breaking news
consolidated net profit
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 19,611 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత క్యూ2తో పోలిస్తే బ్యాంకు నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సుమారు 10 శాతం పైగా పెరిగి రూ. 19,611 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం సుమారు 11 శాతం పెరిగి రూ. 18,641 కోట్లుగా నమోదైంది. ఇక రుణాల్లో 10 శాతం వృద్ధి దన్నుతో నికర వడ్డీ ఆదాయం 4.8 శాతం ఎగిసి రూ. 31,550 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) మాత్రం 3.5 శాతం నుంచి 3.27 శాతానికి నెమ్మదించింది. రాబోయే ఒకటి రెండేళ్లలో ఇది స్థిరంగా కొనసాగవచ్చని, లేదా మరింతగా పెరగొచ్చని బ్యాంకు తెలిపింది. సమీక్షాకాలంలో వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.36 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది. లక్ష్యాల వైపు ముందుకు.. క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తిని 96 శాతానికి పరిమితం చేసుకోవడం, రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవడంలాంటి గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్లు బ్యాంకు ఎండీ శశిధర్ జగదీశన్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు మించి రుణ వృద్ధి సాధించగలమని, మార్కెట్ వాటాను పెంచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ క్రమబదీ్ధకరణ, ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆర్బీఐ రేట్ల కోత తదితర పాలసీలపరమైన అంశాల దన్నుతో క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని, దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు లభించగలవని జగదీశన్ తెలిపారు. కంపెనీల కొనుగోళ్ల లావాదేవీలకు నిధులు సమకూర్చేలా (ఎక్విజిషన్ ఫైనాన్స్) బ్యాంకులకు అనుమతి లభించడం ఇటు బ్యాంకర్లకు, అటు రుణగ్రహీతలకు మేలు చేసే విషయమని సీఈవో శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు. దీనితో కార్పొరేట్లకు లావాదేవీల వ్యయాల భారం తగ్గుతుందన్నారు. తాము కూడా ఎక్విజిషన్ ఫైనాన్స్ కార్యకలాపాలు చేపట్టే దిశగా తుది మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని వైద్యనాథన్ వివరించారు. ఉద్యోగాలపై జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఉంటుందని భావించడం లేదని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీల రాకతో కొందరు సిబ్బంది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి మారొచ్చని తెలిపారు. జనరేటివ్ ఏఐ సహా వివిధ టెక్నాలజీలపై బ్యాంకు అంతర్గతంగా కొన్ని ప్రయోగాలు చేస్తోందన్నారు. మరిన్ని విశేషాంశాలు.. → సమీక్షాకాలంలో బ్యాంక్ స్థూల స్లిపేజీలు రూ. 7,400 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ. 1,100 కోట్లు వ్యవసాయ రుణాలున్నాయి. → మొత్తం ప్రొవిజన్లు రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెరిగాయి. అయితే, అంతకు ముందు త్రైమాసికంలో నమోదైన రూ. 14,441 కోట్లతో పోలిస్తే తగ్గాయి. → రిటైల్ రుణాలు 7.4 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్ మార్కెట్ సంస్థలకు రుణాలు 17 శాతం, కార్పొరేట్..హోల్‌సేల్ రుణాలు 6.4 శాతం పెరిగాయి. → వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 6.4 శాతం పెరిగి రూ. 17,980 కోట్లుగా నమోదయ్యాయి. -
రిలయన్స్ క్యూ2.. గుడ్
టెలికం, డిజిటల్ ప్లాట్‌ఫామ్ రిలయన్స్ జియో సహా.. రిలయన్స్ రిటైల్, ఆయిల్ టు కెమికల్స్(ఓ2సీ) విభాగాల దన్నుతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పటిష్ట పనితీరు చూపింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) క్యూ2లో నికర లాభం 10 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ తాజాగా జూలై–సెప్టెంబర్(క్యూ2) ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 18,165 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 16,653 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 26,994 కోట్లతో పోలిస్తే 33 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ. 2.35 లక్షల కోట్ల నుంచి రూ. 2.39 లక్షల కోట్లకు ఎగసింది. కొత్త కస్టమర్లను జత చేసుకోవడం, వినియోగదారునిపై ఆదాయం పుంజుకోవడం, వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ బిజినెస్‌లతో జియో లాభం 13 శాతం పుంజుకోగా.. స్టోర్ల నిర్వహణ మెరుగుపడటంతో రిటైల్ విభాగం ఆర్జన 22 శాతం ఎగసింది. మరోవైపు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా చమురును ప్రాసెస్ చేయడంతో బలపడిన రిఫైనింగ్ మార్జిన్లు ఈ క్యూ2లో ఆర్ఐఎల్కు జోష్‌నిచ్చాయి. క్యూ1తో పోలిస్తే ఇన్వెంటరీ నష్టాలు రెట్టింపై రూ. 8,421 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 15% జంప్‌చేసి రూ. 50,367 కోట్లను తాకింది. రుణ భారం రూ. 3.38 లక్షల కోట్ల(క్యూ1) నుంచి రూ. 3.48 లక్షల కోట్లకు పెరిగింది. ఓ2సీ ఓకే: చమురు, రసాయనాల విభాగం ఇబిటా 21% జంప్‌చేసి రూ. 15,008 కోట్లను తాకింది. జామ్‌నగర్ జంట రిఫైనరీల చమురు శుద్ధి మార్జిన్లు బలపడ్డాయి. కొత్త రికార్డ్‌తో 20.8 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. ఇంధన రిటైల్ బిజినెస్ జియో–బీపీ డీజిల్, పెట్రోల్ విక్రయాలు 30 శాతం జంప్‌చేశాయి. రిటైల్ నెట్వర్క్ 2,000 ఔట్లెట్లకు చేరింది. ఇక కేజీ–డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి 5 శాతంపైగా క్షీణించింది.ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.4 శాతం లాభంతో రూ. 1,417 వద్ద ముగిసింది. రిటైల్ భళా రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 3,457 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 90,018 కోట్లను తాకింది. ఇబిటా 17 శాతం అధికమై రూ. 6,816 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 412 స్టోర్లను జత చేసుకోవడంతో వీటి సంఖ్య 19,821కు చేరింది. నిర్వహణ మార్జిన్లను మెరుగుపరిచేందుకు కార్యకలాపాల క్రమబదీ్ధకరణను చేపట్టింది. ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఎజియో కేటలాగ్ 35 శాతం పెరిగి 2.7 మిలియన్ ఆప్షన్లకు చేరింది. ఆన్లైన్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ యాప్ డౌన్లోడ్స్ 60 లక్షలను దాటాయి. జియో జోరు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం క్యూ2లో 13 శాతం పుంజుకుని రూ. 7,379 కోట్లను తాకింది. డేటా మినిట్స్ వినియోగం, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ), సబ్స్క్రయిబర్ల సంఖ్య మెరుగుపడటం ఇందుకు సహకరించింది. కస్టమర్ల సంఖ్య 49.81 కోట్ల నుంచి 50.64 కోట్లకు పెరిగింది. ఏఆర్పీయూ రూ. 208.8 నుంచి రూ. 211.4కు బలపడింది. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వస్ జియోఎయిర్‌ఫైబర్ వినియోగదారుల సంఖ్య 9.5 మిలియన్లకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంకాగా.. నెలకు మిలియన్ కొత్త కనెక్షన్లు జత కలుస్తున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది.జియోస్టార్ జూమ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ జియోస్టార్ నికర లాభం రూ. 1,322 కోట్లను తాకగా.. రూ. 7,232 కోట్ల ఆదాయం అందుకుంది. రూ. 1,738 కోట్ల ఇబిటాతోపాటు 28.1 శాతం మార్జిన్లు సాధించింది.ఓ2సీ, జియో, రిటైల్ విభాగాల దన్నుతో క్యూ2లో పటిష్ట పనితీరు ప్రదర్శించాం. అన్నివిధాలా డిజిటల్ సరీ్వసుల బిజినెస్ వృద్ధి కొనసాగుతోంది. అధిక అమ్మకాల కారణంగా రిటైల్ విభాగం ఆదాయం, ఇబిటా పుంజుకున్నాయి. ఇంధన మార్కెట్ల అనిశి్చతుల్లోనూ ఓ2సీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కొత్త వృద్ధి ఇంజిన్లు న్యూఎనర్జీ, మీడియా, కన్జూమర్ బ్రాండ్స్‌లో నమోదవుతున్న పురోగతికి సంతోíÙస్తున్నాం. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
హెచ్‌సీఎల్ క్యూ2 ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 4,235 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం పుంజుకుని రూ. 31,942 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా(క్యూ1లో రూ. 3,843 కోట్లతో పోలిస్తే) నికర లాభం 10 శాతం ఎగసింది. పూర్తి ఏడాదికి సరీ్వసుల ఆదాయం 4–5 శాతం స్థాయిలో పురోగమించగలదని కంపెనీ తాజాగా అంచనాల(గైడెన్స్)ను సవరించింది. ఇంతక్రితం 3–5 శాతం ఆదాయ అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులందరికీ వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ నుంచి ఇంక్రిమెంట్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఈ కాలంలో 3,489 మందికి ఉపాధి కల్పించడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,26,440కు చేరింది. ఫ్రెషర్స్‌తో కలిపి 5,1196 మందిని విధుల్లోకి తీసుకుంది. షేరుకి రూ. 12 డివిడెండ్ వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున హెచ్‌సీఎల్ టెక్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 17 రికార్డ్ డేట్. క్యూ2లో అడ్వాన్స్డ్ ఏఐ ఆదాయం 10 కోట్ల డాలర్లను(రూ. 876 కోట్లు) అధిగమించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. నిర్వహణ లాభ మార్జిన్ 17.5 శాతంగా నమోదైంది. మార్జిన్లు త్రైమాసికవారీగా 1.16 శాతం బలపడగా.. 16 శాతం అధికంగా 2.6 బిలియన్ డాలర్ల(రూ. 22,500 కోట్లు) విలువైన కాంట్రాక్టులు అందుకుంది. ఎలాంటి భారీ డీల్ లేకుండానే తొలిసారి ఆర్డర్లు 2.5 బిలియన్ డాలర్లను తాకినట్లు విజయకుమార్ పేర్కొన్నారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో గ్లోబల్ డెలివరీ మోడల్ 5 ద్వారా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్స్‌ను అధికంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి స్వల్పంగా తగ్గింది. కాగా.. ఆదాయంలో 56 శాతం వాటాగల యూఎస్ బిజినెస్ 2.4 శాతం పుంజుకోగా.. యూరప్ 7.6 శాతం బలపడింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో రూ. 1,495 వద్ద యథాతథంగా ముగిసింది. -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది. -
హీరో మోటో డివిడెండ్ రూ. 100
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 1,093 కోట్లను తాకింది. వివిధ ప్రాంతాలలో అమ్మకాలు పుంజుకోవడం లాభాలకు దోహదపడింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 726 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,300 కోట్ల నుంచి రూ. 10,031 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 18 శాతం అధికంగా 14.6 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ శత జయంతి సందర్భంగా రూ. 25 ప్రత్యేక డివిడెండుతో కలిపి వాటాదారులకు కంపెనీ బోర్డు మొత్తం షేరుకి రూ. 100 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. రూ. 600 కోట్లు వెచి్చంచడం ద్వారా విడిభాగాలు, యాక్సెసరీస్, మెర్కండైజ్ బిజినెస్‌ను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తాజాగా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేరు 2 శాతం లాభంతో రూ. 4,909 వద్ద ముగిసింది. -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది (2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24% జంప్‌చేసి రూ. 4,423 కోట్లను తాకింది. వడ్డీ ఆదా యం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 2,581 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% వృద్ధితో రూ. 6,297 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 5.22 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 1,832 కోట్ల నుంచి రూ. 2,314 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.08% నుంచి రూ. 1.72%కి తగ్గాయి. అశోక్ వాశ్వానికి సై: కొటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా బయటి వ్యక్తి అశోక్ వాస్వాని ఎంపికకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ నాలుగు నెలల ముందుగానే ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో అశోక్‌ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 36% జంప్‌చేసి రూ. 10,896 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ.7,558 కోట్ల నుంచి రూ. 10,261 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్ల నుంచి రూ. 40,697 కోట్లకు దూసుకెళ్లింది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 18,308 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.31 శాతం నుంచి 4.53 శాతానికి బలపడ్డాయి. ట్రెజరీ మినహా వడ్డీయేతర ఆదాయం 14 శాతం అధికమై రూ. 5,861 కోట్లయ్యింది. ఎన్పీఏలు డౌన్... తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి రూ. 2.48 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.07 శాతంగా నమోదైంది. -
హిందుస్తాన్ జింక్ లాభం అప్
న్యూఢిల్లీ: వేదాంతా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలతాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 2,680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 2,017 కోట్లు ఆర్జించింది. అధిక అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. కమోడిటీ ధరలు బలపడటంతో ముడివ్యయాలు పెరిగినప్పటికీ వ్యూహాత్మక హెడ్జింగ్, విదేశీ మారక లాభాలు ఆదుకున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ2లో మొత్తం ఆదాయం రూ. 5,958 కోట్ల నుంచి రూ. 8,127 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో మైన్డ్ మెటల్ ఉత్పత్తి దాదాపు 3 శాతం వృద్ధితో 2,55,000 టన్నులను తాకింది. దీంతో సమీకృత మెటల్ ఉత్పత్తి మరింత అధికంగా 17.5 శాతం మెరుగుపడి 2,460,000 టన్నులకు చేరింది. కంపెనీ దేశంలోనే జింక్, లెడ్, సిల్వర్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా నిలుస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో హిందుస్తాన్ జింక్ షేరు 0.7% లాభపడి రూ. 280 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ ఫలితాలు బాగు..
న్యూఢిల్లీ: దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో బలమైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 22 శాతం వృద్ధితో రూ.2,670 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతానికి పైగా పెరిగి రూ.15,253 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి లాభం రూ.2,185 కోట్లు, ఆదాయం రూ.13,099 కోట్ల చొప్పున ఉన్నాయి. విక్రయాల సంఖ్యా పరంగా 4 శాతం వృద్ధిని చూసినట్టు కంపెనీ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో 75 శాతం విలువ పరంగా, పరిమాణం పరంగా మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు పేర్కొంది. కంపెనీ వ్యయాలు 18 శాతం పెరిగి రూ.11,965 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని రకాలుగా బలమైన ప్రదర్శన చూపించాం. 2022–23లో మొదటి ఆరు నెలల్లో రూ.4,000 కోట్ల అధిక టర్నోవర్ నమోదు చేయగలిగాం. మా ఉత్పత్తులకు ఉన్న బలం, నిర్వహణ సామర్థ్యాలు, వివేకవంతమైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనుకూలించాయి’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఒక్కో షేరుకు రూ.17 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ‡ బోర్డు నిర్ణయించింది. -
రిలయన్స్ అదరహో!
సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి పటిష్ట పనితీరు చూపింది. ముడిచమురు ధరలు పుంజుకోవడంతో ఓటూసీ విభాగం జోరు చూపగా.. టెలికం, డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ యథాప్రకారం మెరుగైన లాభాలను సాధించింది. ఇక రిలయన్స్ రిటైల్ సైతం అమ్మకాలను పెంచుకుంది. వివరాలు ఇలా... న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసింది. రూ. 13,680 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ, 9,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ బాటలో మొత్తం ఆదాయం సైతం 49 శాతం పురోగమించి రూ. 1,91,532 కోట్లకు చేరింది. చమురు ధరలు భారీగా పెరగడంతో కంపెనీ లబ్ధి పొందింది. దీనికితోడు రిటైల్ బిజినెస్ జోరందుకోవడం, టెలికం బిజినెస్ పుంజుకోవడం సైతం లాభాలకు దోహదపడ్డాయి. కంపెనీ ప్రధానంగా 4 బిజినెస్ విభాగాలను కలిగి ఉంది. ఇవి ఆయిల్ టు కెమికల్(ఓటూసీ), రిటైల్, డిజిటల్ సర్వీసులు, కొత్త ఇంధన బిజినెస్. విభాగాల వారీగా.. ఆర్ఐఎల్ ఆదాయంలో ఓటూసీ విభాగం రూ. 1.2 లక్షల కోట్లను సాధించింది. ఇది 58 శాతం వృద్ధికాగా.. నిర్వహణ లాభం 44 శాతం ఎగసి రూ. 12,720 కోట్లకు చేరింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్ ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ ప్రభావం చూపింది. ఇక రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 9 శాతంపైగా పుంజుకుని రూ. 39,926 కోట్లను తాకాయి. నిర్వహణ లాభం 45 శాతం జంప్‌చేసి రూ. 2,913 కోట్లను తాకింది. మార్జిన్లు 1.8 శాతం మెరుగుపడి 7.3 శాతానికి చేరాయి. కొత్తగా 813 స్టోర్లను ప్రారంభించింది. దీంతో స్టోర్ల సంఖ్య 13,635కు చేరింది. జియో జోరు..: టెలికం, డిజిటల్ సరీ్వసుల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ క్యూ2లో నికర లాభం 23.5% వృద్ధితో రూ. 3,728 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ.138.4 నుంచి రూ. 143.6కు మెరుగుపడింది. స్థూల ఆదాయం 15% పెరిగి రూ.23,222 కోట్లకు చేరింది. ఇక చమురు, గ్యాస్ విభాగం ఆదాయం 363% పురోగమించి రూ. 1,644 కోట్లయ్యింది. నిర్వహణ లాభం రూ. 1071 కోట్లకు చేరింది. రోజుకి 18 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల ఉత్పత్తిని సాధించింది. కేజీ–డీ6 బ్లాకులో ఉత్పత్తి ప్రారంభంకావడం ఇందుకు సహకరించింది. ఇతర హైలైట్స్ ► సెప్టెంబర్‌కల్లా కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2,59,476 కోట్లుగా నమోదైంది. మరోపక్క రూ. 2,55,891 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా నిలుస్తోంది. ► క్యూ2లో పెట్టుబడి వ్యయాలు రూ. 39,350 కోట్లుగా నమోదయ్యాయి. ► జియో వినియోగదారులు 23.8 మిలియన్లమేర పెరిగి 429.5 మిలియన్లకు చేరారు. ► దీపావళికల్లా జియోఫోన్ నెక్స్ట్ పేరుతో చౌక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు గూగుల్‌తో కలసి జియో పనిచేస్తోంది. సంతోషంగా ఉంది.. ఈ ఏడాది క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలను సాధించినందుకు సంతోషిస్తున్నాం. కంపెనీ బిజినెస్‌లకున్న సహజసిద్ధ పటిష్టతకు ఇది నిదర్శనం. అంతేకాదు.. దేశ, విదేశీ ఆర్దిక వ్యవస్థల వేగవంత రికవరీని ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయి. రిటైల్, ఓటూసీ, డిజిటల్ సరీ్వసుల విభాగాలలో నిలకడైన వృద్ధి కొనసాగింపును మెరుగైన నిర్వహణ, ఆర్దిక పనితీరు సూచిస్తున్నాయి. శుద్ధ ఇంధనంవైపు ప్రపంచ ప్రయాణంలో భారత్ ముందుండే బాటలో పర్యావరణ అనుకూల పెట్టుబడులను చేపడుతున్నాం. ఈ బాటలో ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీలతో చేతులు కలుపుతున్నాం. 2035కల్లా నికరంగా జీరో కార్బన్ లక్ష్యాన్ని చేరగలమన్న నమ్మకం మరింత పెరిగింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
హెచ్డీఎఫ్సీ లాభం రూ. 4,059 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ జూన్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.4,059 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ.11,168 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ సహా దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవల విభాగాల్లో కంపెనీలకు సబ్సిడరీలు ఉన్నాయి. వీటిని మినహాయించి స్టాండలోన్‌గా (కేవలం గృహ రుణాల వ్యాపారం) చూసుకుంటే సంస్థ లాభం 5 శాతం క్షీణించి రూ.3,051 కోట్లుగా నమోదైంది. ఆదాయం 2 శాతం పెరిగి 10790 కోట్లుగా ఉంది. తగ్గని మారటోరియం రుణాలు సంస్థ మొత్తం రుణాల్లో ఇప్పటికీ 22 శాతం మారటోరియం పరిధిలోనే ఉన్నాయి. మొదటి విడత మారటోరియం (రుణ చెల్లింపులకు విరామం) కాలం అయిన మే చివరి నాటికి 27 శాతం రుణాలు ఆ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో రిటైల్ రుణ గ్రహీతలవి 16.6 శాతం. ఆగస్టు చివరి వరకు ఈ మారటోరియంను ఆర్బీఐ కొనసాగించగా.. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ముందు నాటితో పోలిస్తే 5 శాతం మందే రుణ చెల్లింపులకు ముందుకు వచ్చారు. ఎన్పీఏలు 1.87%: సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో గతంలో 1.99 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 1.87 శాతానికి తగ్గాయి. సంస్థ నికర వడ్డీ మార్జిన్ 3.1 శాతంగా ఉంది. -
16 శాతం తగ్గిన ఐసీఐసీఐ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్‌రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 16 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.3,122 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.2,611 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ తెలిపింది. అయితే మొత్తం ఆదాయం రూ.25,585 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.27,876 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.3,018 కోట్ల నుంచి 19 శాతం తగ్గి రూ.2,442 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.17,563 కోట్ల నుంచి స్వల్పంగా క్షీణించి రూ.17,556 కోట్లకు పడిపోయిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.5,453 కోట్ల నుంచి రూ.5,363 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం రూ.4,217 కోట్ల నుంచి రూ.3,939 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఫీజు ఆదాయం రూ.2,261 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.2,495 కోట్లకు పెరిగిందని వివరించింది. డిపాజిట్లు 14 శాతం వృద్ధితో రూ.4,65,284 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా డిసెంబర్ క్వార్టర్లో కరెంటు, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లు రూ. 26,705 కోట్ల మేర పెరిగాయని బ్యాంకు తెలిపింది. నికర మొండి బకాయిలు రూ.16,483 కోట్ల నుంచి రూ.20,155 కోట్లకు చేరాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 0.6 శాతం తగ్గి రూ.269 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 1,920 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ లో నాలుగు అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. 2015, డిసెంబర్ 31తో ముగిసిన రెండో క్వార్టర్ లో రూ.1,920 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,915 కోట్లు)తో పోల్చితే 0.2 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్ లో ఆదాయం(కన్సాలిడేటెడ్) 11.4 శాతం పెరిగి రూ.10,341 కోట్లుకు చేరుకుందని తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ లో ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.9,283గా ఉంది. జూలై-సెప్టెండర్ క్వార్టర్ లో నికర లాభం రూ.1,726 కోట్లు, ఆదాయం రూ. 10,097 కోట్లుగా ప్రకటించింది. డాలర్లలో చూసుకుంటే హెచ్ సీఎల్ నికర లాభం 5.4 శాతం తగ్గి 290.8 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయభివృద్ధి 5.1 శాతం పెరిగి 1.56 బలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. -
విప్రో లాభం 1.8 శాతం అప్
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. 2015, డిసెంబర్ 31తో ముగిసిన క్యూ3లో రూ.2,234 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,192 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందింది. అదేవిధంగా ఆదాయం కూడా 7.1 శాతం పెరిగి రూ.12,085 కోట్ల నుంచి రూ.12,951 కోట్లకు చేరింది. కీలకమైన ఐటీ సేవల విషయానికొస్తే.. క్యూ3లో డాలర్ల రూపంలో కంపెనీ 1.86 బిలియన్ డాలర్ల(రూ.12,310) ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువని విప్రో తెలిపింది. ఉద్యోగుల సెలవులు, చెన్నై వరదల ప్రభావం తమపై ఉంటుందని ఇంతకుముందే విప్రో ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ గెడైన్స్ అంచనా, 1,875-1,912 మిలియన్ డాలర్లు అని వెల్లడించింది. క్యూ3లో విప్రో 39 క్లయింట్లను జతచేసుకుంది. ఇంటిగ్రేటెడ్ డొమైన్, టెక్నాలజీ సేవల ద్వారా కోర్ బిజినెస్ లో వృద్ధి నమోదు చేస్తామని సీఈవో అబిదాలి జెడ్. నీముచువాలా తెలిపారు. ఐటీ ప్రొడక్ట్స్ సెగ్ మెంట్ లో ఆదాయం 6.5 బిలియన్లకు (98 మిలియన్ డాలర్లు) చేరిందని వెల్లడించారు. -
ఐడియా లాభం 60 శాతం జంప్
క్యూ4లో రూ.942 కోట్లు... న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2014-15, క్యూ4)లో కంపెనీ రూ.942 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదుచేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.590 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు 60% వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం రూ.7,044 కోట్ల నుంచి రూ.8,423 కోట్లకు పెరిగింది. 19.5% వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) రూ.179కి పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.173గా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐడియా కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,193 కోట్లకు ఎగబాకింది. 2013-14లో నమోదైన రూ.1,968 కోట్లతో పోలిస్తే లాభం 62 శాతం మేర దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.26,519 కోట్ల నుంచి రూ.31,571 కోట్లకు పెరిగింది. కాగా, 2014-15లో 3జీ డేటా యూజర్ల సంఖ్య రెట్టింపై 1.45 కోట్ల మందికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.మెరుగైన ఫలితాల నేపథ్యంలో ఐడియా షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 2.79 శాతం లాభపడి రూ.192 వద్ద స్థిరపడింది. -
ఇన్ఫోసిస్ అంచనాలు మిస్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలు తప్పింది. మిగతా ఐటీ దిగ్గజాల మాదిరిగానే నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. అయితే, బోనస్ షేర్ల ప్రకటన ద్వారా ఇన్వెస్టర్లను మాత్రం ఆశ్చర్యపరిచింది. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర ఒకే రోజు 6 శాతం దిగజారింది. క్యూ4లో నికర లాభం రూ.3,097 కోట్లు; 3.5% వృద్ధి ⇒ సీక్వెన్షియల్‌గా 4.7 శాతం డౌన్... ⇒ ఇన్వెస్టర్లకు 1:1 బోనస్ షేర్లు... ⇒ షేరుకి రూ.29.5 డివిడెండ్ ప్రకటన... ⇒ 6 శాతం కుప్పకూలిన షేరు ధర... బెంగళూరు: ఇన్ఫోసిస్ మార్చి క్వార్టర్ (2014-15, క్యూ4)లో రూ.3,097 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,992 కోట్లతో పోలిస్తే లాభం 3.5 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం విషయానికొస్తే.. రూ.12,875 కోట్ల నుంచి రూ.13,411 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ది నమోదైంది. మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ4లో రూ.3,161 కోట్ల నికర లాభం, రూ.13,818 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ప్రైసింగ్ ఒత్తిడి, కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు, ఇతరత్రా అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావం చూపాయి. సీక్వెన్షియల్‌గా డౌన్... క్రితం ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 4.7 శాతం దిగజారింది. క్యూ3లో లాభం రూ. 3,250 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం 2.8%(క్యూ3లో రూ.13,796 కోట్లు) క్షీణించింది. గెడైన్స్ ఇలా... ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ విలువ ప్రకారం కంపెనీ ఆదాయాల్లో 10-12 శాతం వృద్ధి(గెడైన్స్) ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది. ఇక రూపాయల్లో ఆదాయ వృద్ధి 8.4-10.4 శాతంగా, డాలర్ల ప్రాతిపదికన 6.2-8.2 శాతంగా అంచనా వేసింది. పరిశీలకులు గెడైన్స్ 9-11 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. దీనికన్నా ఇన్ఫీ గెడైన్స్ ఎక్కువే అయినా... ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్... ఈ ఏడాది సాఫ్ట్వేర్ సేవల ఆదాయాల్లో వృద్ధి 12-14% ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో పోలిస్తే ఇన్ఫీ గెడైన్స్ తక్కువగానే ఉంది. పూర్తి ఏడాదికి చూస్తే... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,329 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.10,648 కోట్లతో పోలిస్తే 15.8 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 6.4 శాతం వృద్ధితో రూ.50,133 కోట్ల నుంచి రూ.53,319 కోట్లకు ఎగబాకింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ రూ. 5 ముఖవిలువగల ఒక్కో షేరుపై రూ.29.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది (1:1 బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకుంటే షేరుకి రూ.14.75 చొప్పున). ⇒ క్యూ4లో కొత్తగా 52 క్లయింట్లను కంపెనీ జత చేసుకుంది. ⇒ ఈ ఏడాది మార్చినాటికి ఇన్ఫీ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.32,585 కోట్లకు చేరాయి. 2014 మార్చి నాటికి ఈ మొత్తం రూ.30,251 కోట్లు కాగా, డిసెంబర్ చివరికి రూ.34,873 కోట్లు. ⇒ క్యూ4లో 6.549 మంది ఉద్యోగులను కంపెనీ నికరంగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య మార్చినాటికి 1,76,187కు చేరింది. ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు క్యూ3లో 20.6 శాతం కాగా, క్యూ4లో 18.9 శాతానికి తగ్గింది. నిరుత్సాహకరమైన ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర భారీగా పడిపోయింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 6.5 శాతం మేర దిగజారి రూ.1,982 కనిష్టస్థాయిని తాకింది. చివరకు 5.95 శాతం నష్టపోయి రూ.1,996 వద్ద స్థిరపడింది. బోనస్ బొనాంజా... ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసం పెంచడంపై ఇన్ఫోసిస్ దృష్టిపెట్టింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1 నిష్పత్తిలో) బోనస్‌గా ఇవ్వాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన అమెరికన్ డిపాజిటరీ షేర్(ఏడీఎస్)లకు కూడా ఇదే నిష్పత్తిలో బోనస్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి ఈ ప్రతిపాదన అమలవుతుందని వెల్లడించింది. కాగా, కంపెనీ కొత్త సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టాక ఇది రెండో బోనస్ ఇష్యూ కావడం విశేషం.గతేడాది అక్టోబర్‌లో(క్యూ2 ఫలితాల సందర్భంగా) ఇన్ఫీ 1:1 నిష్పత్తిలోనే బోనస్‌ను ప్రకటించింది. ‘కలిడస్’ కొనుగోలు... అమెరికాకు చెందిన డిజిటల్ ఎక్స్పీరియన్స్ సొల్యూషన్స్ కంపెనీ ‘కలిడస్’ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఈ డీల్ విలువ 12 కోట్ల డాలర్లు(దాదాపు రూ.750 కోట్లు). దీంతోపాటు ఎయిర్విజ్లో మైనారిటీ వాటా కోనుగోలు కోసం 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందానికి కూడా బోర్డు ఓకే చెప్పినట్లు కంపెనీ వెల్లడించింది. ఫినాకిల్, ఎడ్జ్సర్వీసెస్ వ్యాపారాలను సబ్సిడరీ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కు బదలాయించే ప్రతిపాదనకు సైతం ఆమోదముద్ర పడింది. ఐటీ పరిశ్రమఫండమెంటల్గా, నిర్మాణాత్మకమైన మార్పులను సంతరించుకుంటోంది. గడిచిన త్రైమాసికంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. మేం కొత్తగా అనుసరిస్తున్న ‘రెన్యూ-న్యూ’ వ్యూహంలో ఆరంభ విజయాలను ఆస్వాదిస్తున్నాం. 2017కల్లా దేశీ ఐటీ పరిశ్రమ సగటు వృద్ధి రేటును అందుకోగలమన్న విశ్వాసం ఉంది. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
రిలయన్స్ లాభం భేష్!
క్యూ4లో రూ.6,381 కోట్లు; 8.5 శాతం జూమ్ ⇒ రికార్డు రిఫైనింగ్ మార్జిన్ల తోడ్పాటు; జీఆర్ఎం 10.1 డాలర్లు ⇒ టర్నోవర్ రూ.70,863 కోట్లు; 33 శాతం డౌన్ ⇒ షేరుకి రూ.10 చొప్పున డివిడెండ్ న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకుంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ రూ.6,381 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,881 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది. పెట్రోకెమికల్, చమురు-గ్యాస్ వ్యాపారం మందగించినప్పటికీ... రికార్డు స్థాయి రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు తోడ్పడ్డాయి. కాగా, గడచిన ఏడేళ్లకుపైగా కాలంలో ఈ కంపెనీ ఒక క్వార్టర్లో ఇంత భారీస్థాయి లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్యూ4లో రిలయన్స్ కన్సాలిడేటెడ్ టర్నోవర్ రూ.70,863 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో టర్నోవర్ రూ.1.06 లక్షల కోట్లతో పోలిస్తే 33.3 శాతం దిగజారింది. క్రూడ్ ధరల తగ్గుదల, ఎగుమతుల్లో క్షీణత ఆదాయాలపై ప్రభావం చూపిం ది. డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో నికర లాభం రూ. 5,256 కోట్లతో పోలిస్తే.. మార్చి(క్యూ4) క్వార్టర్ లాభం త్రైమాసింగా (సీక్వెన్షియల్) 21.4% ఎగసింది. దేశ కార్పొరేట్ రంగ లాభాల చరిత్రలో ఇదే అతిపెద్ద సీక్వెన్షియల్ వృద్ధి అని పరిశీలకులు పేర్కొంటున్నారు. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే... రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇతరత్రా ప్రధాన వ్యాపారాల(స్టాండెలోన్)కు సంబంధించి రిలయన్స్ క్యూ4 నికర లాభం 10.9 శాతం ఎగబాకి రూ.6,243 కోట్లుగా నమోదైంది. 2007-08 క్యూ3లో రూ.8,079 కోట్ల లాభం తర్వాత మళ్లీ ఇదే అత్యధిక లాభమని కంపెనీ తెలిపింది. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.23,566 కోట్లకు పెరిగింది. 2013-14లో లాభం రూ.22,493 కోట్లతో పోలిస్తే 4.8% వృద్ధి చెందింది. ఇక టర్నోవర్ 13 శాతం క్షీణించి రూ.3.88 లక్షల కోట్లకు దిగజారింది. 2013-14లో టర్నోవర్ రూ.4.46 లక్షల కోట్లుగా నమోదైంది. ‘ముడి చమురు ధరల భారీ పతనం, హైడ్రోకార్బన్స్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరాన్ని విజయవంతంగా ముగించాం. ఇది మాకు చాలా కీలకమైన ఏడాదిగా కూడా నిలిచింది. రిఫైనింగ్ వ్యాపారంలో రికార్డు రాబడులు నమోదయ్యాయి. అధునాతన డిజిటల్ సర్వీసులు, హైడ్రోకార్బన్స్ వ్యాపారంలో భారీస్థాయి పెట్టుబడుల ద్వారా వృద్ధి జోరును కొనసాగిస్తాం. ఇక మా రిటైల్ వ్యాపారం అత్యంత వేగంగా పురోగమిస్తోంది’. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ రికార్డు జీఆర్ఎం మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం- ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించిన రాబడి) రికార్డు స్థాయిలో 10.1 డాలర్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 9.3 డాలర్లుగా ఉంది. ఇక 2014-15, డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో ఇది 7.3 డాలర్లే. ఇక 2015-16 పూర్తి ఏడాదికి జీఆర్ఎం 8.6 డాలర్లుగా నమోదైంది. ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు... ⇒ రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకి కంపెనీ రూ.10 చొప్పున(100 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. ⇒ 2014-15 క్యూ4లో పెట్రోకెమికల్స్ వ్యాపార ఆదాయం రూ. 26,541 కోట్ల నుంచి రూ.21,754 కోట్లకు తగ్గింది. రిఫైనింగ్ టర్నోవర్ రూ.96,668 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ టర్నోవర్ రూ.56,442 కోట్లు. ⇒ చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం రూ.2,798 కోట్ల నుంచి రూ.2,513 కోట్లకు క్షీణించింది. ఇక ఈ విభాగం పన్ను ముందు లాభం ఏకంగా 36 శాతం పడిపోయి రూ.489 కోట్లకు పరిమితమైంది. ⇒ కేజీ-డీ6లో గ్యాస్-క్రూడ్ ఉత్పత్తి క్షీణత, తక్కువ గ్యాస్ ధరలు కూడా ఈ విభాగంలో ఆదాయాన్ని దెబ్బతీశాయని ఆర్ఐఎల్ పేర్కొంది. క్యూ4లో ఇక్కడ 0.6 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు, 36.5 బిలియన్ ఘనపుటడుగుల సహజవాయువును మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. క్యూ3తో పోలిస్తే... క్రూడ్ ఉత్పత్తి 3 శాతం, గ్యాస్ ఉత్పత్తి 5% తగ్గినట్లు వెల్లడించింది. ⇒ తాజాగా ముగిసిన స్పెక్ట్రం వేలంలో ఆర్ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 13 కీలక సర్కిళ్లలో స్పెక్ట్రంను దక్కించుకుంది. ఇందులో 800, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రం ఉంది. దీంతో తమకు ఇప్పుడు మొత్తం 22 సర్కిళ్లలో స్పెక్ట్రం ఉన్నట్లయిందని కంపెనీ తెలిపింది. కాగా, 2,300 మెగాహెర్ట్జ్ బ్యాండ్(4జీ)లో దేశవ్యాప్తం స్పెక్ట్రం ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభానికి విస్తృతంగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ⇒ మార్చి చివరినాటికి ఆర్ఐఎల్ మొత్తం రుణ భారం రూ.1.6 లక్షల కోట్లకు ఎగసింది. 2014 డిసెంబర్‌నాటికి ఈ మొత్తం రూ.1.5 లక్షల కోట్లు. కాగా, కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు మాత్రం రూ.78,691 కోట్ల నుంచి రూ.84,472 కోట్లకు పెరిగాయి. ⇒ శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర స్వల్ప నష్టంతో రూ.927 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రిటైల్ జూమ్... ఆర్ఐఎల్ రిటైల్ వ్యాపార విభాగం మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఈ వ్యాపార ఆదాయం క్యూ4లో రూ.3,653 కోట్ల నుంచి రూ.4,788 కోట్లకు ఎగబాకింది. ఏకంగా 31 శాతం దూసుకెళ్లింది. ఇక పన్ను ముందు లాభం క్యూ4లో రూ.24 కోట్ల నుంచి రూ.104 కోట్లకు ఎగసింది. 333 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2014-15 పూర్తి ఏడాదికి ఈ విభాగం ఆదాయం రూ.14,556 కోట్ల నుంచి రూ.17,640 కోట్లకు(21 శాతం అప్) ఎగబాకింది. పన్ను ముందు లాభం రూ.118 కోట్ల నుంచి రూ.417 కోట్లకు పెరిగింది. అంటే 250 శాతం పైగా దూసుకెళ్లినట్లు లెక్క. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ కొత్తగా 930 స్టోర్లను ప్రారంభించింది. దీంతో మార్చి నాటికి కంపెనీ మొత్తం రిటైల్ స్టోర్ల సంఖ్య మొత్తం 200 నగరాల్లో 2,621కి చేరింది. -
టీసీఎస్ లాభాలు మై(బో)నస్
క్యూ4లో రూ. 3,713 కోట్లు, 31 శాతం తగ్గుదల ⇒ఉద్యోగులకు రూ. 2,628 కోట్ల భారీ బోనస్ ఫలితం... ⇒బోనస్ సర్దుబాటుకు ముందు నికర లాభం రూ .5,773 కోట్లు; 7.7% వృద్ధి ⇒మొత్తం ఆదాయం రూ. 24,220 కోట్లు; 12.3 శాతం అప్ ⇒షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్... ముంబై: దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ ఆర్థిక ఫలితాలపై ఉద్యోగుల బోనస్ ప్రభావం పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,713 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,358 కోట్లతో పోలిస్తే లాభం భారీస్థాయిలో 30.6 శాతం దిగజారింది. అయితే, సిబ్బందికి ప్రకటించిన వన్‌టైమ్ బోనస్ రూ. 2,628 కోట్లు ఇతరత్రా సర్దుబాట్ల ప్రకారం చూస్తే.. క్యూ4లో నికర లాభం రూ.5,773 కోట్లుగా నమోదైందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతేడాది క్యూ4తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.7% ఎగబాకినట్లు లెక్క. ఇక కంపెనీ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.21,551 కోట్ల నుంచి రూ.24,220 కోట్లకు పెరిగింది. 12.4 శాతం వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.5,410 కోట్లు, ఆదాయం రూ.24,456 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీన్నిబట్టిచూస్తే మెరుగైన ఫలితాలనే టీసీఎస్ ప్రకటించినట్లయింది. ఇదిలాఉండగా.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఎప్పుడూ ఆర్థిక ఫలితాల ప్రధాన సీజన్ ప్రారంభం కావడం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అందుకుభిన్నంగా టీసీఎస్ ఫలితాలు ముందుగా వెలువడటం విశేషం. సీక్వెన్షియల్‌గా తగ్గిన ఆదాయం... 2014-15 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే త్రైమాసికం ప్రాతిపదికన(సీక్వెన్షియల్‌గా) టీసీఎస్ మొత్తం ఆదాయం 1.1% తగ్గింది. క్యూ3లో మొత్తం ఆదాయం రూ.24,501 కోట్లుగా నమోదైంది. ఇక క్యూ3లో లాభం రూ.5,327 కోట్లతో సరిపోల్చితే క్యూ4 లాభం 30.3% పడిపోయింది. అయితే, బోనస్ సర్దుబాటు ప్రకారం మాత్రం సీక్వెన్షియల్‌గా లాభం 8.3 శాతం ఎగసింది. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ రూ.19,852 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.19,164 కోట్లుగా నమోదైంది. 3.5 శాతం పెరిగింది. అయితే, బోనస్ సర్దుబాటు ప్రకారం చూస్తే 2014-15 పూర్తి ఏడాదికి నికర లాభం రూ.21,912 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. అంటే 14.3 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. ఇక మొత్తం ఏడాదికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.81,809 కోట్ల నుంచి రూ.94,648 కోట్లకు ఎగబాకింది. 15.7 శాతం పెరుగుదల నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ఒక్కో షేరుకి రూ.24 చొప్పున తుది డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది. దీంతో 2014-15 ఏడాదికిగాను ఇన్వెస్టర్లకు మొత్తం డివిడెండ్ ఒక్కో షేరుకి రూ.79కి చేరింది. ⇒క్యూ4లో కంపెనీ స్థూలంగా రూ.14,395 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 13,364 మంది ఉద్యోగులు వలసపోవడంతో నికరంగా క్యూ4లో జతైన సిబ్బంది సంఖ్య 1,031కే పరిమితమైంది. వలసల(అట్రిషన్) రేటు 14.9 శాతంగా నమోదైంది. ⇒ఇక 2014-15 పూర్తి ఏడాదిలో స్థూలంగా 67,123 మందిని, నికరంగా 19,192 మంది సిబ్బందిని కంపెనీ జతచేసుకుంది. దీంతో 2015 మార్చి చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,19,656గా నమోదైంది. ⇒ఇక ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోనున్నట్లు టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ తెలిపారు. ఇందులో 35,000 క్యాంపస్ నియామకాలు ఉంటాయని చెప్పారు. అయితే, 2014-15తో పోలిస్తే మొత్తం స్థూల నియామకాల సంఖ్య తక్కువే. ⇒అదేవిధంగా భారత్‌లో సిబ్బందికి సగటున 8 శాతం, విదేశాల్లోని కంపెనీ ఉద్యోగులకు 2-4 శాతం మేర వేతనాలను పెంచుతున్నట్లు కూడా ముఖర్జీ ప్రకటించారు. ⇒ కంపెనీ వద్ద మార్చి నాటికి రూ.23,000 కోట్ల నగదు, తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. గురువారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు ధర 1.5 శాతం క్షీణించి రూ.2,585 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు ఉంటాయని మేం ముందే సంకేతాలిచ్చాం. ప్రధానంగా టెలికం, బీమా, ఇంధన రంగాల నుంచి కొంత ప్రతికూలతలు ఎదురయ్యాయి. దీని ప్రకారం కొంత మార్జిన్లు తగ్గినప్పటికీ.. మొత్తంమీదచూస్తే మంచి పనితీరునే కనబరిచాం. క్లయింట్ల సానుకూల వ్యాపార సెంటిమెంట్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిపై ఆశాజనకంగానే ఉన్నాం. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ ఉద్యోగులకు బంపర్ బొనాంజా టీసీఎస్ తమ సిబ్బందికి రికార్డు స్థాయిలో బంపర్ బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ-2004, ఆగస్టు)కి వచ్చి పదేళ్లయిన సందర్భంగా ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.2,628 కోట్ల వన్‌టైమ్ బోనస్‌ను ఇస్తున్నట్లు గురువారం వెల్లడించింది. భారతీయ కార్పొరేట్ రంగ చరిత్రలో అతిపెద్ద బోనస్ చెల్లింపుల్లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకున్న సిబ్బందిలో కనీసం ఏడాది సర్వీసు పూర్తిచేసుకున్నవారందరూ బోనస్ తీసుకునేందుకు అర్హులేనని తెలిపింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి కంపెనీలో దాదాపు 3.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఒక్కో ఉద్యోగికి తన ఒక్కో ఏడాది సర్వీసు కాలానికి ఒక వారం జీతం చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ వివరించింది. ఏప్రిల్/మే నెలల్లో చెల్లింపు ఉంటుందని పేర్కొంది. అనేక గ్లోబల్ కంపెనీలకు తాము వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నామని.. ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నవకల్పనల విషయంలో తమ ఉద్యోగుల సామర్థ్యమేంటో అందరికీ సుపరిచితమేనని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్. చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన, గౌరవనీయమైన టెక్నాలజీ సేవల కంపెనీగా టీసీఎస్‌ను నిలబెట్టడంలో సిబ్బంది పోషించిన సమర్థవంతమైన పాత్రకుగాను ప్రత్యేక రివార్డుగా ఈ బోనస్‌ను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, 2004లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన టీసీఎస్.. మార్కెట్ క్యాపిటలైజేషన్(కంపెనీ మొత్తం షేర్ల విలువ-రూ.5.06 లక్షల కోట్లు) పరంగా ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. -
విప్రో లాభం 2,085 కోట్లు
అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు వ్యాపార వృద్ధిపై అత్యంత విశ్వాసంతో ఉన్నాయి. దీంతో ఐటీ క్లయింట్లు టెక్నాలజీ వినియోగంపై భారీగా పెట్టుబడులు వెచ్చించేందుకు ముందుకొస్తున్నారు. మరోపక్క, దేశీయంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధిని గాడిలోపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా కార్పొరేట్ రంగంలో విశ్వాసం పెంచుతోంది. - అజీమ్ ప్రేమ్‌జీ, విప్రో చైర్మన్ ► క్యూ2లో 7.9% వార్షిక వృద్ధి ► ఆదాయం 7.5 శాతం అప్; రూ.11,816 కోట్లు బెంగళూరు: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.2,085 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,932 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.9 శాతం వృద్ధి నమోదైంది. ఇన్ఫ్రా సేవల విభాగంలో మెరుగైన పనితీరు ఇందుకు తోడ్పడిందని కంపెనీ పేర్కొంది. కాగా, క్యూ2లో మొత్తం ఆదాయం 7.5 శాతం ఎగబాకి రూ.11,816 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం రూ.10,991 కోట్లుగా ఉంది. కాగా, సీక్వెన్షియల్‌గా చూస్తే(ఈ ఏడాది ఏప్రిల్-జూన్, క్యూ1లో రూ.2,103 కోట్లతో పోలిస్తే) నికర లాభం దాదాపు 1 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం త్రైమాసిక ప్రాతిపదికన 5 శాతం పెరగడం గమనార్హం. గెడైన్స్‌కు అనుగుణంగానే సాఫ్ట్వేర్ ఆదాయం... ఐటీ సేవల ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్లో 1.77 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 8.6 శాతం, ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే 1.8 శాతం చొప్పున పెరిగింది. కంపెనీ జూలైలో పేర్కొన్న ఆదాయ అంచనా(గెడైన్స్) 1.77-1.81 బిలియన్ డాలర్ల స్థాయిలోనే క్యూ2 గణాంకాలు నమోదయ్యాయి. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనా 1.78 బిలియన్ డాలర్ల కంటే కొద్దిగా తక్కువగా ఆదాయం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.80-1.84 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఈ ఏడాది(2014-15) ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం ఐటీ పరిశ్రమకు చాలా సానుకూలంగా ఉంటుందని విప్రో సీఈఓ టీకే కురియన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డిమాండ్ స్థిరంగా కొనసాగుతోందని.. ప్రధానంగా ఉత్తర అమెరికాలో వ్యయాలు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. యూరప్‌లో కూడా అవుట్సోర్సింగ్ వృద్ధి అవకాశాలు జోరందుకుంటున్నాయని కురియన్ తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు... ► సెప్టెంబర్ చివరినాటికి ఐటీ సేవల విభాగం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,297కు చేరింది. ► ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం క్యూ2లో రూ.920 కోట్లుగా నమోదైంది. ► జూలై-సెప్టెంబర్ మూడు నెలల వ్యవధిలో 50 మంది కొత్త క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది. ► ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం విప్రో షేరు ధర బుధవారం 1.47 శాతం లాభంతో రూ.582 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.


