'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About Gold Silver and Bitcoin | Sakshi
Sakshi News home page

'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

Oct 23 2025 3:16 PM | Updated on Oct 23 2025 3:59 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About Gold Silver and Bitcoin

నిజమైన డబ్బును మాత్రమే పొదుపు చేయండి. ఫేక్ కరెన్సీని పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరని సూచించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో రెండు ట్వీట్స్ చేశారు.

''గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ క్రాష్ అవుతున్నాయి. అయితే బట్‌కాయిన్ విలువ ఈ నెలలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 మిలియన్ల మంది బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేశారు. వీటి సంఖ్య 21 మిలియన్స్ మాత్రమే. కాబట్టి కొనుగోలును వేగవంతం అవుతుంది. దయచేసి ఆలస్యం చేయకండి'' అని కియోసాకి పేర్కొన్నారు.

''ప్రస్తుతం అమెరికా అప్పు పెరుగుతూనే ఉంది.  జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. వేల సంవత్సరాలుగా నిజమైన డబ్బు అంటే.. బంగారం, వెండి అని నాకు తెలుసు. నేడు ఈ జాబితాలోకి బిట్‌కాయిన్ & ఎథెరియం కూడా చేరాయి. కాబట్టి డబ్బు సేవ్ చేయడంలో తెలివిగా వ్యవహరించండి. అయితే జాగ్రత్త వహించండి'' అని కియోసాకి స్పష్టం చేశారు.

బంగారం, వెండి, బట్‌కాయిన్
2025 అక్టోబర్ 17వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. దీంతో రూ. 13,000 దాటిన గోల్డ్ రేటు రూ. 12,500 వద్దకు చేరింది. ఇదే సమయంలో రూ. 2.03 లక్షలకు చేరిన వెండి రేటు.. రూ. 17,4000 వద్దకు వచ్చింది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..

ఇక బట్‌కాయిన్ విషయానికి వస్తే.. గత వారంలో కొంత తగ్గుముఖం పట్టిన బట్‌కాయిన్ విలువ.. నేడు 1.87 శాతం పెరిగి రూ. 96,18,503.80 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బట్‌కాయిన్ విలువ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement