రాణించిన క్యాంప్‌బెల్‌, చంద్రపాల్‌ | BAN VS WI 1st Test: west indies trail by 138 runs at day 2 stumps | Sakshi
Sakshi News home page

రాణించిన క్యాంప్‌బెల్‌, చంద్రపాల్‌

Oct 29 2026 7:45 PM | Updated on Oct 29 2026 7:48 PM

BAN VS WI 1st Test: west indies trail by 138 runs at day 2 stumps

source: X

బంగ్లాదేశ్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు వాతావరణం ప్రతికూలతగా మారింది. ఈ మ్యాచ్‌ తొలి రోజు వెలుతురులేమి సమస్య ఇబ్బంది పెట్టగా, రెండో రోజు వరుణుడు ఆటంకం కలిగించాడు. వాతావరణ ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 272 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. విండీస్‌ బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 138 పరుగులు వెనుకపడి ఉంది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో జాన్‌ క్యాంప్‌బెల్‌ (54) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (43 నాటౌట్‌), జస్టిన్‌ గ్రీవ్స్‌ (15 నాటౌట్‌) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. మిగతా ప్లేయర్లలో బ్రాండన్‌ కింగ్‌ 15, కవెమ్‌ హాడ్జ్‌ 7, ఆమిర్‌ జాంగూ డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం 2, హసన్‌ మహముద్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం (105) సెంచరీతో సత్తా చాటాడు. తౌహిద్‌ హృదోయ్‌ (42), లిటన్‌ దాస్‌ (34 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

మిగతా ప్లేయర్లలో తంజిద్‌ హసన్‌ 7, మొమినుల్‌ హక్‌ 28, నజ్ముల్‌ హసన్‌ షాంటో 19, మెహిది హసన్‌ మిరాజ్‌ 15, నయీమ్‌ హసన్‌ 5, హసన్‌ మహముద్‌ 6, తైజుల్‌ ఇస్లాం 1, షొరిఫుల్‌ ఇస్లాం డకౌటయ్యారు. విండీస్‌ బౌలర్లలో జోమెల్ వారికన్ ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అతడికి జాషువ బిషప్‌ (2-61), షమార్‌ జోసఫ్‌ (2-41), జేడన్‌ సీల్స్‌ (1-29) సహకరించారు. 

ఇదీ చదవండి: కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement