది. ఈ సూపర్ స్లో పరిణామంపై ఆదివారం స్పందించిన మస్క్.. క్షమాపణలు తెలియజేశాడు. అంతకుముందు.. ‘ట్విట్టర్ మరింత సజీవంగా అనిపిస్తుంది’ అంటూ ఎలన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఇక ‘ఎనిదిమి డాలర్ల’ ట్విట్టర్ బ్లూ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపైనా ఆయన ఓ యూజర్‌కి రిప్లై ఇచ్చారు. అలాగే.. యూజర్లకు అందుబాటులోకి రాబోయే మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించారాయన. సంస్థలకు సంబంధించి ఏ ఇతర ట్విటర్ ఖాతాలు వాటితో అనుబంధించబడి ఉన్నాయో గుర్తించడానికి వీలుగా సదరు సంస్థలకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు ట్విటర్ తరపున ప్రకటించారాయన. Btw, I’d like to apologize for Twitter being super slow in many countries. App is doing >1000 poorly batched RPCs just to render a home timeline! — Elon Musk (@elonmusk) November 13, 2022 Twitter feels increasingly alive — Elon Musk (@elonmusk) November 13, 2022 Rolling out soon, Twitter will enable organizations to identify which other Twitter accounts are actually associated with them — Elon Musk (@elonmusk) November 13, 2022 ఇక నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో ‘బ్లూటిక్’ సబ్స్క్రిప్షన్ సదుపాయాన్ని నిలిపివేసింది కదా. దానిని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే ప్రశ్నకు ట్విటర్ సీఈవో మస్క్ స్పందించారు. వచ్చేవారాంతంలోగా తిరిగి ట్విటర్ బ్లూ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారాయన. ఇదీ చదవండి: 8 డాలర్ల స్కీమ్.. మస్క్ అనాలోచిత నిర్ణయం! -
ట్రంప్ చేసిన పనికి బైడెన్ క్షమాపణ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ క్షమాపణలు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశంపై మాట్లాడుతూ ఈ మేరకు ప్రపంచ దేశాలను క్షమాపణలు కోరారు బైడెన్. పారిస్ ఒప్పందంలో వెంటనే చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన పర్యావరణ సదస్సులను నిర్వహించామని తెలిపారు. భూతాపాన్ని తగ్గించే పోరాటంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు బైడెన్. ఐక్యరాజ్య సమితి కాప్27 సదస్సులో ప్రసంగించారు. ‘స్నేహితులారా.. ఈ ఒక్క సమస్యపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. పురోగతిలో అడ్డంకులను అధిగమించడానికి అమెరికా చేయవలసిన పరివర్తనాత్మక మార్పులు చేయాలని నిర్ణయించుకునే నేను అధ్యక్ష పదవికిలోకి వచ్చాను. అమెరికా ఒక విశ్వసనీయమైన, గ్లోబల్ లీడర్‌గా వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దానిని సాధించటానికి మా సాయశక్తులా కృషి చేస్తాం.’ అని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రపంచ దేశాలు సైతం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు బైడెన్. వారిపై ఒత్తిడి తేవటం గ్లోబల్ లీడర్‌గా తమ బాధ్యత అని వెల్లడించారు. పర్యావరణ సంక్షోభంతో అది మానవ, ఆర్థిక, వాతవారణ, జాతీయ భద్రతకు ముప్పు తెస్తోందని సూచించారు. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవికి ముప్పు వాటిల్లుతోందన్నారు. ఇదీ చదవండి: పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత -
క్షమించండి అంటూ నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ
భోపాల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లో నాసిరకంగా నిర్మించిన రహదారి విషయమై ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగితే క్షమాపణలు కోరడానికి వెనుకడుగు వేయనని అన్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లో జబల్పూర్లోని ఒక అవార్డుల పంక్షన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జబల్పూర్ హైవేకి 63 కి.మీ బరేలా నుంచి మండలానికి సుమారు రూ. 400 కోట్లతో నిర్మించిన రహదారి నాసిరకంగా ఉందంటూ బాధపడ్డారు. దీని గురించి అధికారులతో మాట్లాడాను. ప్రాజెక్టు నిలిపివేయడమో లేక మరమ్తతులు చేయడమో చేస్తాను లేదా కొత్త టెండర్ వేయించి మంచి రహదారి అందించేలా చూస్తానని అన్నారు. ఇప్పటి వరకు మీరంతా ఈ రహదారి కారణంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదర్కొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు. గడ్కరీ గతంలో తన హాయాంలో మధ్యప్రదేశ్‌కి రూ. 6 లక్షల విలువైన రోడ్డు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ విషయమై భూసేకరణ, అడవుల తొలగింపు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కూడా. ఆ తర్వాత ఫంక్షన్ చివరిలో కాంగ్రెస్ గూర్చి అన్యూహ్యమైన వ్యాఖ్యలు చేసి బీజేపీని షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ...2004 నుంచి 2014 మధ్య రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఆర్థిక సంస్కరణలతో సరికొత్త సరళీకరణకు దిశా నిర్ధేశం చేశారంటూ ప్రశంసించారు. ఈ విషయమై దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని కొనియాడారు గడ్కరీ. ఐతే గడ్కరీ ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు బీజీపీని ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. (చదవండి: కేరళ గవర్నర్‌కు షాక్.. వర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమైన సర్కార్) -
తప్పయింది క్షమించండి: మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు. వరాహ రూపంలో పాటకు రీల్స్ చేయటానికి యువతి చేతిలో పంజనం పట్టిన రూపంలో రంగులు వేసి రీల్స్ చేసి సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీనిపై నెటిజన్లు ఆక్షేపం వ్యక్తం చేశారు. కొందరు ధర్మస్థల మంజునాథస్వామి శిక్షిస్తాడంటూ శాపనార్థాలు పెట్టడంతో శ్వేతారెడ్డి శుక్రవారం మంజునాథస్వామి సన్నిధిలో కొడగు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ధర్మస్థల ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ వీరేంద్రహెగ్డేని కలిసి క్షమాపణలు కోరారు. చదవండి: (జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. భార్య, కన్నబిడ్డను..) -
అభినవ్‌తో నటి కల్పిక మాటల యుద్ధం.. స్క్రీన్‌షాట్స్ వైరల్
నటి కల్పికా గణేష్ గుర్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రంలో సమంతకు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తుంది. అయితే కొద్దిరోజులుగా కల్పికా గణేష్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నటుడు అభినవ్ గోమటంతో కల్పికా సోషల్ వార్‌కు దిగింది. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవలె ఓ షోలో కల్పికకు బెస్ట్ సపోర్టింగ్ రోల్ కింద అవార్డు వరించిందట. దీనిపై అభినవ్ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడట. ఇప్పుడు ఈ అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తుంది. తన పనిని అభినవ్ అమానించాడని పేర్కొంటూ అతడు తనకు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా అభినవ్ గోమటం ఫ్రెండ్స్‌ని కూడా ట్యాగ్ చేస్తూ అతడితో సారీ చెప్పించాలంటూ సవాలు చేస్తుంది. అటు అభినవ్ కూడా .. కల్పికాకు క్షమాపణలు చెప్పేది లేదని, ఆమె కావాలనే తనను టార్గెట్ చేస్తుందంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని కూడా కల్పికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇలా మహిళలను తక్కువ చేసేలా మాట్లాడటమే కాకుండా గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కల్పికా డిమాండ్ చేస్తుంది. కాగా అభినవ్ గోమటం ఈ నగరానికి ఏమైంది, శ్యామ్‌సింగరాయ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. -
తప్పు జరిగిపోయింది.. లిజ్ ట్రస్ క్షమాపణలు
లండన్: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. జాతిని ఉద్దేశించి క్షమాపణలు తెలియజేశారు. మినీ బడ్జెట్.. పన్నుల కోత నిర్ణయాలు బెడిసి కొట్టడం వెనుక పెద్ద తప్పు జరిగిపోయిందని, ఆ తప్పు చాలా దూరం వెళ్లిందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘జరిగిన పొరపాట్లకు క్షమించండి. ఆర్థికంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. ఆ పరిణామాలు చాలా వేగంగా.. చాలా దూరం వెళ్లాయి. అందుకు బాధ్యత నేనే తీసుకుంటున్నా. కాస్త సమయం ఇవ్వండి.. అన్నీ చక్కబెడతాం’’ అని ఆమె పౌరులను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. అయితే.. తప్పులు జరిగినప్పటికీ దేశం కోసం పని చేయడానికే తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కన్జర్వేటివ్ తరపున తన సారథ్యంలోని ప్రభుత్వమే ఎన్నికలకు వెళ్తుందని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ట్రస్‌ను ఎన్నుకుని తప్పిదం చేశామన్న అభిప్రాయంలో ఉన్న కొందరు కన్జర్వేటివ్ ఎంపీలు.. అవిశ్వాసం ద్వారా ఆమెను గద్దె దించే ఆలోచనలో ఉన్నట్లు అక్కడి మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. ఇదీ చదవండి: అవిశ్వాసం.. లిజ్ ట్రస్‌కు ఉన్న ఏకైక ఆయుధం అదే! -
చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ
జైపూర్: రాజస్థాన్ సిరోహిలో శుక్రవారం పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఆయన అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అబు రోడ్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి ఆలస్యంగా వెళ్లారు. సమయం రాత్రి 10గంటలు దాటిపోయింది. రాజస్థాన్‌లో 10 దాటిన తర్వాత మైక్‌లు, లౌడ్ స్పీకర్లపై నిషేధం అమలులో ఉంది. దీంతో నిబంధనలకు లోబడి ఆయన మైక్‌లో మాట్లాడలేదు. నిబంధనలు అతిక్రమించి మైక్‌లో ప్రసంగించడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని మోదీ అన్నారు. దయచేసి తనను క్షమించాలని అక్కడికి భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యర్తలను, అభిమానులను కోరారు. తాను మరోసారి కచ్చితంగా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి ఇప్పుడు చూపించిన ప్రేమ, అభిమానానికి రుణం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. 'భారత్ మాతాకీ జై' అని ప్రసంగం ముగించారు. ఇదంతా స్టేజీపై మైక్ లేకుండా సాధారణంగా మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్, పార్టీ సీనియర్ నేత అమిత్ మాలవీయ. మోదీ అంతకుముందు ఏడు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అందుకే షెడ్యూల్ అలస్యమై సమయం 10 దాటిందని వెల్లడించారు. 72 ఏళ్ల వయసులోనూ ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఇతర బీజేపీ నేతలు కూడా మోదీ నిజాయితీని కొనియాడారు. ప్రధాని హోదాలో ఉండి కూడా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. PM Modi decided against addressing the public meeting at Abu Road because it was well past stipulated time. This was 7th program of the day. Earlier he flagged and took a ride on Vande Bharat and Ahemdabad Metro, prayed at Ambaji among others. He is 72 and fasting for Navratri! pic.twitter.com/UWiotbehQm — Amit Malviya (@amitmalviya) September 30, 2022 చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే.. -
అలిగిన టీచర్‌కు ముద్దుపెట్టిన బుడ్డోడు.. వీడియో వైరల్
పాలబుగ్గల పసివాడు తన క్లాస్ టీచర్‌కు క్షమాపణలు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తరగతి గదిలో అల్లరి చేసినందుకు ఆ బుడ్డోడిపై టీచర్‌కు కోపం వచ్చింది. ఇకపై అతనితో మాట్లాడనని చెప్పింది. దీంతో ఆ బాలుడు ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. టీచర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నవ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావ్. తప్పు చేయనని చెప్పి మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటావ్. నీతో ఇక మాట్లాడను అని అలకబూనింది. అందుకు బుడ్డోడు బదులిస్తూ.. మళ్లీ క్లాస్‌లో అల్లరిచేయనని చెప్పాడు. ఇది చివరిసారి అన్నాడు. అంతేకాదు టీచర్‌కు రెండు ముద్దులు కూడా పెట్టాడు. దీంతో ఆమె అలకవీడింది. బుడ్డోడికి కూడా రిటర్న్ కిస్ ఇచ్చింది. చూడచక్కగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చాలా క్యూట్, అడోరబుల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uHkAhq0tNN — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022 చదవండి: భర్తకు ట్రాన్స్‌వుమన్‌తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య.. -
తెలంగాణ అసెంబ్లీ: సెషన్ మొత్తం ఈటల సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మధ్య జరుగుతున్న వాడీవేడి వాగ్వాదాలు.. తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. తాజాగా మూడో రోజు సమావేశాల్లో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ ప్రకటించారు. ఆ సమయంలో ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే స్పీకర్ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు. ఇదిలా ఉంటే.. ‘స్పీకర్‌పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కోరారు. ‘స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్‌రెడ్డి -
హృతిక్ రోషన్ యాడ్‌పై జొమాటో క్షమాపణలు
భోపాల్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించిన మహాకాల్ వాణిజ్య ప్రకటన వివాదం కావడం తెలిసే ఉంటుంది. boycott zomato ట్రెండ్ కూడా సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్షమాపణ చెప్పింది. తాము పేర్కొన్న మహాకాల్ ఒక రెస్టారెంటే తప్ప ఉజ్జయిని ఆలయానికి సంబంధించింది కాదంటూ వివరణిచ్చింది. ఆ ప్రకటనలో హృతిక్..‘ఉజ్జయినిలో నాకు థాలి(నార్త్ ఇండియా భోజనం) తినాలనిపిస్తే మహాకాల్ నుంచే తెప్పించుకుని తింటా’ అని అంటాడు. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉజ్జయిని కలెక్టర్.. మహాకాల్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశిష్ సింగ్ స్పందిస్తూ.. భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని పరమపవిత్రంగా భావిస్తారని, అలాంటిది ఈ యాడ్ వాళ్ల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రకటన ఉజ్జయినిలోని అందరికీ తెలిసిన మహాకాల్ రెస్టారెంట్‌కు మాత్రమే సంబంధించిందని జొమాటో వివరణ ఇచ్చుకుంది. ఉజ్జయిని ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఇకపై ఆ యాడ్‌ను ప్రదర్శించబోమని జొమాటో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మహాకాల్ దైవప్రసాదం.. అవమానిస్తారా? -
శ్రీకృష్ణ జన్మాష్టమి: బాయ్‌కాట్ అమెజాన్ దుమారం
సాక్షి, బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. (PM Kisan eKYC deadline extended: పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు) పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ‘షేమ్ ఆన్ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్‌పై సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది. (వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్) జన్మాష్టమికి 20 శాతం సేల్ అంటూ కొన్ని చిత్రాలను అమ్మకానికి పెట్టింది అమెజాన్. వెబ్సైట్లో రాధతో శ్రీకృష్ణుడు ఉన్న అశ్లీల పెయింటింగ్‌ను విక్రయించడంపై హిందూ జాగృతి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా హిందూ దేవతలపై అభ్యంతరంగా ,అనుచితంగా వ్యవహరించడం ఆనక లెంపలేసుకోవడం అమెజాన్‌కు ఇది కొత్తేమీ కాదు. ఇది చదవండి: లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే! #Boycott_Amazon#Boycott_ExoticIndia ‼️‼️amazonIN & exoticindiaart selling obscene paintings of hindu gods and again & again hurting hindu sentiments!! 👉Hindus are you still want to use this app⁉️⁉️ pic.twitter.com/5xPp1UVTdq — Snehal Patil (@SnehalPatil4SP) August 19, 2022 Press Release Members of @HinduJagrutiOrg submitted a memorandum to the Police Inspector, Subramanya Nagar Benguluru, requesting action against @amazonIN for selling obscene painting of Lord Krishna with Radha on their website.#Boycott_Amazon #Boycott_ExoticIndia pic.twitter.com/E5ASG6PLSH — HJS Karnataka (@HJSKarnataka) August 19, 2022 Hindu unity triumphs! Amazon & Exotic India Art quietly withdraw obscene painting of ShriKrishna & Radhaji. But this is not enough. Both Amazon & Exotic India must tender unconditional apology & pledge not to hurt sentiments of Hindus again.#Boycott_Amazon#Boycott_ExoticIndia pic.twitter.com/tvWbuAetcg — Yamanu Naikodi (@Yamanu76669807) August 19, 2022 We won't allow anyone to hurt Hindu sentiments Neither Bollywood nor Corporates Time and again Amazon providing its platform to sell things which hurt Hindu sentiment#Boycott_Amazon for insulting gods 👇@RadharamnDas#Boycott_ExoticIndia#Janmashtami #harekrishna . pic.twitter.com/u5wX3cyrQ3 — Saffron Swamy (@SaffronSwamy) August 19, 2022 -
మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్.. ఎందుకంటే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది మూవీ టీం. ఇందులో భాగంగా చెన్నైలో ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే అనుకోని కారణాలతో ఈ ఈవెంట్ ఆలస్యం కావడంతో తమిళ మీడియాకు అమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. లాల్ సింగ్ చడ్డా అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని పేర్కొన్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. -
తైవాన్ విషయమై ఏం అన్న...ఫైర్ అవుతున్న చైనీయులు
తైవాన్ విషయమై ఆగ్రహంతో ఊగిపోతున్న చైనా తాజాగా స్నీకర్ సంస్థ తయారీదారుల చేత క్షమాపణలు చెప్పించుకుంది. ఈ మేరకు స్నీకర్ క్యాండీ చాకోలెట్ తయారీ సంస్థ మార్స్ రిగ్లీ చైనా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెపింది. ఇంతకీ ఏ జరిగిందంటే...స్నీకర్స్ క్యాండీకి సంబంధించిన ఈవెంట్ ప్రమోటింగ్‌లో భాగంగా ఒక వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పరిమిత పరిధిలో లభించే స్నీకర్క్యాండీలు కేవలం దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్ దేశల్లోనే లభిస్తుంది అని వస్తుంది. అంతే ఈ వీడియో చైనాకి సంబంధించిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫాం వీబోలో తెగ వైరల్ అయ్యింది. దీంతో చైనీస్ నెటిజన్లు తైవాన్ ఒక దేశామా అంటూ ఆగ్రహంతో సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే దెబ్బకు స్నీకర్ చాకోలెట్ తయారీ సంస్థ మార్స్ రిగ్లీ తన చైనా వీబో అకౌంట్లో క్షమాపణలు చెప్పడమే కాక ఆ వీడియోని సవరించింది కూడా. (చదవండి: తైవాన్ టెన్షల నడుమ భారత్‌తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా) -
రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే..
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. పదే పదే ద్రౌపది ముర్ము అని పిలిచారని, పేరుకు ముందు రాష్ట్రపతి అని గానీ, మేడం, శ్రీమతి అని గానీ సంభోదించలేదని విమర్శించారు. ఈమేరకు అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడినందుకు స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, గురువారమే పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంభోదించారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడినందుకు అధిర్ రంజన్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు కూడా చేపట్టారు. చివరకు అధిర్ రంజన్ చౌదరి వెనక్కితగ్గారు. క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. చదవండి: మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి -
Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతిని క్షమాపణలు కోరిన కాంగ్రెస్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈమేరకు రాష్ట్రపతికి లేఖ రాసి క్షమాపణలు కోరారు. పొరపాటుగా నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. పార్లమెంటులో గురువారం మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని అన్నారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధిర్ రంజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రాష్ట్రపతి అయిన గిరిజన బిడ్డను అవమానించేలా ఆయన మాట్లాడారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగ్గారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ -
మీడియాకి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం విక్రాంత్ రోణ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్ నేపథ్యంలో నేడు(జులై21)న హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ప్రతినిథులకు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్మీట్లకు హాజరు కాలేకపోతున్నానని, తనను క్షమించాలని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే త్వరలోనే అందరినీ కలుస్తాను అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. Apologies to all my media frnzz frm Chennai,Kochi & Hydarabad, for having canceled the press meet & event. I have Been Unwell. Feeling much better & shall resume travel again. IHoping to Reschedule to a sooner date. Looking forward to meeting u all. 🥂 Love & Regards, Kichcha❤️ — Kichcha Sudeepa (@KicchaSudeep) July 21, 2022 -
ప్రవక్త వివాదం: శాంసంగ్ క్షమాపణలు
ఇస్లామాబాద్: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ చేష్టలతో పాకిస్థాన్‌పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్ కంపెనీ దిగొచ్చింది. ఇస్లాంను, మొహమ్మద్ ప్రవక్తను కించపరిచిందన్న ఆరోపణలపై ఎట్టకేలకు పాకిస్థాన్‌కు క్షమాపణలు తెలియజేసింది శాంసంగ్. బ్లాస్ఫెమీ(దైవదూషణ)కి పాల్పడడంతో శాంసంగ్ కంపెనీపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో.. అంతర్గత దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు కొరియన్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మతపరమైన భావాలపై తటస్థతను కొనసాగిస్తుందని ట్విటర్లో ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. శుక్రవారం కరాచీలోని స్టార్ సిటీ మాల్లో ఇన్స్టాల్ చేసిన ఓ వైఫై డివైజ్ మూలంగా ఈ రచ్చ షురూ అయ్యింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో.. మాల్ దగ్గరికి చేరుకుని కొందరు నిరసనలకు దిగారు. అదే సమయంలో శాంసంగ్ తీసుకొచ్చిన ఓ క్యూఆర్ కోడ్ ప్రవక్తను కించపరిచేదిగా ఉందంటూ గొడవ మరింత ముదిరింది. శాంసంగ్ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. రెచ్చిపోయి మాల్ బయట విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. Protest against alleged blasphemy of a WiFi device in Karachi. Mob gathered after a WiFi device installed in Star City Mall, allegedly posted blasphemous comments. Protesters vandalised Samsung billboards accusing the company of blasphemy. Police detained 27 Samsung employees. pic.twitter.com/3R8UYbScqa — Naila Inayat (@nailainayat) July 1, 2022 Samsung Pakistan - Press Release July 1st, 2022. pic.twitter.com/IVSpAkH8Lm — Samsung Pakistan (@SamsungPakistan) July 1, 2022 విషయం తెలిసి మాల్‌కు చేరుకున్న పోలీసులు.. 27 మంది శాంసంగ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తెహ్రీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్థాన్ గ్రూప్ సభ్యులని నిర్ధారించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ మాత్రం చేయలేదు. పాక్‌లో దైవదూషణను అక్కడి చట్టం తీవ్ర నేరంగా భావిస్తుంది. కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా.. ఒక్కోసారి మరణ శిక్ష కూడా అమలు చేస్తారు. కిందటి ఏడాది డిసెంబర్లో ఇస్లాంను కించపరిచిన నేరానికి.. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి సియాల్కోట్లో మూక హత్యకు గురయ్యాడు. చదవండి: నూపుర్‌శర్మ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే! -
ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’
Kuwaiti supermarket pulled: మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అక్కడికి సదరు ప్రతినిధిపై బీజేపీ వేటు వేసింది కూడా. తన వ్యాఖ్యల పట్ల నూపుర్ క్షమాపణలు చెప్పింది కూడా. అయినప్పటికీ గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కువైట్‌లోని అల్ అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను పక్కనపెట్టింది. నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ ఉత్పత్తులను వాడేది లేదంటూ ఒక ట్రాలిలో ప్యాక్ చేసి పక్కనే పెట్టేశారు. సదరు స్టోర్ సీఈవో ‘ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నాం’ అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బీజేపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తీవ్రంగా మండిపడుతోంది. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్ నుంచి విదేశాల్లో పని చేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో.. 8.7 మిలియన్ల మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క. ఇక భారత్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కువైట్ సుమారు 95 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అదీగాక భారత్ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా గోధుమల ఎగుమతులను నిషేధించిన సమయంలో కూడా కువైట్ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వమని కోరడం గమనార్హం. (చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ) -
డబుల్ మీనింగ్ యాడ్స్.. ఎట్టకేలకు క్షమాపణలు!
ఈ మధ్యకాలంలో ఇంతలా ఏ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు ఇంతగా వివాదాస్పదం అయ్యి ఉండలేదేమో!. గుజరాత్‌కు చెందిన ప్రముఖ డియోడ్రంట్ బ్రాండ్ లేయర్స్.. దుమారం రేపిన తన ‘షాట్’ యాడ్స్‌పై ఎట్టకేలకు క్షమాపణలు తెలిపింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన రెండు యాడ్స్ కూడా వివాదాస్పదం కావడం తెలిసే ఉంటుంది. మహిళలను అగౌరవపర్చడంతో పాటు అత్యాచార సంప్రదాయాల్ని ప్రొత్సహించేలా ఉన్నాయంటూ ఆ రెండు ‘షాట్’ యాడ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మహిళా కమిషన్‌తో పాటు ఇంటర్నెట్లోనూ పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొరడా ఝులిపించిన కేంద్రం.. ఆ యాడ్స్‌ను తొలగించాలంటూ ట్విటర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ట్విటర్లో లేయర్స్ షాట్ ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగతంగా, వర్గాలవారీగా ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని వేడుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది సదరు కంపెనీ. అంతేకాదు అన్ని ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఆ యాడ్లను తొలగిస్తున్నట్లు, మీడియా పార్ట్నర్స్కు కూడా ఆ యాడ్స్ టెలికాస్ట్‌ను ఆపేయాలని కోరినట్లు ప్రకటనలో తెలిపింది. pic.twitter.com/6LfpVcBXuV — Layer'r Shot (@layerr_shot) June 6, 2022 ఇదిలా ఉంటే.. కేంద్రం కూడా ఇలాంటి యాడ్స్‌ను తప్పనిసరి అనుమతులు మంజూరు అయిన తర్వాతే టెలికాస్ట్ చేయాలంటూ లేయర్స్ షాట్‌కు అక్షింతలు వేసింది. చదవండి: ఇదెక్కడి ‘షాట్’.. ఇంతకీ యాడ్స్‌లో ఏముందంటే.. -
నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సస్పెండ్ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ఆమె తన వైఖరిని వివరిస్తూ ‘గత చాలా రోజులుగా మా మహాదేవ్ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. జ్ఞానవాపి మసీదు వద్ద ఉంది లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను* అని నూపుర్ శర్మ చెప్పారు. సంబంధిత వార్త: Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ కాగా హమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ ఆదివారం సస్పెండ్ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలిగిస్తున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావును మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని’ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది -
దివంగత సింగర్ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు
Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని ఆయన అనేక భాషల్లో పాడి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేసింది. అయితే ప్రముఖ బెంగాలీ గాయకుడు, గేయ రచయిత రూపాంకర్ బగ్చీ మాత్రం 'ఎవరు ఈ కేకే, ప్రాంతీయ సింగర్లను ప్రోత్సహించాలి' అంటూ వీడియో రూపంలో తన అక్కసును వెళ్లగక్కిన విషయం విదితమే. ఆయన మాటలకు అనేక మంది నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. అయితే తాజాగా రూపాంకర్ ఈ విషయంపై కేకేకు అతని కుటుంబానికి క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ నిర్వహించి బహిరంగంగా క్షమాపణలు కోరాడు. తను పోస్ట్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేసినట్లు పేర్కొన్నాడు. 'కేకే కుటుంబానికి, నా వ్యాఖ్యలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను. కేకేతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన వారి కంటే దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన గాయకులకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తుందని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. చదవండి: కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? ఇంత విద్వేశానికి గురవుతారని ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్‌లు వస్తున్నాయి. అందుకే కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని ప్రెస్మీట్లో రూపాంకర్ బగ్చీ తెలిపాడు. -
క్షమాపణలు చెప్పిన వ్లాదిమిర్ పుతిన్
జెరూసలేం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై కామెంట్లు చేసే తరుణంలో.. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉందంటూ రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ క్షమాపణలు తెలియజేసినట్లు తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ మధ్య ఓ ఇటలీ మీడియా హౌజ్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అడాల్ఫ్ హిట్లర్‌లోనూ బహుశా యూదుల రక్తం ఉండొచ్చని వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఉక్రెయిన్ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్రోవ్కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు. సెర్గీ లావ్రోవ్ కానీ, హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని చాలా దేశాల అధినేతలు, ప్రతినిధులు ఖండించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ లావ్రోవ్ వ్యాఖ్యల్ని క్షమించరానివంటూ మండిపడింది. ఈ తరుణంలో.. ఇజ్రాయెల్‌లోని రష్యా రాయబారిని పిలిపించుకుని మరీ.. సదరు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. పరిణామాలు మరీ వేడెక్కడంతో పుతిన్ ఫోన్లో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలి బెన్నెట్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ ప్రధానితో పుతిన్ (పాత ఫొటో) ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణల్ని ప్రధాని నఫ్టాలి బెన్నెట్ స్వీకరించారు. యూదులు, హోలోకాస్ట్ జ్ఞాపకం పట్ల రష్యా వైఖరిని తెలియజేశారాయన అంటూ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే క్రెమ్లిన్ వర్గాలు మాత్రం.. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ మాత్రమే జరిగినట్లు ప్రకటన విడుదల చేసింది అంతే. చదవండి: రష్యా ఆటలు మా గడ్డపై సాగవ్! -
ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్
Vishwak Sen Says Apology On Objectionable Word: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీపై ప్రముఖ టీవీ ఛానెల్ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ అభ్యంతరకర (ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. ప్రస్తుతం ఈ పదాన్ని వాడటంపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. మే 2న నిర్వహించిన మూవీ ప్రమోషన్లో ఓ విలేఖరి విశ్వక్ సేన్‌ను ఈ పదం వాడటంపై ప్రశ్నించారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ 'దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగానే అలాగే వచ్చింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్‌కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ. దీనిపై రేపు (మే 3) క్లారిటీగా నోట్ రిలీజ్ చేస్తాను' అని తెలిపాడు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి క్షమాపణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లిఖిత పూర్వక క్షమాపణ చెప్పారు. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనపై కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వరి సాగు చేపట్టవద్దని.. వ్యాపారులు వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారనే ఆరోపణలతో పాటు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమన్నారనే అభియోగాలు రావడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వెంకట్రామిరెడ్డి క్షమాపణతో కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు ముగించింది. చదవండి: ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి! -
‘సారీ’లు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు!
ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి సారీ చెబుతూనే ఉంటాం మనం. ‘ఐయామ్ సారీ’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది మాత్రమే కాదు.. సందర్భాన్ని బట్టి ఇలా రకరకాలుగా సారీ చెప్పవచ్చు... ఐ అపాలజీస్: ఉదా: ఐ అపాలజీస్ ఫర్ ది డిలే ఇన్ రిప్లైంగ్ టు యువర్ ఇమెయిల్ ఐ బెగ్ యువర్ పర్డన్: ఉదా: పర్డన్ మై ఇగ్నోరెన్స్ మెయ కుల్ప: ‘మెయ కుల్ప’ అనేది లాటిన్ మాట. మోడ్రన్ ఇంగ్లీష్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మై బ్యాడ్: లైట్‌గా సారీ చెప్పాల్సిన సందర్బంలో వాడుతారు. ఉదా: మై బ్యాడ్. ఇట్ వోన్ట్ హ్యాపెన్ అగేన్ వూప్స్: మైల్డ్ సారీ, సర్ప్రైజ్... ఉదా: వూప్స్! ఐ బ్రోక్ యువర్ కాఫీ మగ్ -
‘నేను వార్న్‌ను అంతమాట అనకుండా ఉండాల్సింది’
ముంబై: ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి నివాళులు అర్పి స్తూ నాలుగు మంచి మాటలు చెప్పడం సహజం. బతికినప్పుడు ఎలా ఉన్నా చనిపోయినప్పుడు ప్రత్యర్థులు కూడా ఏదో ఒక మంచి అంశాన్ని ఎంచుకొని తమ స్పందనను తెలియజేస్తారు. కానీ వార్న్ మృతి సమయంలో టీవీ చర్చలో పాల్గొంటూ భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. వార్న్ గొప్పతనం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘నా దృష్టిలో వార్న్ అత్యుత్తమ స్పిన్నర్ కాదు. భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్ అంతకంటే మెరుగైన వాళ్లు. భారత్‌లో అతని రికార్డు చాలా సాధారణంగా ఉంది. ఒక్కసారి మాత్రమే అది టెయిలెండర్ జహీర్ గుడ్డిగా బ్యాట్ ఊపితే అతను ఐదు వికెట్లు తీయగలిగాడు. భారత్‌పై రాణించలేకపోయిన వార్న్కంటే మురళీనే గొప్పోడు’ అని గావస్కర్ అన్నాడు. దాంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వార్న్‌ను విమర్శించేందుకు ఇదా సమయం అనడంతో పాటు పోలికలు తీసుకురావడమేమిటని క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. దాంతో సోమవారం గావస్కర్ దీనిపై వివరణ ఇచ్చాడు. ‘ఆ ప్రశ్న అడిగేందుకు, దానికి నేను జవాబు ఇచ్చేందుకు కూడా అది సరైన సమయం కాదు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో వార్న్ ఒకడు’ అని సన్నీ వ్యాఖ్యానించాడు. నిజానికి భారత గడ్డపై మురళీ సగటు (45.45)కంటే వార్న్ సగటే (43.11) కాస్త మెరుగ్గా ఉంది. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు! Shane Warne Death: వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది -
ఓటింగ్‌లో అసౌకర్యం... క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో విజయ్
Thalapthy Vijay Apologised To The Public: చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ సైతం తన ఓటును వినియోగించుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన విజయ్ ఫోటోలు తీసేందుకు మీడియా పెద్ద ఎత్తున గుంపులుగా చేరడంతో అక్కడ ఉన్న సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగింది. పరిస్థితిని గమనించిన విజయ్ తనవల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో దళపతి అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. His Simplicity 😊🖤 #Vijay#TnLocalBodyElection @actorvijayhttps://t.co/sLr7WM2a00 pic.twitter.com/fAAW0voj0S — مادهيسفج (@MADHESVJ1) February 19, 2022 -
ఆగిపోయిన ట్విటర్ సేవలు! కారణం ఏంటంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సేవల్లో అంతరాయం ఈరోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఈ విషయంలో మిగతా వాటితో పోలిస్తే ట్విటర్ కొంచెం మెరుగు అనే అభిప్రాయం ఉంది యూజర్లలో. అందుకే వేరే ఏదైనా ప్లాట్‌ఫామ్ సేవలకు ఇబ్బంది అయినప్పుడు.. ట్విటర్లో చెడుగుడు ఆడేసుకుంటారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చాలా కాలం తర్వాత ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. గంటల వ్యవధిపాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి(శుక్రవారం) 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. సమస్య ఏంటంటే.. ఈ అంతరాయంపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల(టెక్నికల్ బగ్) కారణంగానే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్‌నే ట్రోల్ చేస్తూ పలువురు ట్వీట్లు చేయడం కొసమెరుపు. We’ve fixed a technical bug that was preventing timelines from loading and Tweets from posting. Things should be back to normal now. Sorry for the interruption! — Twitter Support (@TwitterSupport) February 11, 2022 మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని పలువురు ఫిర్యాదులు చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. డౌన్‌డిటెక్టర్ అనే ట్రాక్ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి. -
హీరోయిన్‌కు సారీ చెప్పిన 'ఖిలాడి' డైరెక్టర్
Khiladi Director Ramesh Varma Says Sorry To Heroine: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రమేశ్ వర్మ.. స్టేజ్‌పైనే హీరోయిన్ మీనాక్షి చైదరికి క్షమాపణలు చెప్పారు. ఖిలాడీ ట్రైలర్ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్ హాయాతినే ఎందుకో కాస్త ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది అంటూ పేర్కొన్నారు. రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది. -
అందుకే అత్యాచారాలు.. బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
బెంగళూరు: తరచూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు. మహిళల బట్టలను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన బుధవారం ఢిల్లీలో అన్నారు. మహిళలు బికిని ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ చెప్పడాన్ని ఖండించారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను కలిగిస్తుందని ఆయన అన్నారు. ఆయన మాటలపై విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు చెప్పారు. స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని తెలిపారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు. -
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన నటి
Shweta Tiwari Apologies After Her Derogatory Comments On God: ప్రముఖ హిందీ సీరియల్ శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. దేవుడిపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతుండటంతో తప్పు తెలుసుకుంది. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతేకాకుండా తన మాటలను వక్రీకరించారని పేర్కొంది. సహ నటుడు సౌరబ్ పాత్రను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ని దేవుడితో ముడిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను దేవుడ్ని విశ్వసిస్తానని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా ఓ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే భోపాల్‌లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు కూడా నమోదైంది. -
మైకులో బండబూతు తిట్టి.. ఆపై ఫోన్లో సారీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా కనిపించే బైడెన్లో వేరియేషన్ కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారంతా. సోమవారం ఓ జర్నలిస్టును బండ బూతు తిట్టడం.. అదీ మైక్ సాక్షిగా అందరికీ వినిపించేలా కావడంతో ఘటనపై దుమారం రేగింది. కన్జర్వేటివ్ పార్టీ ప్రొ ఛానెల్ ఫాక్స్ న్యూస్‌లో పని చేస్తున్నాడు పీటర్ డూసీ. అతన్ని బైడెన్ ‘స్టుడిప్ సన్ ఆఫ్ **’ అంటూ తీవ్ర పదజాలంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిట్టేశాడు . అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్ చేసి మరీ బైడెన్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘అది తన వ్యక్తిగతంగా చేసిన కామెంట్ కాదని..’ ఆయన ఆ జర్నలిస్ట్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. జనవరి 24న వైట్‌హౌజ్‌లో కాంపిటీషన్ కౌన్సిల్ భేటీ జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్మీట్లో పీటర్ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో కోపాన్ని అణుచుకోలేక.. వెటకారంగా ‘ద్రవ్యోల్భణం గొప్ప ఆస్తి’ అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే.. ‘వాట్ ఏ స్టుడిప్..’ అంటూ బూతు తిట్టేశాడు. మైక్ ఆన్‌లో ఉంది గమనించని బైడెన్.. ఆ తర్వాత సిబ్బంది ఆ విషయం చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్ రూంలో ఆ కామెంట్లను విని చిన్నబుచ్చుకున్నాడట. చివరికి బైడెన్ క్షమాపణలతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది. #WATCH | US President Joe Biden appeared to be caught on a hot mic after a journalist asked him a question related to inflation at the end of his press conference (Video Courtesy: C-Span) pic.twitter.com/ZJCP7X3QZS — ANI (@ANI) January 25, 2022 చదవండి: ఏడాదిన్నర చిన్నోడు.. ఫోన్లోనే లక్షా యాభై వేల షాపింగ్ చేశాడు -
చిరంజీవి తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు.. 'బుద్ది గడ్డి తిని అలా తిట్టాను'
Sri Reddy Apologies To chiranjeevi Mother Anjanamma: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేసింది. 'ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నా. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నా. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి' అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నన్ను క్షమించండి "అంజనమ్మ" 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt — Sri Reddy (@MsSriReddy) January 22, 2022 -
వివాదంలో నెస్లే కిట్ క్యాట్ చాక్లెట్
ఫాస్ట్ మూవీంగ్ కన్జూమర్ గూడ్స్ కంపెనీ ‘నెస్లే ఇండియా’ వివాదంలో చిక్కుకుంది. మతపరమైన అంశం జోలికి పోవడంతో సోషల్ మీడియాలో కంపెనీని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. దీంతో క్షమాపణలు చెప్పిన కంపెనీ.. తన చర్యను వెనక్కి తీసుకుంది. విషయంలోకి వెళ్తే.. నెస్లే ఇండియా కంపెనీ నుంచి కిట్ క్యాట్ బార్ చాక్లెట్ ఎంత ఫేమస్సో తెలియంది కాదు. ఈ చాక్లెట్ రేపర్‌పై జగన్నాథ స్వామితో పాటు బాలభద్ర, సుభద్ర మాతా చిత్రాలను ముద్రించింది. ఈ చర్యతో మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు ప్రకటించుకున్నారు. చాక్లెట్లు తిన్నాక ఎక్కడ పడితే అక్కడ రేపర్లను పడేస్తారన్నది వాళ్ల అభ్యంతరం. ఈ నేపథ్యంలో కొందరు ట్విటర్ వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఎఫ్ఎంసీజీ(Fast-moving consumer goods) అయిన నెస్లేకు పలువురు విజ్ఞప్తులు సైతం చేశారు. Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha#JayJagannath pic.twitter.com/jJNwSNEs9e — BARSHA PRIYADARSHINI NAYAK (@i_am_barsha_) January 18, 2022 All the multi national companies in india, who have got right to make it "Mazak" of Hindu's Religious Sentiment. Try it on some other religion and see, it would happen!! Like!! what happened... Ridiculous Mindset😡#nestle #kitkat #nestleindia pic.twitter.com/kSmATUF07u — Madhu Begali (@madhu_Begali) January 20, 2022 ये #kitkat वालों को भगवान जगन्नाथ का चित्र छापकर क्या साबित करना चाहते हैं वह भी चाय के केटली में, ऐसे ही आस्था का खिलवाड़ करते रहते हैं यह लोग।#boycott_Kitkat pic.twitter.com/UWHvlAVYaP — Murli sahu(MG) (@MurliGurupanch) January 20, 2022 ఈ పరిస్థితులతో నెస్లే ఇండియా దిద్దుబాటు చర్యకు దిగింది. ఒడిశా సంప్రదాయన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏడాదిగా ప్రయత్నిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆర్ట్‌ను, ఆర్టిస్టులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. చింతిస్తున్నాం’’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది నెస్లే కంపెనీ. అయితే వివాదాన్ని ముందే ఊహించిందేమో.. ముందస్తు చర్యగా, గత సంవత్సరం మార్కెట్ నుండి ఈ ప్యాక్‌ల ఉపసంహరణను చేపట్టామని ట్విటర్ వేదికగా ప్రకటించుకుంది నెస్లే ఇండియా. ఇదిలా ఉంటే నెస్లే ఇండియాకు ఇలాంటి వివాదాలేం కొత్త కాదు. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మణిపూర్‌లో ఉన్న కెయిబుల్ లాంజావో నేషనల్ పార్క్‌ను.. మేఘాలయాలో ఉన్నట్లు రేపర్ మీద ప్రచురించి తిట్లు తింది. ఆపై క్షమాపణలు చెప్పింది. Hi @Nestle @NestleIndia @KITKAT! You are not just the leading plastics polluter in the world, you are also insulting the people of Manipur by putting misinformation in your cover saying our pride Keibul Lamjao National Park is in Meghalaya. This is unacceptable. Apologies asap! pic.twitter.com/cIObwUkSvv — Licypriya Kangujam (@LicypriyaK) April 22, 2021 Finally they apologized! pic.twitter.com/lRPWOEVJ0j — Licypriya Kangujam (@LicypriyaK) April 23, 2021 -
సైనా నెహ్వాల్‌కు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ
Siddharth Apologises To Saina Nehwal For Rude Joke In Open Letter: భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు వస్తుండటంతో సిద్ధార్థ్ తప్పు తెలుసుకున్నాడు. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేశాడు. 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా' అంటూ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు నువ్వు ఎప్పుడూ నా చాంపియన్‌గా ఉంటావు సైనా.. అంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై.. 'దేశ ప్రధానికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిణామాల్ని ఖండిస్తున్నా' అంటూ సైనా ట్వీట్ చేయగా.. దీనిపై హీరో సిద్ధార్థ్ వ్యంగంగా బదులిస్తూ..'ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్' అంటూ సైనాపై అభ్యంతరకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
27 రోజుల తర్వాత ట్వీట్ చూసి షాక్.. వార్నర్ క్షమాపణ
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు క్రికెట్‌ను బ్యాలెన్స్ చేస్తూనే.. వీలున్నప్పుడల్లా వీడియోలతో అభిమానులను అలరిస్తుంటాడు. అంతేకాదు వార్నర్‌కు జాలిగుణం ఎక్కువ. ఎవరైనా కష్టం వచ్చింది అంటూ తనకు ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తాడు. అలాంటి వార్నర్ మొదటిసారి ఒక అభిమాని ట్వీట్‌కు సకాలంలో స్పందించలేదు. 27 రోజుల తర్వాత ఆ ట్వీట్‌ను చూసి షాకైన వార్నర్.. తన వీరాభిమానికి క్షమాపణ చెప్పాడు. చదవండి: 'చిన్ననాటి జ్ఞాపకాలు.. మా నాన్న షెడ్లో దొరికాయి' విషయంలోకి వెళితే.. వేదాంతి హరీష్ కుమార్ డేవిడ్ వార్నర్‌కు డైహార్డ్ ఫ్యాన్. నవంబర్ 27న తొలిసారి ట్విటర్లో ''హాయ్.. హౌ ఆర్ యూ వార్నర్..'' అంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా 27 రోజుల పాటు ప్రతీరోజు వార్నర్‌కు ట్వీట్ పెడుతూనే ఉన్నాడు. కానీ యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉన్న వార్నర్ హరీష్ కుమార్ ట్వీట్‌కు రిప్లై ఇవ్వలేదు. తాజాగా వార్నర్ తన వీరాభిమాని ట్వీట్ చూసి షాకయ్యాడు. ఆ తర్వాత వెంటనే.. ''సారీ.. ఎలా ఉన్నావు బ్రదర్'' అంటూ రీట్వీట్ చేశాడు. వార్నర్ నుంచి రిప్లై వచ్చిందని తెలియగానే ఎగిరి గంతేసిన హరీష్ కుమార్.. ''27 రోజులకు నన్ను గుర్తించావు.. థాంక్యూ వార్నర్ భయ్యా'' అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్‌ను ఫన్నీగా ట్రోల్ చేశారు.'' ఏంటి వార్నర్ భయ్యా రిప్లై ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా.. పాపం నీ వీరాభిమాని ఎంత ఫీలయ్యాడో'' అంటూ పేర్కొన్నారు. ఇక యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉన్న వార్నర్ బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపుతున్నాడు. తొలి టెస్టులో 94 పరుగులు చేసిన వార్నర్ రెండో టెస్టులోనూ 95 పరుగులు చేశాడు. రెండుసార్లు సెంచరీ మిచ్ చేసుకున్నప్పటికి వార్నర్ ఫామ్‌లో ఉండడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ఇక వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే రోజున మూడోటెస్టు ప్రారంభం కానుంది. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ Sorry how are you https://t.co/JvjnPjtfgw — David Warner (@davidwarner31) December 23, 2021 -
Viral Video: మోడల్స్‌ను జంతువులుగా చూపించారు.. తీవ్ర విమర్శలు రావడంతో..
ఏ సంస్థ అయిన తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్కెటింగ్ తప్పనిసరి. మార్కెటింగ్, ప్రయోషన్స్ ద్వారా తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. వీటిలో యాడ్స్ కీలకమైనవి. యాడ్స్ ద్వారా విషయం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. అయితే ఈ యాడ్స్ కొన్నిసార్లు చిక్కుల్లో పడేస్తాయి. యాడ్స్‌లోని కంటెంట్ కొందరి మనోభావాలు దెబ్బతీసుంది. తాజాగా సౌత్ కొరియాకు చెందిన అతి పెద్ద డెయిరీ కంపెనీ సియోల్ మిల్స్ ఇలాగే వివాదంలో చిక్కుకుంది. సియోల్ మిల్క్ తన డెయిరీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఇటీవల ఓ వీడియో యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో మహిళలను ఆవులుగా చూపించడంతో కంపెనీపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఇందులో ఓవ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఫోటోలు తీస్తూ తిరుగుతూ ఉండగా అతనికి పొలంలో ఉన్న మహిళలు కనిపిస్తారు. వీరంతా అడవిలో జలపాతాల వద్ద నీళ్లు తాగి.. పక్కనే గడ్డి మీద మీద యోగా చేస్తుంటారు. వీళ్లను గమనించిన ఆ వ్యక్తి ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంతలోనే అతని చెప్పు కింద ఉన్న ఓ కట్టె పుల్ల విరిగి శబ్దం వస్తుంది. చదవండి: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న.. వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ ఇలా కిందికి చూసి పైకి చూసే సరికి అక్కడ మహిళలు కనిపించరు. ఆ శబ్దం విన్న ఒక్కసారిగా మహిళలు ఆవులుగా మారిపోతారు. దీంతో అతడు ఆశ్యర్యానికి గురవుతాడు. సియోల్ మిల్క్ డెయిరీ ఉద్దేశం.. ప్రకృతి ఒడిలో తిరిగే తమ కంపెనీ ఆవులు స్వచ్చమైన నీరు తాగి.. లేత పచ్చిక బయళ్లు తిని స్వచ్ఛమైన పాలనిస్తాయని చెప్పడం. ఆ క్రమంలో అందమైన మహిళా మోడల్స్‌ను ఉపయోగించుకోవడం విమర్శలకు దారితీసింది. ఈ యాడ్‌ను సియోల్ మిల్క్ తన సోషల్ మీడియా అకౌంట్లో నవంబర్ 29న షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ యాడ్‌పై కొరియా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: విక్టరీ హగ్; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! మోడల్స్‌ను ఆవులుగా చూపించడం ఏంటంటూ కొందరు మండిపడుతున్నారు. అలాగే మహిళలను అలా సీక్రెట్‌గా వీడియో, ఫోటోలు తీయడం కూడా చట్ట్ట విరుద్ధమంటూ, మనుషులను పశువులుగా చూపించకూడదని మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీంతో డిసెంబర్ 8న ఈ యాడ్లను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అంతేగాక యాడ్ కారణంగా మనోభావాలు కించపరిస్తే క్షమించాలని కోరింది. యాడ్ రూపకల్పనలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామమని పేర్కొంది. -
అల్లు అర్జున్‌పై ఫైర్ అయిన రిపోర్టర్.. బన్నీ క్షమాపణలు
Pushpa Bangalore Press Meet: అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన సినిమా పుష్ప. డిసెంబర్17న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రెస్‌మీట్ చెప్పిన టైంకి కాకుండా ఆలస్యంగా ఎలా వచ్చారంటూ ఓ కన్నడ రిపోర్టర్ నిలదీశాడు. 11.15కి ప్రెస్‌మీట్ అనిచెప్పి1.15కి ఎలా వస్తారంటూ బన్నీ, రష్మికలపై ఓ రిపోర్టర్ ఫైర్ అయ్యాడు. దీంతో క్షమాపణలు చెప్పిన బన్నీ.. పొగమంచు కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యం అయ్యిందని, అంతేకాకుండా ప్రెస్‌మీట్ టైమింగ్‌పై కాకుండా తనకు స్పష్టత లేదని చెప్పుకొచ్చాడు. సారీ చెబితే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అంటూ తనదైన స్టైల్లో బన్నీ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. -
నందిగం సురేష్‌కు బాబూరావు క్షమాపణ
ఉద్దండరాయునిపాలెం (తాడికొండ): కొందరు వ్యక్తులు తనను ఆర్థికంగా ఆదుకుంటానని ప్రలోభపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై ఆరోపణలు చేయించారని బత్తుల బాబూరావు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసు ఉద్యోగానికి దూరమైన బత్తుల బాబూరావు సిఫార్సు నిమిత్తం ఎంపీ నందిగం సురేష్‌ను కలవగా దాడి చేశారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఎంపీని కలిసి క్షమాపణ చెప్పారు. ఆదివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నందిగం సురేష్ నివాసానికి వెళ్లిన బాబూరావు తీరని అన్యాయం చేశానని ఎంపీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అవినీతికి ‘సీమెన్స్’ ముసుగు కొందరు వ్యక్తులు తనను ప్రలోభాలకు గురిచేసి ఆదుకుంటానని చెప్పినందున అలా మాట్లాడానే తప్ప ఈ వ్యవహారం రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం అవుతుందని తాను ఊహించలేదన్నారు. జరిగిన ఘటనలో ఎంపీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని చానళ్లలో వస్తున్న కథనాలు ఉద్దేశపూర్వకంగా, తనను తప్పుదారి పట్టించి మాట్లాడించిన మాటలే తప్ప వాటిలో నిజం లేదన్నారు. -
హోం మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సాక్షి, కోలారు (కర్ణాటక): పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి తీరును ఖండిస్తూ రైతు సంఘం పదాధికారులు సోమవారం నగరంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించి హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ... నిత్యం ప్రజాసేవలో ఉంటున్న పోలీసులను నోటి కొచ్చినట్లుగా మాట్లాడడం పరిపాటిగా మారిందని, హోం మంత్రి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నగర పోలీస్ స్టేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఐతాండహళ్లి మంజునాథ్, మహిళా అధ్యక్షురాలు నళినిగౌడ, తాలూకా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రేయా ఘోషల్‌కు క్షమాపణలు చెప్పిన టాప్ హీరోయిన్
బాలీవుడ్ సినిమా 'ఆత్రంగి రే'లోని ఫస్ట్‌సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ 'ఆత్రంగి రే' సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపారు. నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్‌కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు. మరో ప్రమోషన్ కార్యక్రమంలోనూ సారా అలీఖాన్ ఎంతో జోష్‌గా పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోరిక మీద పాట పాడుతూ స్టెప్పులతో అదరగొట్టారు. కాగా ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 'ఆత్రంగి రే' చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. చదవండి: ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ -
ఇలా ప్రవర్తించవద్దు.. క్షమాపణలు చెప్పిన హీరోయిన్.. వీడియో వైరల్
Sara Ali Khan Apologizes For Pushing A Photographer: సినిమా వాళ్లు కనపడితే అభిమానులు, మీడియా, ఫొటోగ్రాఫర్లు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోతారు. ఫ్యాన్స్ అని చూడకుండా వారిపై అరుస్తారు, తిడతారు, కొడతారు కూడా. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. తన మృదువు స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోమవారం జరిగిన ఒక ఈవెంట్లో నెట్టివేయబడిన ఒకరి కోసం నిలబడింది సారా. సారా అలీ ఖాన్ రాబోయే చిత్రం 'ఆత్రంగి రే'లోని చక్ చక్ పాటను లాంచ్ చేయడానికి ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఫెస్ట్ 'క్షితిజ్'కు హాజరయింది. వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను నెట్టివేసినట్టున్నారు. అది చూసిన సారా, కారు ఆపి 'ఎవరిని కిందకు తోసారు' అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది. దానికి వారు 'ఎవరూ కింద పడలేదు' అని సమాధానం ఇచ్చారు. దానికి 'లేదు లేదు, మీరు నెట్టేసిన అతను అప్పటికే వెళ్లిపోయాడు.' అని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అనంతరం కారు ఎక్కుతూ ఫొటోగ్రాఫర్స్‌తో 'సారీ చెప్తున్నా, థ్యాంక్యూ' అని చెప్పింది. అలాగే సెక్యూరిటీ గార్డ్స్‌తో 'ఇలా ప్రవర్తించవద్దు. ఎవరినీ నెట్టవద్దు.' అని స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆత్రంగి రే' చిత్రంలోని ఎనర్జిటిక్ ఫస్ట్ సాంగ్ 'చక్ చక్'ని విడుదల చేశారు మేకర్స్. ఉల్లాసభరితమైన ఈ పాటలో సారా నియాన్ గ్రీన్, పింక్ చీర ధరించి బీట్లకు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సౌత్ ఇండియన్ స్టైల్ సెలబ్రేషన్ ఈవెంట్లో సెట్ చేసిన ఈ పాటలో ధనుష్ నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది చదవండి: బాలీవుడ్ బ్యూటీకి ఫ్యాన్ స్పెషల్ గిఫ్ట్.. ఎంత క్యూట్‌గా నవ్విందో.. వీడియో వైరల్ -
సిరాలో తప్ప చట్టాల్లో నలుపు ఎక్కడ?
బస్తి(ఉత్తరప్రదేశ్): వ్యవసాయ చట్టాలను రాయడానికి వినియోగించిన సిరా మాత్రమే నలుపు అని, చట్టాల్లో ‘నలుపు’ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి వి.కె.సింగ్ రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను ఈ నాయకులు పట్టించుకోరా? అని నిలదీశారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పిన మర్నాడు శనివారం కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ విలేకరుల సమావేశంలో రైతు సంఘాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇటీవల ఒక రైతు సంఘం నాయకుడితో తాను జరిపిన సంభాషణని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక్కోసారి మనం విషయాలన్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. కానీ వేరేవరో ఏదో చెప్పగానే గుడ్డిగా వారిని అనుసరిస్తాం. నన్ను కలిసిన ఒక రైతు సంఘం నాయకుడిని నేను ఇదే విషయాన్ని అడిగాను. చట్టాల్ని లిఖించడానికి వాడిన సిరాలో తప్ప నలుపు ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించాను’’ అని వీకే సింగ్ అన్నారు. -
సుధా చంద్రన్ ఆవేదన.. క్షమాపణలు తెలిపిన సీఐఎస్ఎఫ్
సుధా చంద్రన్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ప్రముఖ నాట్యకారణి అయిన సుధా చంద్రన్ ఓ ప్రమాదంలో తన కాలును కోల్పోగా కృత్రియ కాలును అమర్చుకున్నారు. కృత్రిమ కాలుతో కూడా తన నాట్యాన్ని కొనసాగిస్తూ ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల సుధ చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రతిసారి తన కృత్రిమ కాలును తొలగించమని అడుగుతునట్లు సుధా చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’ తాజాగా సుధాచంద్రన్ పట్ల ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రవర్తించి తీరుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్పందించింది. ఈ మేరకు ట్విటర్లో సుధాచంద్రన్‌కు క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్ ప్రకారం విమనాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో కొన్ని అసాధారణ పరిస్థితులలో మాత్రమే కృత్రిమ అవయవాలు కూడా తొలగించి పరిశీలించడం తమ సిబ్బంది విధి అని స్పష్టం చేసింది. అయితే సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా తమ సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. CISF apologises to actor Sudhaa Chandran after she shared a video on being stopped at airport for prosthetic limb. "We'll examine why the lady personnel concerned requested Sudhaa Chandran to remove prosthetics & assure that no inconvenience is caused to travelling passengers." pic.twitter.com/oaVThYB0Lv — ANI (@ANI) October 22, 2021 ఇదిలా ఉండగా.. సుధా చంద్రన్ ఎయిర్‌పోర్టులో తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. నేను ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. -
Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా?
Givenchy Suicide Hoodie Necklace Controversy: ఫ్యాషన్ ప్రపంచం ఓ పద్ధతి ప్రకారం నడవదు. ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుని కొత్తగా, వింతగా అనిపించడమే కాదు.. ఒక్కోసారి ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రాన్స్ దుస్తుల కంపెనీ రూపొందించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ‘బట్టలతో మనుషుల్ని చంపేయగలవ్ తెలుసా?’.. ఇది సినిమా డైలాగ్. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ అది నిజమని నిరూపిస్తోంది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అంటగట్టింది. ఆ దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ విలియమ్స్.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో బ్రిటిష్ దుస్తుల కంపెనీ బర్బెర్రీ 2019లో ఇదే తరహాలో ‘నూస్ హూడీ’(సూసైడ్ హూడీగా ట్రోల్ చేశారు)ని డిజైన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బర్బెర్రీ మోడల్ లిజ్ కెనెడీ ‘సూసైడ్ ఏం ఫ్యాషన్ కాదు’ అంటూ సెటైర్లు వేయడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఆ టైంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మార్కో గోబెట్టి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Diet Prada ™ (@diet_prada) ఇక గివెంచీ చర్యల నేపథ్యంలో ప్యాషన్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ‘డైట్ ప్రదా’ ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన దుస్తుల ఫొటోల్ని కంపేర్ చేస్తూ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేయగా.. దుమారం మొదలైంది. View this post on Instagram A post shared by @liz.kennedy_ చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ను ఆకాశానికెత్తిన అమెజాన్ బాస్ -
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మొసలి కన్నీరు మాని పార్లమెంటులో వారి ప్రవర్తనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రభుత్వం ఎంపీలపై దాడి చేసిందని విపక్షాలు నిరసన ర్యాలీలో విమర్శలు గుప్పించగా దీనికి కౌంటర్‌గా 8 మంది కేంద్ర మంత్రులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యారోపణ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నఖ్వీ, భూపేంద్ర యాదవ్, అర్జున్ మేఘ్వాల్, వి.మురళీధరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాహితంపై వారికి చింతలేదు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘దేశ ప్రజలు తమ సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయని ఆశించారు. దేశ ప్రజల హితం కానీ, రాజ్యాంగ విలువలపై గానీ వారికి చింత లేదు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడే విపక్షాలు సభను నడవనివ్వమన్న సంకేతాలు ఇచ్చాయి. సభను నడవనివ్వబోమని చెప్పేశారు. మేం చాలా సందర్భాల్లో వారితో మాట్లాడాం. కనీసం మొదటి రోజు మంత్రి మండలిలోని నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అనుమతించాలని కోరాం. అందుకు కూడా ఒప్పుకోలేదు. రెండు సభల్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో వారు వారి డిమాండ్లను పెట్టారు. స్వల్పకాలిక చర్చలు జరపాలని కోరారు. ధరల పెరుగుదల, కోవిడ్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చకు చైర్మన్ అనుమతించారు. పెగసస్ వంటి అంశాలను పట్టుబట్టుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభాకార్యకలాపాలకు విఘాతం కలిగించారు. ముఖ్యమైన బిల్లులను కూడా చర్చకు అనుమతించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఎన్ని చేశారో రికార్డులు చూడొచ్చు.. ఆనాడు ఏపీ విభజన వంటి ముఖ్యమైన బిల్లులు కూడా గందరగోళంలో ఆమోదింపజేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘నాలుగో తేదీన ఆరుగురు సభ్యులను సస్పెండ్ చేయగా.. గ్లాసులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులకు గాయాలయ్యేలా చేశారు. రాజ్యసభలో టేబుల్ ఎక్కి ఆందోళన చేశారు. అది బిల్లుపై చర్చ కూడా కాదు. చర్చకు సిద్ధంగా ఉంటే సభను సోమవారం వరకూ నిర్వహిస్తామని చెప్పాం. కానీ వారు సహకరించకపోగా.. ఇన్సూరెన్స్ బిల్లు, ఓబీసీ బిల్లు ఆమోదింపజేసుకుంటే మంగళవారం నాటి పరిణామాల కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడేమో మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేం రాజ్యసభ చైర్మన్‌ను కూడా కోరాం. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం.. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇది పునరావృతం కాకూడదు..’ అని పేర్కొన్నారు. మార్షల్స్‌పై దాడులకు దిగారు: గోయల్ రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. సభ ఆస్తులను ధ్వంసం చేశారని, మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడులకు దిగారని, వారి దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్.. మొత్తం 30 మంది మార్షల్స్ మాత్రమే ఉన్నారని వివరించారు. విపక్షాలది కేవలం డ్రామా అని, ఓబీసీ బిల్లు విషయంలో కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చర్చను సాగనిచ్చారని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ మంత్రులంతా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యని కలిసి సభలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దురదృష్టకరమైన రీతిలో ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బయటివారెవరూ లేరు.. ఉభయ పక్షాలు తనతో భేటీ అయిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి మంగళవారం నాటి పరిణామాలను మరోసారి ఆరాతీశారు. బయటివారెవరూ సభలోకి రాలేదని, తొలుత 14 మంది మార్షల్స్ ఉన్నారని, క్రమంగా సభలో పరిస్థితిని బట్టి మార్షల్స్ సంఖ్య 42కు చేరిందని వారు చైర్మన్‌కు నివేదించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే! పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సభాకార్యకలాపాలకు కొందరు ఎంపీలు విఘాతం కలిగించిన తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తను సహించకూడదని, తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చోటుచేసుకున్న దురదృష్టకరమైన సంఘటనలను సమీక్షించేందుకు గురువారం వీరిద్దరూ సమావేశమయ్యారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. సభాపతులు పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ అత్యున్నత చట్టసభ హుం దాతనాన్ని దిగజార్చేలా వ్యవహరించారని వీరిరువూ అభిప్రాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల ను, తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తు కార్యాచరణకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సభాపతులు అభిప్రాయపడ్డారు. -
తీవ్ర దుమారం.. క్షమాపణలు చెప్పిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన సెక్సియెస్ట్ కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు. లంక, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే సందర్భంగా.. కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ చేసిన ‘బ్యాట్లు- పక్కవాళ్ల భార్య’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. తప్పుడు ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయలేదు. కావాలని చేసిన కామెంట్లు ఎంతమాత్రం కావు. కానీ, తప్పు జరిగిపోయింది. అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఈ విషయంపై నా తల్లి, భార్య కూడా నన్ను తిట్టారు. సారీ.. ఇంకోసారి తప్పు జరగదు’ అంటూ ఆదివారం ఒక సందేశం విడుదల చేశాడు దినేశ్ కార్తీక్. కాగా, 36 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కమ్ వికెటకీపర్ భారత్ తరపున 94 వన్డేలు, 32 టీ20లు, 26 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన దినేశ్.. అందులోనూ అదరగొడుతుండడం విశేషం. ‘ప్లేయర్స్ తమ బ్యాట్స్ కంటే అవతలి వాళ్ల బ్యాట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారని, అవి పక్కవాళ్ల భార్యల్లాంటివేనని. ఆకర్షణనీయంగా ఉంటాయని, అందుకే ఆకర్షితులు అవుతార’ని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దినేశ్ కార్తీక్. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 -
కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ న్యూజిలాండ్ జట్టుకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవలే ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మొదలవ్వకముందు టీమిండియానే విజేతగా నిలుస్తుందని పైన్ అంచనా వేశాడు. కానీ అతని అంచనాలకు భిన్నంగా కివీస్ సూపర్ విక్టరీ సాధించి టెస్టు చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో కివీస్‌ను అభినందించిన పైన్ తన అంచనా తప్పినందుకు క్షమించాలంటూ న్యూజిలాండ్‌ను కోరాడు. ''ఒక్కోసారి మనం వేసుకునే అంచనాలు తప్పడం సహజమే. ఏడాదిన్నరగా టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉండడంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను భారత్ గెలుస్తుందని అంచనా వేసుకున్నా. కానీ నేను అనుకున్నదానికంటే కివీస్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. నిజానికి కివీస్‌కు కీలక మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న విలియమ్సన్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టింది. ఒక చిన్న ద్వీపంలా కనిపించే కివీస్ ఈ అద్భుత ఫీట్‌ను సాధించడం ఆనందంగా ఉంది. నా అంచనా తప్పినందుకు మరోసారి క్షమాపణ అడుగుతున్నా'' అంటూ ముగించాడు. ఇదే టిమ్ పైన్ గతంలో టీమిండియా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచినప్పుడు.. టీమిండియా మమ్మల్ని మోసం చేసి సిరీస్ గెలిచిదంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కివీస్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. చదవండి: కోహ్లి.. ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ టీమిండియా చీటింగ్ చేసి సిరీస్ గెలిచింది: పైన్ -
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో చేసిన స్కిట్‌పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం దీనిపై ఫోన్‌కాల్‌లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి తాము కావాలని చేసినవి కావు అని హైపర్ ఆది తెలిపారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు. చదవండి: హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
Jeffrey Toobin: నా చేష్టల్ని సమర్థించుకోలేను!
న్యూయార్క్: అమెరికా న్యూస్ పర్సనాలిటీ జెఫెర్రె టూబిన్ ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి నుంచి ప్రముఖ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్లో లీగల్ అనలిస్ట్‌గా ఆయన పని చేయనున్నారు. పోయినేడాది అక్టోబర్‌లో జూమ్ కాల్లో ఆయన అసభ్య చేష్టలకు పాల్పడడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ చర్యతో ది న్యూయార్కర్ ఆయన్ని అనధికారికంగా విధుల నుంచి తప్పించింది. కాగా, తన చేష్టలకు ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ కొత్త విధుల్ని ప్రారంభించడం విశేషం. ‘‘ఆరోజు నేను చాలా మూర్ఖంగా నేను ప్రవర్తించా. ఇతరులు చూస్తారనే ధ్యాస నాకు లేదు. నా కుటుంబానికి, సహచర జర్నలిస్టులకు, అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. నా చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించుకోలేను. ఆ ఘటన తర్వాత మామూలు మనిషిగా మారేందుకు టైం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం థెరపీ తీసుకున్నా. ఒక ఫుడ్ బ్యాంక్‌లో పని చేశా. ఓక్లాహోమా సిటీ పేలుళ్ల గురించి ఒక బుక్ రాయడంలో లీనమయ్యా’’ అని 61 ఏళ్ల టూబిన్ చెప్పుకొచ్చాడు. కాగా, అక్టోబర్ 19, 2020న న్యూయార్కర్, డబ్ల్యూఎన్వైసీ రేడియో స్టాఫర్స్ మధ్య జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. టూబిన్ తన వ్యక్తిగత వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ, హస్తప్రయోగం చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన న్యూయార్కర్.. ఆయన్ని విధుల నుంచి దూరంగా ఉంచింది. కాగా, దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూయార్కర్‌తో అనుబంధం ఉన్న టూబిన్.. జూమ్ చేష్టల ద్వారా జర్నలిజానికి మాయని మచ్చ వేశాడంటూ జిమ్మీ ఫాలోన్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ లాంటి ప్రముఖులు.. శాటర్ డే నైట్ లైవ్ ప్రోగ్రాం దుమ్మెత్తిపోశారు. లా స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే మానవీయ కోణంలో ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు దక్కించుకున్నాడు టూబిన్. -
నా తప్పే.. క్షమించండి: హర్భజన్ సింగ్
వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్ వేర్పాటువాది బింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్. ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్‌వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్ సింగ్‌ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ. అది కేవలం వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్ చేశాడు. My heartfelt apology to my people..🙏🙏 pic.twitter.com/S44cszY7lh — Harbhajan Turbanator (@harbhajan_singh) June 7, 2021 ‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్‌ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్ సింగ్. అయితే నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది కూడా. చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా? -
గూగుల్ నిర్వాకం.. కన్నడ ప్రజలు ఫైర్
బెంగళూరు: కన్నడ భాషకు సంబంధించి గూగుల్ సెర్చ్ ఫలితాలు నెట్టింట దుమారం రేపుతోందనే చెప్పాలి. ఇటీవల మనకి ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేయడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏంటని గూగుల్‌లో సెర్చ్ చేస్తే సమాధానంగా.. భారతదేశంలో వికారమైన భాష ఏమిటి? దీనికి సమాధానం కన్నడ, దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాషని చూపించింది. దీనిపై కన్నడ ప్రజలు, రాజకీయ ప్రతినిధులు కూడా గూగుల్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని పై బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. ఆయన తన ట్వీట్లో.. విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కూడా ఒకటని తెలిపారు. 14 శాతాబ్దంలో జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయన్నారు. అయినా ఇలా ఓ భాషను అవమానించడం గూగుల్ లాంటి ప్రముఖ సంస్థకు తగదని సూచించారు. ఇందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు. కన్నడ కంటే మంచి భాషా ఎదో చెప్పాలని అని ఒకరు ప్రశ్నించగా.. మరికొందరు గూగుల్‌ను భారత్‌లో బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Home to the great Vijayanagara Empire, #Kannada language has a rich heritage, a glorious legacy and a unique culture. One of the world’s oldest languages Kannada had great scholars who wrote epics much before Geoffrey Chaucer was born in the 14th century. Apologise @GoogleIndia. pic.twitter.com/Xie927D0mf — P C Mohan (@PCMohanMP) June 3, 2021 Show me a beautiful and better language than #Kannada i will wait 😇#KannadaQueenOfAllLanguages pic.twitter.com/muPkrn9Ik2 — Hemanth Shaiva 2.0 (@Hemanth__Shaiva) June 3, 2021 చదవండి: అక్కడ 295 గ్రామాల్లో కరోనా కేసులు లేవు.. ఇదే కారణమట -
తెల్లవారుజామున ఇంటి డోర్ కొట్టి క్షమాపణ చెప్పాడు
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ దూకుడుకు మారుపేరు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బాదుడే లక్ష్యంగా పెట్టుకునే పంత్ ఇటీవల జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ధోని స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమవుతున్న పంత్ తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తాడు. ఇటీవలే దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాడు. ఇదిలా ఉండగా.. పంత్ తాను ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకునేవరకు అతను నిద్రపోడని పంత్ చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సమయంలో పంత్ తప్పు చేస్తే తాను తిట్టానని.. తెల్లవారుజామున నా ఇంటి తలుపులు కొట్టి నాకు క్షమాపణ చెప్పాడంటూ తారక్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాజాగా తారక్ ఒక ఇంటర్య్వూలో గుర్తుచేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో పుట్టి పెరిగిన పంత్ క్రికెట్‌ను మాత్రం ఢిల్లీలోని ఐకానిక్ క్లబ్ ఆఫ్ సొన్నెట్‌లో నేర్చుకున్నాడు. తన చిన్నతనంలో ఎక్కువ శాతం ప్రాక్టీస్‌ను ఇక్కడే చేశాడు. ఆ సమయంలో తారక్ సిన్హా ఆ క్రికెట్ క్లబ్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఒకరోజు ప్రాక్టీస్ సమయంలో నెట్ సెషన్లో పంత్ ప్రవర్తనపై కోపం వచ్చి అతన్ని తిట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. కాగా తారక్ వైశాలి ప్రాంతంలో ఉంటున్నారు. పంత్ ఉంటున్న ప్రాంతానికి చాలా దూరంలో ఉంటుంది. కోచ్‌ను అప్సెట్ చేసినందుకు ఫీలైన పంత్ ఆరోజు నిద్రపోలేదు. మరుసటిరోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కారులో వైశాలిలోని తారక్ ఇంటికి వెళ్లాడు. వారి ఇంటి డోర్ కొట్టి అతనికి తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పాడు. దీంతో తారక్ పంత్‌ను లోపలికి తీసుకెళ్లి.. ''ఈ విషయం రేపు పొద్దున మాట్లాడేవాళ్లం కదా.. అయిన తప్పు నాది కూడా ఉంది.. నీతో అంత హార్ష్‌గా వ్యవరించాల్సింది కాదు.'' అని సిన్హా పంత్‌కు తెలిపాడు. ఇక 2017లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన పంత్ క్రమంగా జట్టులో సుస్థిర స్థానం సంపాదిస్తున్నాడు. గతేడాది ఆసీస్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో పంత్ ఆడిన నాకౌట్ ఇన్నింగ్స్(89 నాటౌట్)ఎప్పటికి గుర్తుండిపోతుంది.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ పంత్ నిలకడగా రాణించాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున పంత్ 20 టెస్టుల్లో 1358 పరుగులు, 18 వన్డేల్లో 529 పరుగులు, 33 టీ20ల్లో 512 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ జట్టును విజయవంతంగా నడిపించాడు. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: టీమిండియాలో అత్యంత ప్రమాదకర ఆటగాడు అతనే.. -
అరెస్ట్‌కి డిమాండ్.. దణ్ణం పెట్టిన యువిక
సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్. ఈ మేరకు ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్‌కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ యువిక. ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్ ఆడియొన్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో రెండు రోజులగా హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్ మున్ దత్తా యూట్యూబ్‌లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -
బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్
ఇండియన్ ఐడల్ 12వ సీజన్ మరో వివాదంలో చిక్కుకుంది. గత వారం జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ ఆదిత్య నారయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎపిసోడ్లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు అమిత్ కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇదే ఎపిసోడ్లో కంటెస్టెంట్ సవాయ్ భట్, అంజలి గైక్వాడ్‌తో కలిసి ఓ సూపర్ హిట్ పాటను పాడి వినిపించారు. వీళ్ల పర్ఫార్మెన్స్ పూర్తయ్యాక సవాయ్ భట్‌కు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని గెస్ట్ ఒకరు ప్రశ్నించగా లేదు లేదు అని సవాయ్ భట్ సమాధానం చెప్పాడు. అయితే మరో కంటెస్టెంట్ మాత్రం సవావ్ భట్‌కు జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ ఉందని, ఆమెతో తరుచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటాడని చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. ఇదే విషయంపై యాంకర్ ఆదిత్య నారాయణ్.. ఎవరా జపనీస్ గర్ల్‌ఫ్రెండ్ అని ప్రశ్నించగా సవాయ్ భట్ అదేం లేదు అని దాటవేసే ప్రయత్నం చేయడంతో..నువ్వు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మడానికి మేము అలీభగ్ నుంచి ఏం రాలేదు అంటూ ఫన్నీగా ఆటపట్టించాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఆదిత్య మెడకు చెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని అలీభగ్ ప్రజలను అవమానించేలా ఆదిత్య వ్యాఖ్యలు ఉన్నాయని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) మండిపడింది. వెంటనే అలీభగ్ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆదిత్య నారాయణ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. 'రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్ధేశం కానే కాదు. అలీభగ్ ప్రజలపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొన్నారు. చదవండి : ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్ ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి
-
చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి
వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. తనకు మంచిపేరు తెచ్చిపెట్టిన 'శబ్బాష్ రా శంకరా' కవితలే ఇప్పుడు ఈ విమర్శలకు తావు తీశాయి. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించిన ఆయన దీనికి కొనసాగింపుగా ఫేస్బుక్ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆయన అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. "ఫేస్బుక్లో పోస్ట్ చేసిన శబ్బాష్ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొందరి మనసులను నొప్పించాయి. ఆ కవితకు వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది. కాబట్టి అలాంటిదేం చేయకుండా నొప్పించినందుకు నా చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా. ఆ పోస్టు కూడా డిలీట్ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మన్నించండి" అని తనికెళ్ల భరణి కోరాడు. చదవండి: ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది: తనికెళ్ల భరణి ఆనందంలో మునిగితేలుతున్న అల్లు శిరీష్ -
IPL2021: దిగొచ్చిన స్టైరిస్, చెన్నై జట్టుకు క్షమాపణలు
ఐపీఎల్ సీజన్ మొదలయ్యాక ఆటగాళ్లు తమ ఆటతో వార్తల్లో నిలుస్తారు, కానీ ప్రస్తుతం మాత్రం వాళ్లు తమ మాటలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల చెన్నై జట్టు మాజీ ఆటగాడు, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ఐపీఎల్ 2021 ప్రిడిక్షన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే పాయింట్ల పట్టికలో ముంబై మొదటి స్థానంలో ఉంటుందని చెప్పిన, స్టైరిస్.. చెన్నై ఈసారి చివరిలో నిలుస్తుందని పేర్కొన్నాడు. అతని వ్యాఖ్యలపై చెన్నై అభిమానులు, ఆటగాళ్లు హర్ట్ అయ్యారు. స్టైరిస్ ప్రిడిక్షన్‌పై స్పందించిన సీఎస్కే ఫ్రాంచైజీ కౌంటర్ ఎటాక్ చేస్తూ.. తమ మాజీ ఆటగాడికి సీఎస్కేపై కోపం ఎందుకో అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ‘మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా’ అంటూ స్టైరిస్ కోపంతో ఉన్న ఫొటో ఒకదానిని ట్వీట్ చేసింది. చెన్నై ఫ్రాంచైజీ కౌంటర్ నేపథ్యంలో స్టైరీస్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. చెన్నైని తక్కువ చేసినందుకు సీఎస్కే యాజమాన్యాన్ని క్షమాపణలు కోరుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నాడు. ‘నన్ను నేను మందలించుకుంటున్నాను’ అని తెలిపాడు. కాగా, దుబాయ్‌లో జరిగిన గత ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. చివరలో వరుస విజయాలు సాధించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో తొలిసారి ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఈక్రమంలోనే ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే తాజా ఐపీఎల్లో ఆఖరి స్థానంలోనే నిలుస్తుందని స్కాట్ స్టైరిస్ జోస్యం చెప్పినట్టున్నాడు. ( చదవండి: అతను దూరమవడానికి పుజారా కారణమా! ) I consider myself reprimanded. Super coach @SPFleming7 has already told me off 🤣🤣🤣 pic.twitter.com/T0Sod0t58T — Scott Styris (@scottbstyris) April 4, 2021 -
సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో వ్యక్తిగత దూషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌పై అక్రమ సంబంధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై రాజా మళ్లీ స్పందించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం పడుతున్నట్లు రాజా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెపాక్‌లో ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళని ఆదివారం స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని ప్రచార సభలో పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఏ.రాజ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం వ్యక్తిగతం కాదు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశా’ అని రాజా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు అన్నాడీఎంకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
వీడియోకాల్ మాట్లాడుతుండగా నటి రూమ్‌లోకి..
న్యూఢిల్లీ: జీవితం అంటేనే అనుభవాల సమాహారం. వాటిల్లో కొన్నిమంచివైతే, మరికొన్ని బాధ కల్గించేవిగా ఉంటాయి. అయితే బాధ పడ్డ సంఘటనలు మాత్రం జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తన జీవితంలో కూడా ఇలాంటి చేదు అనుభవం ఉంది అంటున్నారు బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరోజి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్నాజ్ గతంలో ఓ సినిమా షుటింగ్‌లో భాగంగా గోవాకి వెళ్లారు. షుటింగ్ ముగిసిన తర్వాత స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. అక్కడ కొన్నిరోజులు సరదాగా గడపాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి నటి తన మిత్రుడి బర్త్‌డే పార్టీకి హజరయ్యారు. ఇంటికి వచ్చాక ఎల్నాజ్ తన తల్లితో వీడియోకాల్ మాట్లాడుతున్నారు. ఎల్నాజ్ ఫోన్ మాట్లాడుతూ.. తన గదిలోని కిటికి నుంచి బైటకు చూసి.. షాకయ్యారు. ఏవరో ఆగంతకుడు సెక్యురిటీని దాటి, వారి ఇంటిలోకి ప్రవేశించాడు. కంగారు పడిన ఆమె దీని గురించి తన మిత్రుడికి చెప్పింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు కేవలం ఎల్నోజ్ని కలవడానికి వచ్చాడని.. ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసుల విచారణలో బయటపడింది. మరోసారి ఇలాంటి పనులు చేయనని ఆ వ్యక్తి లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరడంతో అతడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుంది. అయితే ఇప్పటికి ఆరోజు గుర్తుచేసుకుంటే భయమేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎల్నోజ్. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు -
దలాల్ నోరు అదుపులో పెట్టుకో: కాంగ్రెస్ నేత
చండీగఢ్: రైతుల ఆందోళనలతో దేశం అట్టుడుకుతున్న తరుణంలో హర్యానా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రాణాలు విడిచిన రైతుల పట్ల ఆయన నోరు జారారు. ఒక టీవీ ఇంటర్యూలో రిపోర్టర్... ‘గత ఆరు నెలల్లో నిరసనల్లో పాల్గొన్న దాదాపు 200 మంది రైతులు మరణించారు. దీనిపై ‘మీ స్పందనేంటి’ అని ప్రశ్నించగా దలాల్ వ్యంగ్యంగా స్పందించారు. రైతులు ఇళ్లల్లో ఉన్నా చనిపోయేవారు.. వారందరూ గుండెపోటు, వేరే అనారోగ్యకారణాలతో చనిపోయారని చెప్పుకొచ్చారు. దాంతో మంత్రి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చుకున్న సదరు మంత్రి.. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కొరుతున్నానని అన్నారు. కాగా, కాంగ్రెస్ లీడర్ రణదీప్ సింగ్ సుజ్రేవాల ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా దలాల్ వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ లీడర్ రాజ్‌కుమార్ వెర్కా దలాల్‌ను కెబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


