అయ్యలారా.. కొడుకులు పట్టించుకుంటలే.. | Elderly Couples In Karimnagar Approach Collector Over Sons Alleged Neglect After Property Transfer | Sakshi
Sakshi News home page

అయ్యలారా.. కొడుకులు పట్టించుకుంటలే..

Oct 27 2026 9:08 AM | Updated on Oct 27 2026 9:38 AM

Karimnagar Elderly Parents Property Dispute Telangana

కరీంనగర్‌ ప్రజావాణిలో ఒక్కరోజు 3 ఫిర్యాదులు

కరీంనగర్‌ అర్బన్‌: వృద్ధాప్యంలో తమను వదిలేశారని రోదిస్తూ కలెక్టరేట్‌ను ఆశ్రయించారు వృద్ధ దంపతు లు. సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌తో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఒకే రోజు మూడు ఫిర్యాదులు రావడం వృద్ధుల సమస్య తీవ్రతను చాటుతోంది.

సైదాపూర్‌ మండలం శ్రీరాములపల్లెకు చెందిన మండల లచ్చవ్వ, మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన శీలం లచ్చవ్వ–మల్లయ్య, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన మేదరబోయిన భూలక్ష‍్మి(అంధురాలు)–బాలయ్య దంపతులు తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు.

తమ కుమారులు ఆస్తులను అనుభవిస్తూ తమ బాగోగులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆస్తులను కొడుకుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేశామని అప్పటి నుంచి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకుంటే తమకు చావే శరణ్యమని అంటున్నారు.

ఇదీ చదవండి: మీ కూతురును తీసుకెళ్లండి.. లేకుంటే చంపేస్తాను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement