బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు భారీ షాకిచ్చింది. నందిని పాల ధరలను లీటరుకు ఏకంగా రూ. 8 పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. పెరిగిన నూతన ధరలు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. లీటరుకు రూ. 8 నుండి 10 వరకు పెంచాలని మిల్క్ యూనియన్లు కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయ తీసుకుంది.
కొత్త ధరలు ఇలా..
బ్లూ కలర్ ప్యాకెట్‌లో లభించే నందిని బేసిక్ టోన్డ్ మిల్క్ ధర ప్రస్తుతం లీటరుకు రూ. 46 ఉండగా, తాజా పెంపుతోరూ. 54 కు పెరగనుంది. మరోవైపు కొత్తగా పెంచిన రూ. 8 లలో రూ. 7 నేరుగా పాల ఉత్పత్తిదారులకు, మిగిలిన రూపాయి మిల్క్ యూనియన్లకు చేరుతుందని కర్ణాటక మంత్రి కృష్ణ బైరేగౌడ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పాడి పరిశ్రమపై ఆధారపడిన దాదాపు 10 లక్షల రైతు కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?
కారణాలు
పశువుల మేత, మందులు, రవాణా, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరగడం. కరువు పరిస్థితుల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడటంతో పాల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కాగా ఇటీవలి సంవత్సరాల్లో నందిని పాల ధరలు ఇటీవల పెరగడం ఇది ఐదోసారి.
ఇదీ చదవండి: నెక్ట్స్ లెవల్ : దోసె, ఫిల్టర్ కాఫీకి జర్మన్ యువకుడు ఫిదా!


