షేక్ హసీనా వీడియో : ఆ అధికారి అనుమానాస్పద మృతి కలకలం | Bangladesh Ex Air Force Officer Found Dead In Turag River After Allegedly Posting Video Of Sheikh Hasina Fleeing The Country | Sakshi
Sakshi News home page

షేక్ హసీనా వీడియో : ఆ అధికారి అనుమానాస్పద మృతి కలకలం

Oct 30 2026 11:33 AM | Updated on Oct 30 2026 12:15 PM

After Explosive Hasina Video Podcast Bangladesh Ex Officer Found Dead

2024లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్తున్నప్పటి వీడియోను అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ వాయుసేన మాజీ అధికారి  కె.ఎమ్. తహసీఫ్  (KM Tahsif Sauri) అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. ఆయన కనిపించకుండా పోయిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనలను రేకెత్తించింది. మాజీ ప్రధానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసినప్పటి నుండి ఆయన వేధింపులకు గురవుతున్నారని, ఆ కారణం చేతనే ఆయనను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నల్లని షర్టు, తెల్లని ప్యాంటు ధరించి ఉన్న 28 ఏళ్ల  కె.ఎమ్. తహసీఫ్ సౌరి మృతదేహాన్ని అక్టోబర్ 28న తురాగ్ నదిలో గుర్తించారు. ఢాకాలోని ఉత్తర్‌ఖాన్ ప్రాంతంలో ఉన్న రాజాబారి ఘాట్ సమీపంలో, జాతీయ అత్యవసర హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమాచారం మేరకు నదీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణానికి గల కారణాలు ఇంకా  వెలుగులోకి రాలేదు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గత ఏడాది ఆగస్టులో 'అమర్ దేశ్' అనే వార్తాపత్రిక (ఇది జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధం ఉన్న సంస్థకు చెందినది) తహసీఫ్ భారత గూఢచారి సంస్థ 'రా' (R&AW) కోసం పనిచేస్తున్నాడని తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనే ఆయనను సర్వీసు నుండి తొలగించారు. అప్పట్లో తలెత్తిన అనేక ప్రశ్నలు, ఆయన మరణంతో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆ ఘటన తర్వాత, ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును రెండేళ్ల పాటు స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి: 15 అడుగుల గోతిలో 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement