source: X
ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ 28 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థ పర్సోనియోలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు తన లింక్డ్‌ఇన్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
ఐర్లాండ్ తరఫున ఆడటం, మూడు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం, మూడు టీ20 ప్రపంచకప్‌లలో జట్టుతో కలిసి ఉండటం తనకు గర్వకారణమని పేర్కొన్నాడు. క్రికెట్ ద్వారా ఎన్నో జ్ఞాపకాలు, పాఠాలు, జీవితకాల స్నేహాలు లభించాయని తెలిపాడు.
2021 జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బెన్ వైట్.. ఐర్లాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 43 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది డిసెంబర్‌లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.
వైట్ తన కెరీర్‌లో టీ20 క్రికెట్‌లోనే ఎక్కువగా రాణించాడు. 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టాడు. 2021, 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లలో ఐర్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ మూడు టోర్నీల్లో కలిపి కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు.
2023లో రెండు వన్డేలు, మూడు టెస్టులు ఆడాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు అరంగేట్రంలో మూడు వికెట్లు తీసుకున్న అతడు.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో ఏకంగా 322 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.
ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లిస్


