సాక్షి, హైదరాబాద్: ప్రయాణికురాలి దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళికను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ వెంకన్న సోమవారం పరామర్శించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. కండక్టర్‌పై దాడికి పాల్పడ్డ మహిళపై చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ


