breaking news
steel bridge
-
హైదరాబాద్‌లో మరో స్టీల్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఎలివేటెడ్ స్టీల్‌బ్రిడ్జి కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. వీఎస్టీ నుంచి అశోక్‌నగర్ వరకు నిర్మించిన బ్రిడ్జి తరహాలోనే ప్యారడైజ్– శామీర్‌పేట్ మధ్య 18.18 కి.మీ మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.4,263 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ బేకమ్ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ (Shamirpet ORR Junction) వరకు నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ మీదుగా రాజీవ్ రహదారికి రాకపోకలు సాగించవచ్చు. నగరానికి ఉత్తరం వైపున మేడ్చల్ రూట్లో ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు చేపట్టిన మరో ఎలివేటెడ్ కారిడార్‌తో రెండు మార్గాల్లోనూ ప్రయాణ సదుపాయాలు మెరుగుపడతాయి. స్టీల్ బ్రిడ్జి ఎలివేటెడ్ కారిడార్ ఇలా.. ⇒ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కి.మీ. నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ వద్ద 6 లేన్లతో టన్మెల్ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ (Alwal) వద్ద రెండు చోట్ల వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్లు ఉంటాయి. ⇒ ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీల మార్గంలో 114.50 ఎకరాల రక్షణశాఖ భూములను, 8.35 కి.మీ.మార్గంలో 78.39 ఎకరాల ప్రైవేట్ భూ ములను సేకరించారు. 967 నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది. వేగిరంగా డెయిరీఫామ్ కారిడార్.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ వరకు 5.40 కి.మీ వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ (elevated corridor) నిర్మాణ పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ పనులు 36 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్, నిజామాబాద్ మార్గంలో రాకపోకలు సులభతరమవుతాయి. -
మంత్రి తలసాని క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్‌బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. పక్కనున్న ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో కాలికి గాయం అయ్యిందని ఆ సందర్భంగానే వ్యక్తిని నెట్టివేశానని అన్నారు మంత్రి తలసాని. సోషల్ మీడియాలో కావాలనే ఈ ఘటనను పెద్దది చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. తను తోసేసిన వ్యక్తి రాజేష్ బాబు అని, గిరిజన బిడ్డ తర్వాతే తెలిసిందని, వెంటనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై గిరిజనుల మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని చెప్పారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని, తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’ -
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Indira Park to RTC X Road : నేడు దక్షిణ భారతదేశంలోనే తొలి అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి ప్రారంభం (ఫొటోలు)


