అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..! | US tariffs Have Had No Impact on Chinese Trade | Sakshi
Sakshi News home page

అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!

Dec 10 2025 2:48 AM | Updated on Dec 10 2025 2:48 AM

US tariffs Have Had No Impact on Chinese Trade

అమెరికా టారిఫ్‌లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్‌ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.

ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్‌ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్‌ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్‌ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్‌ పవర్‌గా కొనసాగుతోంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్‌లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్‌ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్‌లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్‌కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్‌ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement