breaking news
Indian industrialists
-
స్వయం శక్తి
ఆకాశమంతా నాదే... అంటూ విహరించే విహంగాన్ని ఒక మూల పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుంది! స్మిను జిందాల్‌కు కూడా అలాగే అనిపించింది. పదకొండు సంవత్సరాల వయసులో యాక్సిడెంట్‌కు గురైంది. అలా అని వీల్‌చైర్‌కే పరిమితం కాలేదు. ఎన్నో పరిమితులు అధిగమించి పారిశ్రామిక వేత్తగా ఎదిగింది. ‘ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్–2025’ జాబితాలో చోటు సాధించింది...దిల్లీలో ఎలిమెంటరీ స్కూల్ చదువు పూర్తయిన తరువాత జైపూర్‌లోని ప్రతిష్ఠాత్మకమైన మహారాణి గాయత్రీ దేవి స్కూల్లో చేరిన స్మిను కారు ప్రమాదంలో ప్రాణా పాయం నుంచి బయటపడింది. చదువు, ఆటలు, పాటలతో ఎప్పుడూ చురుగ్గా ఉండే అమ్మాయికి కొన్ని నెలల పాటు వీల్‌చైర్‌కే పరిమితం కావడం సంకెళ్లతో బంధించినట్లుగా అనిపించింది. తన రెక్కలు ఎవరో కత్తిరించినట్లుగా అనిపించింది.స్మినుకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కథక్ నృత్యంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘ఇక నేను డ్యాన్స్ చేయలేనా?’ అనే బాధ ఉండేది. అయితే తల్లిదండ్రులు మాత్రం ‘నీకేం జరగలేదు. అన్నీ సర్దుకుంటాయి’ అంటూ ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. స్మినులో ఆత్మవిశ్వాసం పెంచేలా ఎంతోమంది వ్యక్తుల నిజజీవిత గాథలు చెబుతుండేది తల్లి ఆర్తి. బిడ్డను నార్మల్ స్కూల్‌కే పంపించేది. ‘అమ్మానాన్నలు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అలా అని అతి గారాబం చేసేవారు కాదు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది స్మిను. కొంతకాలం తరువాత తల్లిదండ్రులు స్మిను కోసం ఒక మెషిన్ తీసుకువచ్చారు. ఆ మెషిన్ సహాయంతో రోజుకు కొన్ని గంటలు నిలబడేది. దిల్లీలోని శ్రీరామ్ కాలేజి ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ చేసిన స్మిను ‘జిందాల్ సా లిమిటెడ్’లో మేనేజ్మెంట్ ట్రైనీ స్థాయి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరింది. స్మిను జిందాల్ పేరు పక్కన ‘ప్రముఖ పారిశ్రామికవేత్త’ అనే గౌరవం రావడానికి ఎంతోకాలం పట్టలేదు.దివ్యాంగులకు దిశానిర్దేశం, సహాయపడడం లక్ష్యంగా ‘స్వయం’ అనే సంస్థను ప్రారంభించింది. ప్రభుత్వసంస్థలు, విద్యాసంస్థలు, రవాణా సంస్థలతో కలిసి పని చేస్తోంది స్వయం. ‘దివ్యాంగులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి గురించి చాలామందికి తెలియదు. స్వయం పోర్టల్ ద్వారా దివ్యాంగులకు ఉపయోగడే ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నాం. టూరిజం, స్పోర్ట్స్, శానిటేషన్... మొదలైన రంగాలలో ఇప్పుడు స్వయం పనిచేస్తోంది’ అంటుంది స్మిను. దివ్యాంగులకు మాత్రమే కాదు వృద్ధులు, గర్భిణులు... మొదలైనవారికి ‘స్వయం’ సహాయపడుతోంది. ‘విమానాశ్రయాలు, హోటల్స్, స్టేడియంలాంటి ఎన్నో బహిరంగ ప్రదేశాలలో దివ్యాంగులకు కనీస సదు పాయాలు లేవు’ అంటున్న స్మిను జిందాల్ ‘యాక్సెసబిలిటీ చాంపియన్’గా పేరు తెచ్చుకుంది.‘క్షణం తీరిక లేని వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు?’ అనే ప్రశ్నకు జిందాల్ ఇచ్చిన సమాధానం... ‘పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పనే పాషన్‌గా మారినప్పుడు అలసటగా అనిపించదు. నన్ను అర్థం చేసుకునే కుటుంబం దొరకడం నా అదృష్టం. సరిౖయెన ప్రణాళిక ఉంటే వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కష్టమేమీ కాదు’. ఎన్నో సవాళ్లు... అయినా సరే...ఒకటి రెండు అని కాదు... ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. యాక్సిడెంట్ తరువాత జీవనశైలిని పునర్నిర్మించుకోవడం నుంచి పురుషాధిపత్య రంగాలుగా భావించే స్టీల్, ఆయిల్, గ్యాస్ సెక్టార్లలో విజయం సాధించడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఒక విధంగా చెప్పాలంటే నన్ను ప్రోత్సహించిన వారే కాదు నిరాశ పరిచిన వారు కూడా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి తోడ్పడ్డారు. ‘నీ వల్ల కాదు’ అని ఎవరైనా అంటే ఆ మాటలను సవాలుగా తీసుకొని చేసి చూపించేదాన్ని.– స్మిను జిందాల్ -
ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పటిష్టం
న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో భారత్–అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పటిష్టం కాగలవని దేశీ పరిశ్రమ దిగ్గజాలు ఆశాభావం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, ఫార్మా, ఎల్రక్టానిక్స్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మరిన్ని అమెరికా ఉత్పత్తులను దేశీ మార్కెట్లో అనుమతించడం, స్టార్‌లింక్.. టెస్లాకు స్వాగతం పలకడం, అమెజాన్ విషయంలో ఉదారంగా వ్యహరించడం మొదలైనవి భారత్ చేయాల్సి రావచ్చని .. ట్రంప్ ప్రమాణానికి కొద్ది గంటల ముందు ఎక్స్‌లో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా పోస్ట్ చేశారు. దీనికి ప్రతిగా ఏరోస్పేస్ .. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు సహకరించడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతునివ్వడం, భారతీయులకు వీసా నిబంధనలను సడలించడం మొదలైనవి ట్రంప్ చేయొచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపరంగా ట్రంప్ తొలి విడత పాలన సానుకూలంగానే ఉండేదని, ఆయన తిరిగి అధికారం చేపట్టడంతో ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్‌డీసీసీఐ డిప్యుటీ సెక్రటరీ జనరల్ ఎస్పీ శర్మ తెలిపారు. ఫార్మా పరిశోధనలు, తయారీ మొదలైన అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను పరిశీలించవచ్చని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని, స్మార్ట్ఫోన్లు .. ఎల్రక్టానిక్స్ మొదలైన ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్యం గణనీయంగా పెరగవచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అమెరికా డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నిస్తే భారత్ కూడా భాగంగా ఉన్న బ్రిక్స్ కూటమిపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో దేశీ కార్పొరేట్ల ఆశాభావం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
అభివృద్ధికి కలసి రండి
ప్రవాస భారతీయ సీఈవోలతో సీఎం సాక్షి, అమరావతి: రెండంకెల వృద్ధితో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలని అమెరికాలోని భారతీయ సీఈవోలను సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర సుస్థిర వృద్ధికోసం వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం మూడోరోజు శనివారం శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య, సాంకేతిక ప్రముఖులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సముపార్జిం చిన జ్ఞానాన్ని, అనుభవాన్ని జన్మభూమికి వెచ్చించాలని కోరారు. అనంతరం సిలికానాంధ్ర యూనివర్సిటీని సందర్శించి అక్కడ తెలుగు సంస్కృతి, భాషా సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో ‘అమరావతి స్కూల్ ఆఫ్ తెలుగు లింగ్విస్టిక్స్’ ఏర్పాటు కోసం రూ.6 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తర్వాత టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ వెళ్లిన సీఎం స్థానిక తెలుగువారినుద్దేశించి మాట్లాడారు. అనంతరం డల్లాస్‌లోని ఉన్న మహాత్ముని విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ.. తదుపరి సీఎం ప్రీమియర్, గ్లోబల్ ఔట్లుక్, టెక్‌ప్రోస్ సాప్ట్వేర్, ఆర్కస్ టెక్, శ్రీటెక్, మద్ది సాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన స్థలాలు కేటాయిస్తే కార్యకలాపాల నిర్వహణకు యత్నిస్తామని వారు చెప్పారు. సీఎం బృందంతో డెల్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య కూడా సమావేశమయ్యారు. బెల్ హెలికాప్టర్ కంపెనీ డైరెక్టర్ చాద్ స్పార్క్స్ ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.