రూ. 3,000 కోట్ల ఐపీవోకి ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ | Truhome Finance Files DRHP for Rs 3000cr IPO | Sakshi
Sakshi News home page

రూ. 3,000 కోట్ల ఐపీవోకి ట్రూహోమ్‌ ఫైనాన్స్‌

Mar 16 2026 4:11 AM | Updated on Mar 16 2026 4:11 AM

Truhome Finance Files DRHP for Rs 3000cr IPO

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 3,000 కోట్ల నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ (గతంలో శ్రీరాం హౌసింగ్‌ ఫైనాన్స్‌) ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం తాజాగా రూ. 1,500 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా. ప్రమోటర్‌ మ్యాంగో క్రెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ. 1,500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించనుంది.

తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించి నిధులను వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2010లో ఏర్పాటైన ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ గతంలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌గా కార్యకలాపాలు సాగించేది. 2024 డిసెంబర్‌లో దాన్ని గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌ కొనుగోలు చేసింది. గృహ రుణాలు, ప్రాపర్టీపై రుణాలు మొదలైనవి అందిస్తున్న కంపెనీకి దేశవ్యాప్తంగా 216 శాఖలు ఉన్నాయి. 2025 డిసెంబర్‌ 31 నాటికి రూ. 21,124 కోట్ల అసెట్స్‌తో దేశీయంగా మూడో అతి పెద్ద అఫోర్డబుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement