ఖలీస్తాన్​ తీవ్రవాదిపై పోస్ట్​.. భజ్జీని వదలని నెటిజన్స్

​​Harbhajan Singh Apologises For Post On Khalistan Jarnail Bhindranwale - Sakshi

వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్​. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్​ వేర్పాటువాది బింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్​స్టాగ్రామ్​లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్​లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్. 

ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది.  ఆపరేషన్​ బ్లూస్టార్​కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో  జర్నెయిల్​ సింగ్​ బింద్రన్‌వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్​ సింగ్​ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్​లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ.  అది కేవలం వాట్సాప్​లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్​ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్​ చేశాడు.

‘‘ఇన్​స్టాగ్రామ్​లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్​లో ఫార్వర్డ్​ అయిన మెసేజ్​. కంటెంట్​ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం​ కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్​ సింగ్. 

అయితే నెటిజన్స్​ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్​ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్​ సింగ్ పేరు ట్విట్టర్​లో ట్రెండ్ అవుతోంది కూడా.

చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా?

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top