హైదరాబాద్: తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు ప్యారడైజ్ హోటల్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేలు జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్–16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్‌లో నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో నీటిని పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు. తాగునీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.


