భారత్‌లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన | Microsoft Mega Investment In India Sundar Pichai Tweet | Sakshi
Sakshi News home page

భారత్‌లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన

Dec 9 2025 11:36 PM | Updated on Dec 9 2025 11:40 PM

Microsoft Mega Investment In India Sundar Pichai Tweet

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.

భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement