కర్ణాటకలో ఎస్‌ఐఆర్‌ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్‌! | Nearly one crore voters vanish from Karnataka electoral roll after SIR | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఎస్‌ఐఆర్‌ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్‌!

Oct 27 2026 4:37 PM | Updated on Oct 27 2026 4:56 PM

Nearly one crore voters vanish from Karnataka electoral roll after SIR

సాక్షి, బెంగళూరు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై  దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం కొనసాగుతున్నవేళ కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం 129 రోజుల పాటు సాగిన ప్రక్రియ అనంతరం ఓటర్లకు సంబంధించితుది ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ నూతన జాబితా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 4.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో జూన్ 16 నాటికి 5.54 కోట్ల ఓట్లలొ  సుమారు కోటిమంది ఓట్లు  గల్లంతు కావడం ఆందోళన రేపుతోంది. 

ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ప్రచురించిన తుది జాబితా ప్రకారం, ఎస్‌ఐఆర్‌ కింద కర్ణాటక తుది ఓటర్ల జాబితాలో, సవరణకు ముందుతో పోలిస్తే 99.32 లక్షలకు పైగా ఓటర్లు తగ్గిపోయారు.  ఫలితంగా  రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.55 కోట్లకు పడిపోయింది. ముసాయిదా దశలో, 1.07 కోట్లకు పైగా పేర్లను తొలగించగా తుది జాబితాలో  కేవలం 8.64 లక్షల ఓటర్లు చేరడం గమనార్హం.  

ఇదీ చదవండి: 15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌

 రాష్ట్రంలో తుది జాబితాలో 2.25 కోట్లకు పైగా పురుష ఓటర్లు, 2.29 కోట్ల మహిళా ఓటర్లు, 2,841 మంది  థర్డ్‌ జెండర్‌  ఓటర్లు ఉన్నారు. అలాగే  18 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు 6.83 లక్షలకు పైగా  85 ఏళ్లు పైబడిన 3.92 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

ఓటర్లు ECI వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమ జిల్లా, నియోజకవర్గం,పార్ట్ నంబర్‌  ఎంటర్‌  చేసి తమ 'పార్ట్ నంబర్' ఇంకా  'సీరియల్ నంబర్'  వివరాలను తెలుసుకోవచ్చు. ఈ జాబితాలను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు (Voter ID card) పై ఉన్న సీరియల్ నంబర్‌ను ఉపయోగించి కూడా తమ వివరాలను సరిచూసుకోవచ్చు.

ఓటర్లు ఈ లింక్ ద్వారా తమ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు: https://voters.eci.gov.in/download-eroll?stateCode=S10

ఇదీ చదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగ పందెంలో కవితకు ఓటమి
దీపావళి ధమాకా : ఆ ఉద్యోగులకు సరికొత్త కియా కార్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement