కర్ణాటక: హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా బంకాపుర పట్టణంలో మీటర్ వడ్డీ మాఫియా రెచ్చిపోయింది. వడ్డీ కట్టలేదనే కారణంతో వ్యక్తిని కిడ్నాప్ చేసి 4 రోజులపాటు నిర్భంధించారు. సిగరెట్లతో కాలుస్తూ.. నోట్లో మూత్రం పోసి రాక్షసానందం పొందారు. వివరాలు.. స్థానికంగా బేకరీలో పని చేస్తున్న మణికంఠ అనే వ్యక్తి మంజునాథ్, నవీన్ అనే వడ్డీ వ్యాపారుల నుంచి వారం వడ్డీకి రూ.70 వేలు అప్పు తీసుకున్నాడు. వారానికి రూ.70 వేలకు ఏకంగా రూ.2,000 వడ్డీ చెల్లించేవాడు. అయితే కొన్ని రోజుల నుంచి మణికంఠ వడ్డీ కట్టలేకపోయాడు.
వడ్డీ చెల్లించలేదని కోపంతో అక్టోబర్ 16న మణికంఠను మంజునాథ్, నవీన్ కిడ్నాప్ చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి ఒక గదిలో నిర్భంధించి 4 రోజులపాటు చిత్రంహింసలకు గురి చేశారు. అంతటితో ఆగకుండా నోట్లో మూత్రం పోసి, సిగరెట్లతో కాల్చి వేధించారు. అక్టోబర్ 20న అపరిచిత వ్యక్తి సాయంతో మణికంఠ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి మంజునాథ్, నవీన్, గణేశ్, సునిల్ అనే నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: పంటకు కాపలాగా అందాల భామలు


