డకెట్‌ మెరుపు శతకం.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ | Ben Duckett Slams 167, England scores 386 runs vs sri lanka | Sakshi
Sakshi News home page

డకెట్‌ మెరుపు శతకం.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌

Oct 29 2026 5:34 PM | Updated on Oct 29 2026 5:45 PM

Ben Duckett Slams 167, England scores 386 runs vs sri lanka

source: X

పాకిస్తాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఇవాళ ఇంగ్లండ్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నీలో ఫైనల్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారుకావడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగుతోంది. పాక్‌, శ్రీలంక జట్లు అక్టోబర్‌ 31న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

డకెట్‌ మెరుపు శతకం
శ్రీలంకతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (132 బంతుల్లో 167; 24 ఫోర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది.

మిగతా ఇంగ్లండ్‌ ప్లేయర్లలో టామ్‌ బాంటన్‌ 74, కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ 44, విల్‌ జాక్స్‌ 30, జోర్డన్‌ కాక్స్‌ 43, సామ్‌ కర్రన్‌ 21 (నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో 2, దిల్షన్‌ మధుషంక, ఎషాన్‌ మలింగ, దసున్‌ షనక తలో వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లిస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement