శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే మరింత పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,27,150 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మరో 550 రూపాయలు పెరిగింది. దీంతో రేటు రూ. 1,27,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 600 పెరగడంతో రూ. 1,39,310 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నై నగరంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,000 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,640 వద్ద ఉంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. సాయంత్రానికే పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,27,850 వద్ద (1200 రూపాయలు పెరిగింది) .. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,460 వద్ద (1310 రూపాయలు పెరిగింది)కు చేరింది.


