
నికర లాభం రూ. 18,165 కోట్లు
ఆదాయం రూ. 2.59 లక్షల కోట్లు
టెలికం, డిజిటల్ ప్లాట్‌ఫామ్ రిలయన్స్ జియో సహా.. రిలయన్స్ రిటైల్, ఆయిల్ టు కెమికల్స్(ఓ2సీ) విభాగాల దన్నుతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) పటిష్ట పనితీరు చూపింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) క్యూ2లో నికర లాభం 10 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్ తాజాగా జూలై–సెప్టెంబర్(క్యూ2) ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 18,165 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 16,653 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 26,994 కోట్లతో పోలిస్తే 33 శాతం క్షీణించింది.
మొత్తం ఆదాయం రూ. 2.35 లక్షల కోట్ల నుంచి రూ. 2.39 లక్షల కోట్లకు ఎగసింది. కొత్త కస్టమర్లను జత చేసుకోవడం, వినియోగదారునిపై ఆదాయం పుంజుకోవడం, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్‌లతో జియో లాభం 13 శాతం పుంజుకోగా.. స్టోర్ల నిర్వహణ మెరుగుపడటంతో రిటైల్ విభాగం ఆర్జన 22 శాతం ఎగసింది.
మరోవైపు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా చమురును ప్రాసెస్ చేయడంతో బలపడిన రిఫైనింగ్ మార్జిన్లు ఈ క్యూ2లో ఆర్‌ఐఎల్‌కు జోష్‌నిచ్చాయి. క్యూ1తో పోలిస్తే ఇన్వెంటరీ నష్టాలు రెట్టింపై రూ. 8,421 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 15% జంప్‌చేసి రూ. 50,367 కోట్లను తాకింది. రుణ భారం రూ. 3.38 లక్షల కోట్ల(క్యూ1) నుంచి రూ. 3.48 లక్షల కోట్లకు పెరిగింది.
ఓ2సీ ఓకే: చమురు, రసాయనాల విభాగం ఇబిటా 21% జంప్‌చేసి రూ. 15,008 కోట్లను తాకింది. జామ్‌నగర్ జంట రిఫైనరీల చమురు శుద్ధి మార్జిన్లు బలపడ్డాయి. కొత్త రికార్డ్‌తో 20.8 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. ఇంధన రిటైల్ బిజినెస్ జియో–బీపీ డీజిల్, పెట్రోల్ విక్రయాలు 30 శాతం జంప్‌చేశాయి. రిటైల్ నెట్‌వర్క్ 2,000 ఔట్‌లెట్లకు చేరింది. ఇక కేజీ–డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి 5 శాతంపైగా క్షీణించింది.
ఫలితాల నేపథ్యంలో ఆర్‌ఐఎల్ షేరు 1.4 శాతం లాభంతో రూ. 1,417 వద్ద ముగిసింది.
రిటైల్ భళా
రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 3,457 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 90,018 కోట్లను తాకింది. ఇబిటా 17 శాతం అధికమై రూ. 6,816 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 412 స్టోర్లను జత చేసుకోవడంతో వీటి సంఖ్య 19,821కు చేరింది. నిర్వహణ మార్జిన్లను మెరుగుపరిచేందుకు కార్యకలాపాల క్రమబదీ్ధకరణను చేపట్టింది. ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఎజియో కేటలాగ్ 35 శాతం పెరిగి 2.7 మిలియన్ ఆప్షన్లకు చేరింది. ఆన్‌లైన్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ యాప్ డౌన్‌లోడ్స్ 60 లక్షలను దాటాయి.
జియో జోరు
టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం క్యూ2లో 13 శాతం పుంజుకుని రూ. 7,379 కోట్లను తాకింది. డేటా మినిట్స్ వినియోగం, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ), సబ్‌స్క్రయిబర్ల సంఖ్య మెరుగుపడటం ఇందుకు సహకరించింది. కస్టమర్ల సంఖ్య 49.81 కోట్ల నుంచి 50.64 కోట్లకు పెరిగింది. ఏఆర్‌పీయూ రూ. 208.8 నుంచి రూ. 211.4కు బలపడింది. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వస్ జియోఎయిర్‌ఫైబర్ వినియోగదారుల సంఖ్య 9.5 మిలియన్లకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంకాగా.. నెలకు మిలియన్ కొత్త కనెక్షన్లు జత కలుస్తున్నట్లు ఆర్‌ఐఎల్ వెల్లడించింది.
జియోస్టార్ జూమ్
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ జియోస్టార్ నికర లాభం రూ. 1,322 కోట్లను తాకగా.. రూ. 7,232 కోట్ల ఆదాయం అందుకుంది. రూ. 1,738 కోట్ల ఇబిటాతోపాటు 28.1 శాతం మార్జిన్లు సాధించింది.
ఓ2సీ, జియో, రిటైల్ విభాగాల దన్నుతో క్యూ2లో పటిష్ట పనితీరు ప్రదర్శించాం. అన్నివిధాలా డిజిటల్ సరీ్వసుల బిజినెస్ వృద్ధి కొనసాగుతోంది. అధిక అమ్మకాల కారణంగా రిటైల్ విభాగం ఆదాయం, ఇబిటా పుంజుకున్నాయి. ఇంధన మార్కెట్ల అనిశి్చతుల్లోనూ ఓ2సీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కొత్త వృద్ధి ఇంజిన్లు న్యూఎనర్జీ, మీడియా, కన్జూమర్ బ్రాండ్స్‌లో నమోదవుతున్న పురోగతికి సంతోíÙస్తున్నాం.
– ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్