పిల్లర్‌ నంబర్లు లేని స్టీల్‌ బ్రిడ్జి.. | Saidabad Steel Bridge Yet To Get Pillar Numbers, Causing Inconvenience To Locals, Check More Details | Sakshi
Sakshi News home page

పిల్లర్‌ నంబర్లు లేని స్టీల్‌ బ్రిడ్జి..

Oct 27 2026 9:00 AM | Updated on Oct 27 2026 9:42 AM

No Pillar Numbers Saidabad Steel Bridge

సైదాబాద్‌(హైదరాబాద్): నగరంలోనే అతి పెద్దదైన సైదాబాద్‌ స్టీల్‌బ్రిడ్జి నిర్వహణలో కొంత నిర్లక్ష్యం కనిపస్తోంది. 88 పిల్లర్లతో మలక్‌పేట ఫైర్‌ స్టేషన్‌ వద్ద ప్రారంభమై..సంతోష్‌ నగర్‌లోని యాదగిరి థియేటర్‌ వద్ద పూర్తయ్యే 3.23 కిలోమీటర్ల పొడవైన స్టీల్‌ బ్రిడ్జితో ట్రాఫిక్‌కు ఎంతో రిలీఫ్‌ ఏర్పడింది. సెప్టెంబర్ 3న సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లపై నంబర్లు వేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో స్థానికులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. 

అడ్రస్‌లు గుర్తించడం, అవసరమైన చోట యూటర్న్‌లు తీసుకోవడంలో పిల్లర్లపై వేసే నెంబర్లు కీలకం. వీటిని స్థానికులు తమ చిరునామాల్లోనూ నమోదు చేస్తారు. దీంతో వాహనదారులు సాఫీగా తమ గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. బ్రిడ్జికి ఎక్కడైనా మరమ్మతు పనులు నిర్వహించాలన్నా పిల్లర్లకు నెంబర్లు ఉంటే ఎంతో అనువుగా ఉంటుంది. 

నెంబర్ల ఆధారంగా ఎక్కడ మరమ్మతులు చేయాలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సులువుగా తెలుసుకోవచ్చు. బ్రిడ్జి కింద ఏదైనా అనుకోని సంఘటనలు కానీ, ప్రమాదాలు కానీ చోటుచేసుకుంటే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది నెంబర్ల ద్వారా వేగంగా అక్కడికి చేరుకోగలుగుతారు. తద్వారా ఆ ఘటనల్లో తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం ఉంటుంది. స్టీల్‌బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అక్బర్‌బాగ్, చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్‌సదన్, మాదన్నపేట, సంతోష్‌నగర్‌ డివిజన్ల పరిధిలోని ఎన్నో కాలనీలు, బస్తీలవాసులు రాకపోకలు సాగించడానికి పిల్లర్ల నెంబర్లు ఉపయుక్తంగా ఉంటాయని, వెంటనే అధికారులు స్పందించాలని సైదాబాద్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు గంగిశెట్టి రాజేష్‌ పేర్కొన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement