-
ఐదేళ్లకే అబ్బురపరుస్తున్న హిమాన్షు! కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో..
ఆదిలాబాద్: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. భైంసా పట్టణానికి చెందిన జిలకరి రాజేశ్వర్–రజిత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడైన హిమాన్షు ప్రస్తుతం గుజిరిగల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, సెకండ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలు–రాజధానుల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాక తోటి పిల్లలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అని నేర్చుకుంటుంటే తను మాత్రం ఆంగ్ల అక్షరాలతో పురాణ పురుషుల పేర్లు కంఠస్తంగా చెబుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ అంటూ జెడ్ ఫర్ జాంబవంత వరకు పురాణ పురుషుల పేర్లు పొల్లు పోకుండా చెబుతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి ప్రతిభ చూసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఇవి చదవండి: వసుధైక కుటుంబం.. ఐదు తరాల అనుబంధం -
KTR: భావోద్వేగానికి గురైన ఓ నాన్న
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించి భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు కల్వకుంట్ల హిమాన్షు రావు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. నిన్న మొన్నటి వరకు కళ్ళముందే అల్లరిగా ఉండే ఈ పిల్లాడు పెరిగి, కాలేజీకి వెళ్లడాన్ని నమ్మలేకపోతున్నా. నాలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడు అంటూ కొడుక్కి సంబంధించిన చిన్ననాటి నుంచి ఫొటోలను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారాయన. Most cliched line probably from a parent but here we go Can’t believe this Boy who was a naughty little kid till yesterday is all grown up and now off to College!! As he goes, he’s taking a part of me with him ❤️ Daddy duties; off to the US with family for over a week where I… pic.twitter.com/7k3G9oEi0u — KTR (@KTRBRS) August 19, 2023 తాను కూడా ఫ్యామిలీతో కలిసి వారం పాటు అమెరికాలో ఉంటానని, పనిలో పనిగా తాను కూడా తన విధుల్ని నిర్వహిస్తానని తెలిపారాయన.కేటీఆర్ వెంట ఆయన భార్య, కుమారుడు హిమాన్షు వెళ్లారు. పర్యటన చివర్లో హిమాన్షును అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు. మరోవైపు హిమాన్షు కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. pic.twitter.com/sZbnjOovBs — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) August 19, 2023 మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెట్టుబడుల కోసం న్యూయార్క్, చికాగోలో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. -
తెలంగాణ అసెంబ్లీలో హిమాన్షు
-
తాత కేసీఆర్ స్పీచ్‌ను దగ్గరనుంచి చూసిన హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సందర్శకుల గ్యాలరీలో మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు ఆదివారం తన స్నేహితులతో కలిసి వచ్చి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ప్రసంగం, అనంతరం తన తాత, సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానాన్ని హిమాన్షు విన్నారు. కాగా, నాలుగు రోజులపాటు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. -
హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..!
హైదరాబాద్: ‘హాయ్.. హిమాన్షు అన్నా. మేం హిమాయత్‌నగర్ దత్తానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం. మా బడి పరిస్థితేమీ బాలేదు. అన్నీ సమస్యలే. మీరు మాపై దయ చూపి మా స్కూల్‌ను కూడా దత్తత తీసుకోండన్నా’ అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును అభ్యర్థించారు. వీరికి ఏఐవైఎఫ్, బాలసంఘం విద్యార్థి నాయకులు మద్దతు పలికారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మంచినీళ్లు సరిగా లేవు. మరుగుదొడ్లకు తలుపులు లేవు. నీరు లీకేజీ అవుతోంది. మెట్లన్నీ పగిలిపోయాయి. ప్రవేశం ద్వారం వద్ద ఉన్న మోరీకి మ్యాన్‌హోల్ లేకపోవడంతో అందులో పడిపోతామేమో అని భయమేస్తోంది’.. ఇలా సమస్యలను ఏకరువు పెడుతూ ప్లకార్డుల ద్వారా తెలిపారు. ‘మన బస్తీ– మన బడి’లో భాగంగా ఈ పాఠశాలకు ఇంకా నిధులు రాలేదని, ఇక్కడ అన్నీ సమస్యలేనని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర తెలిపారు. –హిమాయత్‌నగర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement