ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్‌ జీడీపీ కంటే ఎక్కువ! | Worlds Most Indebted Companies Top Firm Owes More Than Indias GDP | Sakshi
Sakshi News home page

ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్‌ జీడీపీ కంటే ఎక్కువ!

Dec 10 2025 8:26 AM | Updated on Dec 10 2025 9:23 AM

Worlds Most Indebted Companies Top Firm Owes More Than Indias GDP

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రుణం పెరుగుతూ వస్తోంది. విస్తరణ, రీఫైనాన్స్ లేదా పెట్టుబడి అవసరాల కోసం కంపెనీలు రుణాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఆదాయం తగ్గినప్పుడు ఈ రుణాలు భారీ భారంగా మారుతాయి. కొన్నిసార్లు సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆస్తుల అమ్మకం లేదా విభాగాల మూసివేతల వరకు వెళ్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రుణాన్ని పరిశీలిస్తే కళ్లు చెదిరే అంకెలు బయటపడుతున్నాయి. అత్యధిక రుణభారంతో ఉన్న టాప్ 10 కంపెనీలలో ఐదు చైనా, మూడు అమెరికా, ఒకటి ఫ్రాన్స్, ఒకటి కెనడా దేశాలకు చెందినవి. అమెరికా తన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజాలతో ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత రుణం ఈ కంపెనీదే..
అమెరికన్ మార్టగేజ్ సంస్థ ‘ఫెన్నీ మే’ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రుణం ఉన్న కంపెనీగా నిలిచింది. దీని రుణ భారం 4.21 ట్రిలియన్ డాలర్లు. ఇది భారతదేశ జీడీపీ కంటే అధికం. అంతేకాదు.. యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, కెనడా వంటి దేశాల జీడీపీకన్నా కూడా ఎక్కువ.

అప్పుల్లో టాప్ 10 కంపెనీలు

ర్యాంక్కంపనీదేశంమొత్తం రుణం
1ఫెన్నీ మేఅమెరికా$4.21 ట్రిలియన్
2ఫ్రెడ్డీ మాక్అమెరికా$3.349 ట్రిలియన్
3జేపీ మోర్గాన్ చేజ్అమెరికా$496.55 బిలియన్
4అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$494.86 బిలియన్
5చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్చైనా$479.33 బిలియన్
6బిఎన్పి పరిబాస్ఫ్రాన్స్$473.67 బిలియన్
7ఐసిబిసిచైనా$445.05 బిలియన్
8బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$400.70 బిలియన్
9సిటిక్ లిమిటెడ్చైనా$386.79 బిలియన్
10రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాకెనడా$377.70 బిలియన్

భారత్‌లో అంబానీ కంపెనీ టాప్‌
భారతదేశంలో ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక రుణభారం ఉన్న సంస్థ. దీని మొత్తం రుణం 43.24 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.3.8 లక్షల కోట్లు. ఇది భారత కార్పొరేట్ రంగం చేపడుతున్న భారీ పెట్టుబడి ప్రణాళికలు, వృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.

కార్పొరేట్ రుణం అవకాశమా.. సవాలా?
కార్పొరేట్ రుణం విస్తరణకు ఉపయోగపడినా, సరైన నిర్వహణ లేకపోతే ఇది భారీ ఆర్థిక సవాలుగా మారుతుంది. ప్రపంచంలోని అత్యంత రుణపడి ఉన్న కంపెనీలు, అధిక రుణభారం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement