ప్రపంచ టెక్నాలజీ రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజాల ఆహారపు అలవాట్లపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ శాకాహారులని ఫ్రీస్టైల్ క్లౌడ్ సీఈఓ బెన్ స్వెర్డ్లో తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
అయితే దీనిపై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం తన ఆహారపు అలవాట్లు ఇందుకు భిన్నంగా ఉంటాయని చెప్పారు. “నేను ప్రతిరోజూ ఉదయం స్టీక్, గుడ్లు తింటాను.. కాఫీ తాగుతాను” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సామ్ ఆల్ట్‌మన్ తాను చిన్నప్పటి నుంచే శాకాహారినని గతంలో వెల్లడించారు. సుందర్ పిచాయ్ కూడా తాను శాకాహారినని, ఉదయం చాయ్‌తో పాటు ప్రొటీన్ కోసం ఆమ్లెట్, టోస్ట్ తీసుకుంటానని తెలిపారు. ఇక డారియో అమోడెయ్ తన సోదరి డానియెలా ప్రేరణతో శాకాహారిగా మారినట్లు చెప్పారు.
శాకాహారులుగా మారడానికి కారణాలు ఏమిటి?
ఆరోగ్యం, మత విశ్వాసాలు, జంతు సంరక్షణ, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో చాలామంది శాకాహారాన్ని ఎంచుకుంటారు. అంతేకాదు మాంసాహారం లేకుండా తీసుకునే ఆహారం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ 2024లో వెల్లడించింది.
ఇదీ చదవండి: గ్రీన్‌కార్డ్ ఆశావహులకు ట్రంప్ బిగ్ షాక్


