ఈ ఏడాది జీడీపీ జోరు | Fitch raises India GDP growth projection for FY26 to 7. 5 Percent | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది జీడీపీ జోరు

Mar 14 2026 12:33 AM | Updated on Mar 14 2026 12:33 AM

Fitch raises India GDP growth projection for FY26 to 7. 5 Percent

అంచనాలు పెంచిన ఫిచ్‌ రేటింగ్స్‌ 

క్రూడ్‌ 70 డాలర్ల స్థాయిలో ఉండొచ్చు 

రెండంకెల స్థాయిలో రుణ వృద్ధి

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.7%, 2027–28లో 6.5% మేర వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4% చొప్పున వృద్ధి ఉంటుందని లోగడ పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 2026లో బ్యారెల్‌కు సగటున 70 బ్యారెళ్ల స్థాయిలో ఉంటుందని అంచనా వ్యక్తం చేసింది.

దేశీ డిమాండ్‌ ఈ ఏడాది వృద్ధిని నడిపించే కీలక అంశమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల వ్యయాలు 8.6%, పెట్టుబడులు 6.9% చొప్పున పెరుగుతాయని తెలిపింది. 2025 డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 7.8%కి పరిమితం కావడం తెలిసిందే. గతేడాది సెపె్టంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4%గా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఆర్థిక కార్యకలాపాలు భారత్‌లో నిదానించినట్టు సంకేతాలు కనిపిస్తున్నా యంటూ, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, రుణ వితరణలో రెండంకెల వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. 

పెట్టుబడుల వృద్ధి పుంజుకుంటుంది..  
స్వల్పకాలంలో పెట్టుబడుల వృద్ధి మందగించొచ్చని, సులభతర ఆర్థిక పరిస్థితులు, కనిష్ట స్థాయిలో వడ్డీ రేట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ భాగంలో పుంజుకోవచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.  ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిల్లోనే స్థిరపడొచ్చని పేర్కొంది. 

ప్రపంచ జీడీపీ 2.6 శాతం 
ప్రపంచ జీడీపీ 2026లో 2.6%గా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఇరాన్‌ యుద్ధంతో ఇంధన ధరలు భారీగా పెరగకపోవచ్చని భావిస్తూ ఈ అంచనాకు వచి్చంది. ఒకవేళ చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరి, అక్కడే కొనసాగితే అది ప్రపంచ సరఫరా వ్యవస్థకు పెద్ద షాక్‌గా మారుతుందని తెలిపింది. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన నేపథ్యంలో క్రూడ్‌ ఈ నెలాఖరు వరకు 90–100 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement