ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే! | OpenAI Robotic Head Caitlin Kalinowski Quits | Sakshi
Sakshi News home page

ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!

Mar 9 2026 7:41 AM | Updated on Mar 9 2026 11:34 AM

OpenAI Robotic Head Caitlin Kalinowski Quits

ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్‌స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.

కైట్లిన్ కలినోవ్‌స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్‌వర్క్‌లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.

కైలిన్ కలినోవ్‌స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.

ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!

కలినోవ్‌స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement