
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇది నిజమే అని కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్ (Nitin Mittal).. ఈ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు.
ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా, ఉద్యోగులు.. ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు, కోడింగ్ వంటి కొన్ని ఉద్యోగాలు ఏఐకు ప్రభావితం కావడం అనివార్యం. అయితే ఏఐ కారణంగా కోల్పోయిన ఒక్క ఉద్యోగాన్ని కూడా నేను చూడలేదు. దాదాపు ఉద్యోగులంతా AIతో ఎలా కలిసి పనిచేయాలో నేర్చుకుంటున్నారని మిట్టల్ పేర్కొన్నారు.
ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం పెంచుకోవడానికి ఆసక్తి చూపనివారిని, ఖాళీ సమయాన్ని డూమ్‌స్క్రోలింగ్‌లో గడిపేవారినికి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉందని నితిన్ మిట్టల్ చెప్పారు. అంతే కాకుండా ఏఐ ఎవరూ ఊహించని ఉద్యోగాలను సృష్టిస్తుందని.. కాబట్టి ఇందులో తప్పకుండా నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!