15 అడుగుల గోతిలో 3 బ్లూ డమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు | 2 Brothers 3 Buried Drums UP Cops Unearth Cash Worth Crores | Sakshi
Sakshi News home page

15 అడుగుల గోతిలో 3 బ్లూ డమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు

Oct 29 2026 6:47 PM | Updated on Oct 29 2026 6:59 PM

2 Brothers 3 Buried Drums UP Cops Unearth Cash Worth Crores

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) సమీపంలోని ఒక సాధారణ  ఇంట్లో భూమిలో మూడు డ్రమ్ముల నిండా కోట్ల రూపాయల నగదు పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఆ డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టడం దిగ్భ్రాంతి రేపింది.  ఇద్దరు సోదరులు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టిన ఈ నల్లధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల గ్రామస్థులకు, ఈ సోదరులకు మధ్య గొడవ జరగడంతో ఈ విషయం వెలుగు చూసింది. ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని గంగానగర్ జోన్, నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ (బరాయ్‌పూర్) గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక ఇంట్లోని గదిలో  దాదాపు 5 మీటర్ల  లోతున మూడు భారీ ప్లాస్టిక్  బ్లూడ్రమ్ములో భారీ  ఎత్తున  నగదు దాచి ఉంచారనే సమాచారం   మేరకు  నవాబ్‌గంజ్ , సోరావ్ పోలీస్ స్టేషన్ల ఉమ్మడి  పోలీస్‌ బృందం దాడి చేసింది. ఈ క్రమంలో ఇంట్లోని ఒక గదిలో ఇటీవల  తవ్వినట్లు అనుమానం వచ్చి, కూలీలతో తవ్వించగా లోపల మూడు ప్లాస్టిక్ డ్రమ్ములు బయటపడ్డాయి.  ఈ డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టారు. వాటిని తెరచి చూడగా రూ. 500 నోట్ల కట్టలతో నిండిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు ఉండవచ్చని  అంచనా. డబ్బు లెక్కింపు కోసం ఆదాయపన్ను (IT) శాఖ ,ఇతర ఆర్థిక విచారణ సంస్థలకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాతే కచ్చితమైన సొమ్ము ఎంత అనేది తేలనుంది.

అనుమానాలు
ఈ ఇల్లు రాకేష్ యాదవ్, రాజేష్ యాదవ్ అనే సోదరులకు చెందినది. వీరు గతంలో పూణేలో సాధారణ ఉద్యోగాలు చేసేవారు. 2020లో  కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగాలు వదిలేసి సొంత గ్రామానికి తిరిగొచ్చారు .గ్రామానికి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వారు ఎకరాల కొద్దీ స్థలాలు, ట్రాక్టర్లు కొనడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం ప్రారంభించారు. ఒక సాధారణ ఉద్యోగం చేసేవారికి ఇంత డబ్బు ఎక్కడిది అని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. దీనికి తోడు ఇటీవల గ్రామస్థులకు, ఈ సోదరులకు మధ్య గొడవ జరిగినప్పుడు, ఒక స్థానికుడు పోలీసులకు ఫోన్ చేసి వీరి వద్ద భారీగా నల్లధనం ఉందని ఫిర్యాదు చేశారు.

 

ఇదీ చదవండి: షాకిచ్చిన కర్ణాటక : లీటరు పాల ధర రూ. 8 పెంపు

కేసు నమోదు 
స్థానికుడి సమాచారం ఆధారంగా దాడి చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, ఆ ఇంటిని సీల్ చేశారు. కుటుంబానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకోగా, అతను మార్చి మార్చి సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement