ఎవరెస్టుని అధిరోహించిన ఎందరో సాహస వీరులు, నారీమణలు గురించి విన్నాం. అందుకోసం ఎంతో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అంత కష్టపడ్డా తీర ఎవరెస్టుని అధిరోహిస్తుండగా వాతావరణం ప్రతికూలంగా ఉంటే మధ్యలోనే వెనుతిరగాల్సిందే..అంత కష్టమైనది ఎవరెస్టుని అధిరోహించడం. ఒకపక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు ప్రమాదకరమైన డెత్ జోన్‌లు, అననూకూలమైన వాతావరణం వంటి సవాళ్లను ఓర్చుకుంటేనే..అధిరోహించడం సాధ్యమవుతుంది.
ఇలానే ఓ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వెళ్లి ..అననూకూలమైన వాతావరణంతో పాపం వెనుదిరగక తప్పకలేదు. అందుక సంబంధించిన అనుభవాన్ని నెట్టింట షేర్ చేయడంతో ఇంత కష్టసాధ్యమైనదా ఎవరెస్టుని ఎక్కడం అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల బియాంకా అడ్లర్ ఈ ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆమె శిఖరానికి దాదాపు 400 మీటర్ల 8,450 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అక్కడకి చేరుకున్న తర్వాత క్లిష్టమైన వాతావరణం కారణంగా వెనుదిరగక తప్పలేదు బియాంకాకి. దాంతే బేస్ క్యాంప్‌కి చేరుకుంది. అక్కడకు చేరుకున్నాక..తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రికార్డు చేసి మరి పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో తాను బేస్ క్యాంపులో ఉన్నానని, భయంగా ఉందంటూ మాట్లాడింది. తన మెడ, గొంతు, ఊపిరితిత్తులు చాలా నొప్పిగా ఉన్నాయని..ఊపిరి ఆడటం లేదంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది. క్యాంప్4, క్యాంప్2 సమావేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల బాగోక పోవడంతో మూడు రాత్రులు అనంతరం బేస్ క్యాంప్‌కి తిరిగి వచ్చింది. ఇక్కడ తనకు చాలా భయంకరంగా అనిపిస్తోందని బాధగా చెప్పింది. ఒకపక్క దగ్గుతూ, ముఖం మంతా ఎర్రగా కందిపోయి, అనారోగ్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో.
అంతేగాదు ఆ వీడియోకి ఎవరెస్టులో మూడు రోజుల అనంతరం డెత్ జోన్ నుంచి తిరిగి వచ్చా అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు సైతం ఎవరెస్టు ఎత్తులో శరీరం ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టారు. అయినా పర్వతారోహణలో చేయగలిగిందంతా ఇప్పటి వరకు చేశారు అందుకు మీకు హ్యాట్సాఫ్ అని పోస్టులు పెట్టారు మరికొందరు.
(చదవండి: అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా?)


