లార్డ్‌ స్వరాజ్‌పాల్‌ కన్నుమూత | NRI Industrialist Caparo Group Lord Swraj Paul passe away | Sakshi
Sakshi News home page

లార్డ్‌ స్వరాజ్‌పాల్‌ కన్నుమూత

Aug 23 2025 6:30 AM | Updated on Aug 23 2025 8:05 AM

NRI Industrialist Caparo Group Lord Swraj Paul passe away

ప్రధాని మోదీ సంతాపం 

లండన్‌/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్‌ స్వరాజ్‌ పాల్‌ (94) లండన్‌లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్‌పాల్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు.

 బ్రిటన్‌–భారత్‌ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్‌ పాల్‌ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్‌ అని తెలిపారు. 1966లో  కుమార్తె చికిత్స కోసం బ్రిటన్‌ వెళ్లిన లార్డ్‌ పాల్‌ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్‌ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఏషియన్‌గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement