తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,150 కోట్ల క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌ | Star Health Settles Claims Worth Rs 1150 Crore in Telugu States: Himanshu Walia | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో రూ. 1,150 కోట్ల క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌

Mar 14 2026 12:29 AM | Updated on Mar 14 2026 12:29 AM

Star Health Settles Claims Worth Rs 1150 Crore in Telugu States: Himanshu Walia

స్టార్‌ హెల్త్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ హిమాంశు వాలియా వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తెలుగు రాష్ట్రాల్లో 1.7 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 1,150 కోట్లు సెటిల్‌ చేసింది. 24 లక్షల మందికి పైగా బీమా కవరేజీ అందిస్తోంది. నగదురహిత క్లెయిమ్స్‌లో 96% క్లెయిమ్స్‌ని 3 గంటల వ్యవధిలోనే సెటిల్‌ చేస్తున్నట్లు సంస్థ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ హిమాంశు వాలియా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 75 శాఖల వ్యాప్తంగా 89,000 మంది అడ్వైజర్లు, 1,800 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయని, తమ వ్యాపారంలో ఈ రాష్ట్రాల వాటా 10%గా ఉంటుందని చెప్పారు.

బీమా పాలసీలను మరింత చౌకగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను పాలసీదారులకు పూర్తిగా బదలాయించామని, ప్రీమియంలు సైతం పెంచలేదని పేర్కొ న్నారు. కృత్రిమ మేధ దన్నుతో 20 శాతం క్లెయిమ్‌లను పరిష్కరిస్తుండగా, వచ్చే రెండేళ్లలో దీన్ని 50%కి పెంచుకోనున్నామని హిమాంశు తెలిపారు.  ఇందుకోసం టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement