కేటీఆర్ కొడుకుపై తీన్మార్‌ మల్లన్న ట్వీట్‌ దుమారం.. చెప్పు దెబ్బలు తప్పవంటున్న బాల్క సుమన్‌

Teenmaar Mallanna Body Shames KTR Son, MLA Balka Suman Denied - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్ చేశాడనిటీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే దీనిపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడితూ.. తన కొడుకును రాజకీయాల్లోకి లాగారంటూ దుయ్యబట్టారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీన్మార్‌ మల్లన్న కేటీఆర్‌ కుమారుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దీని వెనుక బీజేపీ. బండి సంజయ్ కుట్ర ఉందని, ఇదే బీజేపీ సంస్కృతి అని విమర్శించారు. తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ తన పద్దతి మార్చుకోవాలని, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ పార్టీ ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.

‘నేను వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చీము నెత్తురు ఉంటే నేను ఐటీ రిటర్న్స్ సమర్పిస్తున్న. క్కువ ఉన్నట్లు నిరూపించండి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గతంలో అనేక సార్లు మేము కంప్లైంట్ చేశాం. రాష్ట్ర డీజీపీ స్పందించాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఏం చేస్తోంది. ఎకేంద్రంలో ఖాళీగా ఉన్న 8 లక్షల 72వేల ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ గడ్డిపీకుతున్నారా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయరో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. దీనికి బండి సంజయ్ మొదట సమాధానం చెప్పాలి. దమ్ముంటే బండి, అరవింద్, కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం ఆపండి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని బాల్క సుమన్‌ తెలిపారు.

చదవండి: హిమాన్షును ఉద్దేశిస్తూ పోస్ట్‌.. స్పందించిన వైఎస్‌ షర్మిల

తీన్మార్ మల్లన్నపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి
పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ పురపాలక ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై దుర్భాషలాడిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బీ. దినేష్  శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ఉందంటూ తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న నవీవ్‌ను నిలువరించాలసిన అవసరం ఉందని అన్నారు.

సోషల్ మీడియాపై తీవ్రంగా స్పందిస్తున్న బీజేపీ నేతలు ఆ  పార్టీలో చేరిన మల్లన్నను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు‌. న్యాయస్థానం సైతం  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. ప్రస్తుతం షరతులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మల్లన్న బెయిల్ను రద్దు చేయాలని న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top