కేటీఆర్‌ను మించిన హిమాన్షు! | Ktr hugs son Himanshu rao photo goes viral | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను మించిన హిమాన్షు!

Apr 13 2019 12:33 PM | Updated on Apr 13 2019 7:11 PM

Ktr hugs son Himanshu rao photo goes viral - Sakshi

తన తనయుడు హిమాన్షు ఆలింగనంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సేద తీరుతున్న ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌ : తన తనయుడు హిమాన్షు ఆలింగనంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సేద తీరుతున్న ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 13 ఏళ్లకే మీ కుమారుడు ఎత్తులో మిమ్మల్ని మించిపోతే..  గట్టిగా ఓ హగ్‌ను కాకుండా ఇంకా ఏం కోరుకుంటారు అంటూ కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు.

ఇటీవలే జాతీయ పర్యావరణ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి హిమాన్షు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించిన బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌లో వ్యక్తిగత విభాగంలో హిమాన్షురావు 29,482 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో తండ్రికి తగ్గ తనయుడంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్పందించారు. ఇక కేటీఆర్‌ తాజా ట్వీట్‌తో తండ్రిని మించిన తనయుడు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement