శవాలను తవ్వి.. అమ్మేస్తున్నారు | Illegal trade of human remains discovered at Raichur | Sakshi
Sakshi News home page

శవాలను తవ్వి.. అమ్మేస్తున్నారు

Oct 26 2026 1:02 PM | Updated on Oct 26 2026 1:30 PM

Illegal trade of human remains discovered at Raichur

కర్ణాటక: ఎవరైనా మరణిస్తే కుటుంబీకులు విలపించి మృతదేహాలను శ్మశానంలో పూడ్చిపెడతారు. కానీ చనిపోయిన తరువాత కూడా మనశ్శాంతి ఉండడం లేదు. వాటిని వెలికితీసి అమ్మేస్తున్న ముఠా రాయచూరులో గుట్టు రట్టయింది.  

ఆ మరుసటి రోజే..  
నగరంలోని మారుతి నగరలోని శ్మశానంలో శవాలకు అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే వాటిని వెలికి తీసి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలకు అప్పగిస్తున్న వైనం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి తెలిపారు. ఇంకా లోతుగా విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంతకాలం నుంచి ఈ దందా సాగుతోందో గుర్తించడానికి విచారణా బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చాలా కుటుంబాలు తమ వారి శవాలు ఉన్నాయో, లేదోనని వెళ్లి తనిఖీ చేసుకుంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement