నన్ను క్షమించు బుజ్జీ.. మూడుసార్లు తప్పు చేశా.. పాప జాగ్రత్త..! | Bhongir Shocker, Young Private Finance Employee Dies By Suicide After Falling Into Debt Due To Online Betting Apps | Sakshi
Sakshi News home page

నన్ను క్షమించు బుజ్జీ.. మూడుసార్లు తప్పు చేశా.. పాప జాగ్రత్త..!

Oct 27 2026 9:43 AM | Updated on Oct 27 2026 10:29 AM

Online Betting Debt Young Man Died Incident Bhongir Telangana

భరత్‌కుమార్‌ (ఫైల్‌)

భార్యకు వాట్సాప్‌ మెసేజ్‌ చేసి భర్త అఘాయిత్యం

భువనగిరిటౌన్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల మాయాజాలంలో చిక్కుకుని, చేసిన అప్పులు తీర్చలేక ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్‌కుమార్‌ (35) మూడేళ్లుగా భువనగిరి పట్టణంలో నివాసముంటూ ఓ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉంది. 

గతంలో భరత్‌కుమార్‌ బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు 115 గజాల ప్లాటు, 10 గుంటల వ్యవసాయ భూమిని అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాత కొంతకాలం హైదరాబాద్‌ ఉప్పల్‌లో నివాసం ఉండి, పెద్దల సమక్షంలో సయోధ్య కుదిరాక భువనగిరికి తిరిగొచ్చాడు.

ప్రస్తుతం భార్య కాన్పుకోసం తన పుట్టినిల్లు అయిన బొమ్మలరామారం మండలం తిరుమలాపురానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య వాట్సాప్‌కు భరత్‌ వరుస సందేశాలు పంపించాడు. ‘నన్ను క్షమించు బుజ్జీ.. ఒకసారి కాదు మూడుసార్లు తప్పు చేశాను.. నన్ను ఎవరూ క్షమించరు.. పాపను జాగ్రత్తగా చూసుకో.. బై’అంటూ మెసేజ్‌ చేశాడు. అనంతరం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముఖ్య గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com

ఇదీ చదవండి: మీ కూతురును తీసుకెళ్లండి.. లేకుంటే చంపేస్తాను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement