breaking news
Everest Climbed
-
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఇంత కష్టం ఉంటుందా..?
ఎవరెస్టుని అధిరోహించిన ఎందరో సాహస వీరులు, నారీమణలు గురించి విన్నాం. అందుకోసం ఎంతో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అంత కష్టపడ్డా తీర ఎవరెస్టుని అధిరోహిస్తుండగా వాతావరణం ప్రతికూలంగా ఉంటే మధ్యలోనే వెనుతిరగాల్సిందే..అంత కష్టమైనది ఎవరెస్టుని అధిరోహించడం. ఒకపక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు ప్రమాదకరమైన డెత్ జోన్లు, అననూకూలమైన వాతావరణం వంటి సవాళ్లను ఓర్చుకుంటేనే..అధిరోహించడం సాధ్యమవుతుంది. ఇలానే ఓ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వెళ్లి ..అననూకూలమైన వాతావరణంతో పాపం వెనుదిరగక తప్పకలేదు. అందుక సంబంధించిన అనుభవాన్ని నెట్టింట షేర్ చేయడంతో ఇంత కష్టసాధ్యమైనదా ఎవరెస్టుని ఎక్కడం అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లుఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 17 ఏళ్ల బియాంకా అడ్లర్ ఈ ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆమె శిఖరానికి దాదాపు 400 మీటర్ల 8,450 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అక్కడకి చేరుకున్న తర్వాత క్లిష్టమైన వాతావరణం కారణంగా వెనుదిరగక తప్పలేదు బియాంకాకి. దాంతే బేస్ క్యాంప్‌కి చేరుకుంది. అక్కడకు చేరుకున్నాక..తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రికార్డు చేసి మరి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను బేస్ క్యాంపులో ఉన్నానని, భయంగా ఉందంటూ మాట్లాడింది. తన మెడ, గొంతు, ఊపిరితిత్తులు చాలా నొప్పిగా ఉన్నాయని..ఊపిరి ఆడటం లేదంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది. క్యాంప్4, క్యాంప్2 సమావేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల బాగోక పోవడంతో మూడు రాత్రులు అనంతరం బేస్ క్యాంప్‌కి తిరిగి వచ్చింది. ఇక్కడ తనకు చాలా భయంకరంగా అనిపిస్తోందని బాధగా చెప్పింది. ఒకపక్క దగ్గుతూ, ముఖం మంతా ఎర్రగా కందిపోయి, అనారోగ్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి ఎవరెస్టులో మూడు రోజుల అనంతరం డెత్ జోన్ నుంచి తిరిగి వచ్చా అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు సైతం ఎవరెస్టు ఎత్తులో శరీరం ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టారు. అయినా పర్వతారోహణలో చేయగలిగిందంతా ఇప్పటి వరకు చేశారు అందుకు మీకు హ్యాట్సాఫ్ అని పోస్టులు పెట్టారు మరికొందరు. View this post on Instagram A post shared by Bianca Adler (@bianca_adler1) (చదవండి: అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా?) -
AP: అక్షజ్ ఘనత.. ఆరేళ్లకే ఎవరెస్ట్ అధిరోహణ
ఒంగోలు టౌన్: ఒంగోలుకు చెందిన ఓ చిన్నారి ఎవరెస్ట్ ఎక్కాడు. ఆ చిన్నోడి ధైర్య సాహసాలు మెచ్చుకున్న నేపాల్ రాయబారి ఎవరెస్ట్ డే రోజున అవార్డుతో సత్కరించారు. ఒంగోలులోని సంతపేటకు చెందిన వెలగపూడి వెంకటరమణ ఏపీ ట్రాన్స్‌కో లో ఎస్ఈ గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన అల్లుడు అమిత్, కూతురు అనురాధ ఇంజినీర్లుగా మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి అక్షజ్ ఉడియావాల(6) అనే కుమారుడున్నాడు. అక్షజ్ గతేడాది ఎవరెస్ట్ శిఖరంలోని బేస్ క్యాంపు వరకు అంటే 5,364 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి అక్కడ భారత జాతీయ జెండాను ఎగరేశాడు. ప్రతి ఏడాది మే 29న ఎవరెస్ట్ డే సందర్భంగా మస్కట్‌లోని నేపాల్ రాయబార కార్యాలయంలో జరిగిన ఎవరెస్ట్ డే కార్యక్రమానికి అక్షజ్ తో పాటు అతడి తల్లిదండ్రులకు ఆహ్వానం అందింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అక్షజ్ తన అనుభవాలను అక్కడ వివరించాడు. అక్షజ్కు నేపాల్ రాయబారి దోర్నాథ్ ఆర్యల్ సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేట్ అవార్డును ప్రదానం చేశారు. అక్షజ్ తల్లిదండ్రులు అమిత్, అనురాధలను సత్కరించారు. ఇది కూడా చదవండి: హజ్ యాత్రకు జూన్ 7న తొలి విమానం -
Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న ఎవరెస్టును అధిరోహించి హైదరాబాద్‌కు చేరుకున్న పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె స్పాన్సర్, అన్వితా గ్రూప్ అధినేత అచ్యుతరావు, కోచ్ శేఖర్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో తాను చూసిన కోటనే తనకు ప్రేరణ అయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కని నేపాల్‌లోని ఎవరెస్టు పర్వతం దక్షిణం వైపు నుండి శిఖరాన్ని అధిరోహించినట్లు తెలిపారు. మే 16న ఉదయం 9:30కి ఎవరెస్టు శిఖరం (8848.86 మీటర్లు) చేరుకోవడం ద్వారా తన కలను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన అన్వితారెడ్డి.. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. (క్లిక్: ఎవరెస్ట్‌పై నుంచి చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించింది) -
శిఖరాగ్రానికి చేరువలో..!
సీతంపేట: మరో నెలన్నర రోజులలో గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలకు చెందిన ముగ్గురు మన్యం విద్యార్థులు మన ఎవరెస్టు పర్వతారోహణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని గిరిజన గురుకుల కళాశాలల నుంచి 16 మంది ఎంపికవ్వగా అందులో సీతంపేట బాలికల కళాశాల విద్యార్థిని కొండగొర్రె రేణుక, బాలుర కళాశాల విద్యార్థులు ఎస్.రాజ్‌కుమార్, రమణమూర్తిలు ఉన్నారు. డిసెంబర్లో రీనాక్ పర్వతారోహణ చేసి సత్తాచాటిన గిరిజన విద్యార్థులు ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎవరెస్టు దారిలో కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. అత్యున్నత ఎవరెస్టు అధిరోహణలో తొలి అంకాన్ని పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల నెల రోజులపాటు లడఖ్‌లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రత్యేక శిక్షణ పొందారు. మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తయిన అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించనున్నారు. ఎస్.రాజ్‌కుమార్ సీతంపేట గిరిజన బాలుర కళాశాలలో హెచ్ఈసీ, జె.రమణమూర్తి సీజీఏ(వృత్తివిద్యా కోర్సు), రేణుక సీతంపేట బాలికల గిరిజన గురుకుల కళాశాలలో ఏఅండ్‌టీ కోర్సు చదువుతున్నారు. ఎవరెస్టు దారి ఇదీ.. తొలుత పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఉన్న 6,400 మీటర్ల రీనాక్ పర్వతమెక్కి విజయబావుట ఎగురవేశారు. కొద్ది నెలల కిందట రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఎవరెస్టు పర్వతారోహణలో భాగంగా రీనాక్ శిఖరం పైకి బయలుదేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది గిరిజన విద్యార్థులకు గాను 20 మంది బాలురు, 7 బాలికలకు విజయవాడ కేతాని కొండ వద్ద పర్వతోరాహణపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 22 మంది రీనాక్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. వారిలో 16 మంది విద్యార్థులను ఎంపిక చేసి జనవరి 1 నుంచి తూర్పుగోదావరి జిల్లా చింతూరలో 23 రోజుల పాటు ఎవరెస్టు అధిరోహణ శిక్షణ పొందారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి1 వరకు లడక్ సమీపంలో మార్కావేలి మంచుపర్వత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారు. -
వెండితెరపై భువనగిరి ఖిల్లా..
మలావత్ పూర్ణ తొలి అడుగులు పడింది ఈ ఖిల్లాపైనే.. - 31న దేశవ్యాప్తంగా విడుదల కానున్న పూర్ణ సినిమా భువనగిరి: నిజామాబాద్ జిల్లా పాకాలలోని ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన మలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. 13 ఏళ్ల వయస్సులోనే 2014 మే 20వ తేదీన ప్రపంచంలోని ఎత్తయిన పర్వత శిఖరాన్ని అధిరోహించిన ఆమె పయనానికి తొలి అడుగులు నేర్పింది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏకశిలా పర్వతం. పలువురికి స్ఫూర్తిదాయకమైన పూర్ణ జీవిత చరిత్రను వెండి తెరపైకి ఎక్కిస్తున్నారు. సామాన్య బాలిక సాధించిన అసామాన్య విజయగాథ ఎందరి జీవితాలకో ఆదర్శంగా ఉండేలా ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శక, నిర్మాత రాహుల్ బోస్ తీర్చిదిద్దిన చలన చిత్రంలో పూర్ణకు అరుదైన గౌరవం దక్కు తుండగా ఆమె శిక్షణ ఇచ్చినవారితోపాటు భువనగిరి ఖిల్లా ఖ్యాతి వెండి తెర దృశ్యాలతో విశ్వవ్యాప్తం కానుంది. ఈ నెల 31న దేశ వ్యాప్తంగా 280 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో గురుకుల పాఠశాల విద్యార్థినిగా సాధించిన విజయాలు, ఆమెకు సంబంధం ఉన్న ప్రాంతాలను చిత్రీకరించారు. పూర్ణ పుట్టి పెరిగిన గ్రామం తోపాటు చదువుకున్న పాఠశాల, శిక్షణ తీసుకున్న భువనగిరి ఖిల్లా, రాక్‌క్లైంబింగ్ శిక్షణ దృశ్యాలను వెండి తెర పైకి ఎక్కించారు. వెండి తెర పైకి ఎక్కుతుండడంతో భువనగిరి ఖిల్లా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించ నుందని కోచ్ బచేనపల్లి శేఖర్‌బాబు అన్నారు. గర్వంగా ఉంది: ‘నా విజయగాథపై బాలీవుడ్ చిత్రాన్ని తీయడం గర్వంగా ఉంది. ఈ స్థాయికి రావడానికి గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్, కోచ్ శేఖర్ బాబులే ప్రధాన కారణం. భువనగిరి ఖిల్లా ఖ్యాతి కూడా ప్రపంచమంతా తెలిసింది.’ అని మలావత్ పూర్ణ పేర్కొంది.


